Qurani Kərimin mənaca tərcüməsi - Toluğu dilinə tərcümə- Əbdurrahim bin Məhəmməd.

external-link copy
26 : 2

اِنَّ اللّٰهَ لَا یَسْتَحْیٖۤ اَنْ یَّضْرِبَ مَثَلًا مَّا بَعُوْضَةً فَمَا فَوْقَهَا ؕ— فَاَمَّا الَّذِیْنَ اٰمَنُوْا فَیَعْلَمُوْنَ اَنَّهُ الْحَقُّ مِنْ رَّبِّهِمْ ۚ— وَاَمَّا الَّذِیْنَ كَفَرُوْا فَیَقُوْلُوْنَ مَاذَاۤ اَرَادَ اللّٰهُ بِهٰذَا مَثَلًا ۘ— یُضِلُّ بِهٖ كَثِیْرًا وَّیَهْدِیْ بِهٖ كَثِیْرًا ؕ— وَمَا یُضِلُّ بِهٖۤ اِلَّا الْفٰسِقِیْنَ ۟ۙ

నిశ్చయంగా, అల్లాహ్ దోమ లేక దాని కంటే చిన్నదాని దృష్టాంతం ఇవ్వటానికి సంకోచించడు. కావున విశ్వసించిన వారు, ఇది తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమే అని గ్రహిస్తారు. కాని సత్యతిరస్కారులు, వాటిని విని: "ఈ ఉపమానాల ద్వారా అల్లాహ్ చెప్పదలుచుకున్నది ఏమిటి?" అని ప్రశ్నిస్తారు. ఈ విధంగా ఆయన ఎంతోమందిని మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడు. మరియు ఎంతోమందికి సన్మార్గం కూడా చూపుతాడు. మరియు ఆయన కేవలం దుష్టులనే[1] మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడు. info

[1] ఫాసిఖున్: అంటే దైవవిధేయతా హద్దులను అతిక్రమించిన వాడు (అవిధేయుడు), మార్గభ్రష్టుడు, దుష్టుడు, దుర్జనుడు, భక్తి లేని వాడు అనే అర్థాలున్నాయి. "ఎవడు ఏ వైపునకు పోదలచు కుంటాడో మేము అతనిని ఆ వైపునకే మరల్చుతాము." చూడండి, 4:115. అల్లాహ్ (సు.తా.) మానవులకు మరియు జిన్నాతులకు మంచి చెడులను తెలుసుకునే విచక్షణా శక్తీ, బుద్ధీ ఇచ్చాడు. కాబట్టి, వారికి పరలోక జీవితంలో, వారి కర్మల ప్రకారం, స్వర్గ/నరకాలు ఉన్నాయి. అల్లాహుతా' ఆలా ప్రవక్తల మరియు దివ్యగ్రంథాల ద్వారా వారికి సత్యాసత్యాలను, మంచి / చెడులను బోధించాడు. వాటిని అనుసరించటం వల్ల పొందే పరలోక ప్రతిఫలాలను (స్వర్గ / నరకాలను) కూడా విశదం చేశాడు. కావున వారిని మంచి / చెడు మార్గాలను అనుసరించటానికి బలవంతం చేయడు. వారిని వారి మార్గాలలో వదలి పెడతాడు. అల్లాహ్ (సు.తా.) కు జరిగిపోయింది, జరుగుతున్నది మరియు ముందు జరగబోయేది అంతా తెలుసు కాబట్టి ఎవరు నరకవాసులు కానున్నారో మరియు ఎవరు స్వర్గవాసులు కానున్నారో కూడా తెలుసు. ఇదంతా గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ ఈ విధంగా పేర్కొనబడింది. అల్లాహ్ (సు.తా.) ఎవరిని కూడా బలవంతంగా నరకంలోకి త్రోయడు. వారి కర్మలే, వారిని దానికి అర్హులుగా చేస్తాయి. ఇలాంటి వాక్యం ఖుర్ఆన్ లో అనేక సార్లు వచ్చింది. ప్రతి చోటా దీని తాత్పర్యం ఇదే.

التفاسير: