Qurani Kərimin mənaca tərcüməsi - Toluğu dilinə tərcümə- Əbdurrahim bin Məhəmməd.

external-link copy
4 : 5

یَسْـَٔلُوْنَكَ مَاذَاۤ اُحِلَّ لَهُمْ ؕ— قُلْ اُحِلَّ لَكُمُ الطَّیِّبٰتُ ۙ— وَمَا عَلَّمْتُمْ مِّنَ الْجَوَارِحِ مُكَلِّبِیْنَ تُعَلِّمُوْنَهُنَّ مِمَّا عَلَّمَكُمُ اللّٰهُ ؗ— فَكُلُوْا مِمَّاۤ اَمْسَكْنَ عَلَیْكُمْ وَاذْكُرُوا اسْمَ اللّٰهِ عَلَیْهِ ۪— وَاتَّقُوا اللّٰهَ ؕ— اِنَّ اللّٰهَ سَرِیْعُ الْحِسَابِ ۟

వారు (ప్రజలు) తమ కొరకు ఏది ధర్మ సమ్మతం (హలాల్) అని నిన్ను అడుగు తున్నారు. నీవు ఇలా అను: "పరిశుద్ధ వస్తువులన్నీ మీ కొరకు ధర్మసమ్మతం (హలాల్) చేయబడ్డాయి. మరియు మీకు అల్లాహ్ నేర్పిన విధంగా మీరు వేట శిక్షణ ఇచ్చిన జంతువులు[1] మీ కొరకు పట్టినవి కూడా! కావున అవి మీ కొరకు పట్టుకున్న వాటిని మీరు తినండి కాని దానిపై అల్లాహ్ పేరును ఉచ్ఛరించండి.[2] అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు." info

[1] వేట నేర్పి, వేటాడటానికి ఉపయోగపడే జంతువులు పక్షులు మొదలైనవి ఉదా: కుక్క, చిరుతపులి, డేగ మొదలైనవి. [2] ఇక్కడ రెండు షరతులున్నాయి: 1) వేట జంతువును విడుచునప్పుడు బిస్మిల్లా హిర్ర'హ్మా నిర్ర'హీమ్, అనాలి. 2) ఆ వేట జంతువు పట్టిన దానిని తన యజమాని కొరకు వదలాలి, దానిని అది తినగూడదు. అట్టి జంతువు పట్టిన దానిని చంపినా తన యజమాని వచ్చేవరకు దానిని తినగూడదు. అట్టి జంతువు చనిపోయినా, అది 'హలాల్. వేటలో యజమాని విడిచిన వేట జంతువు తప్ప. మరొక జంతువు పాల్గొనరాదు. ఇదే ఆజ్ఞ బాణానికి కూడా వర్తిస్తుంది. ('స'హీ'హ్ బు'ఖారీ, ముస్లిం).

التفاسير: