రోగాలు,అంధులు లాంటి కారణాలు లేని వారు అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం నుండి కూర్చుండిపోయిన విశ్వాసులు మరియు తమ సంపదలను,తమ ప్రాణములను ఖర్చు చేసి అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం చేసేవారు సమానులు కాజాలరు. తమ సంపదలను,తమ ప్రాణములను ఖర్చు చేసి ధర్మపోరాటం చేసే వారిని ధర్మపోరాటం నుండి కూర్చుండిపోయే వారిపై అల్లాహ్ స్థాన పరంగా ఉన్నతం చేశాడు. ధర్మ పోరాటకుల్లోంచి మరియు ఏదైన కారణం చేత ధర్మపోరాటం నుండి కూర్చుండిపోయే వారికి ప్రతి ఒక్కరి కొరకు వారికి తగినటువంటి ప్రతిఫలం కలదు. మరియు అల్లాహ్ ధర్మపోరాటకులకు తన వద్ద నుండి గొప్ప ప్రతిఫలం ప్రసాదించి ధర్మపోరాటం నుండి కూర్చుండిపోయే వారిపై ఉన్నతం చేశాడు.
ఈ ప్రతిఫలం కొందరి స్థానాలు కొందరిపై వారి పాపముల మన్నింపుతో మరియు వారిపై ఆయన కారుణ్యముతో ఉంటాయి. మరియు అల్లాహ్ తన దాసులను మన్నించేవాడును మరియు వారిపై కరుణించేవాడును.
నిశ్చయంగా దైవదూతలు అవిశ్వాసమున్న ప్రదేశము నుండి విశ్వాసమున్న ప్రదేశమునకు వలసపోవటంను వదిలివేసి తమ స్వయమునకు అన్యాయం చేసుకుంటూ ఉండే వారి ప్రాణములు తీస్తారు. వారి ఆత్మలను సేకరించే పరిస్థితిలో వారితో దైవదూతలు మందలిస్తూ ఇలా పలుకుతారు : మీరు ఏ స్థితిలో ఉండేవారు ?. మరియు మీరు దేనితో ముష్రికుల నుండి వేరు చేసుకున్నారు ?. అప్పుడు వారు సాకులు చూపుతూ ఇలా జవాబిస్తారు : మేము బలహీనులముగా ఉండేవారము. మేము మా ప్రాణముల నుండి తొలగించటానికి మాకు ఎటువంటి శక్తి గాని సామర్ధ్యము గానీ లేదు. అప్పుడు దైవ దూతలు వారిని మందలిస్తూ ఇలా పలుకుతారు : అవమానము నుండి,ఆధిక్యత నుండి మీ ధర్మమును,మీ ప్రాణములను మీరు రక్షించుకోవటానికి మీరు వలస వెళ్ళటానికి అల్లాహ్ భూమి విశాలంగా లేదా ?. వలస వెళ్ళని వీరందరు నివాసముండే శరణాలయం నరకాగ్నే. మరియు ఆ మరలే చోటు మరియు వారి నివాసము చెడ్డదైనది.
అన్యాయమును,అణచివేతను తమ నుండి తొలగించుకునే శక్తి లేని,తమ అణచివేతను వదిలించుకోవటానికి మార్గం పొందని కారణాలు కలిగిన బలహీనులైన పురుషులు,స్త్రీలు,పిల్లలు ఈ శిక్ష నుండి మినహాయించబడతారు. వీరందరిని అల్లాహ్ తన కారుణ్యముతో మరియు తన దయతో మన్నించివేస్తాడేమో. మరియు అల్లాహ్ తన దాసులను మన్నించేవాడును మరియు వారిలో నుండి పశ్చాత్తాప్పడేవారిని క్షమించేవాడును.
అన్యాయమును,అణచివేతను తమ నుండి తొలగించుకునే శక్తి లేని,తమ అణచివేతను వదిలించుకోవటానికి మార్గం పొందని కారణాలు కలిగిన బలహీనులైన పురుషులు,స్త్రీలు,పిల్లలు ఈ శిక్ష నుండి మినహాయించబడతారు. వీరందరిని అల్లాహ్ తన కారుణ్యముతో మరియు తన దయతో మన్నించివేస్తాడేమో. మరియు అల్లాహ్ తన దాసులను మన్నించేవాడును మరియు వారిలో నుండి పశ్చాత్తాప్పడేవారిని క్షమించేవాడును.
మరియు ఎవరైతే అవిశ్వాసమున్న ప్రదేశం నుండి ఇస్లాం ఉన్న ప్రదేశము వైపునకు అల్లాహ్ మన్నతను ఆశిస్తూ హిజ్రత్ చేసి వెళ్తాడో అతడు తాను హిజ్రత్ చేసి వెళ్ళిన భూమిలో మార్పును మరియు తాను వదిలి వచ్చిన భూమికి వేరుగా భూమిని పొందుతాడు. అందులో అతడు గౌరవమును మరియు విశాలమైన ఆహారోపాధిని పొందుతాడు. మరియు ఎవరైతే తన నివాసము నుండి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపునకు హిజ్రత్ చేస్తూ బయలుదేరుతాడో ఆ పిదప అతను తన హిజ్రత్ చేసే ప్రదేశమునకు చేరక ముందే అతనికి మరణం సంభవిస్తే నిశ్చయంగా అతని పుణ్యం అల్లాహ్ వద్ద నిరూపితమై ఉంటుంది. మరియు అతను తన హిజ్రత్ చేసే ప్రదేశమునకు చేరలేదని ఆయన అతనికి నష్టం కలిగించడు. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్ఛాత్తాప్పడిన వారికి మన్నించే వాడును,వారిపై కరుణించేవాడును.
మరియు మీరు భూమిపై ప్రయాణిస్తే, నాలుగు రాకాత్ ల నుండి రెండు రాకాత్ ల వరకు నాలుగు రకాతుల నమాజును ఖసర్ చేయటంలో మీకు ఏ పాపమూ లేదు, అవిశ్వాసులచే ద్వేషించబడినదేదైనా మిమ్మల్ని తాకుతుందని మీరు భయపడితే. మీకు అవిశ్వాసుల శత్రుత్వం ఒక స్పష్టమైన ప్రత్యక్షమైన శత్రుత్వం, మరియు శాంతి పరిస్థితిలో ప్రయాణంలో ఖసర్ చేయటం సమ్మతం అన్న విషయం సరైన సున్నత్ ద్వారా నిరూపించబడింది.
التفاسير:
من فوائد الآيات في هذه الصفحة:
• فضل الجهاد في سبيل الله وعظم أجر المجاهدين، وأن الله وعدهم منازل عالية في الجنة لا يبلغها غيرهم.
అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం చేయటం యొక్క ప్రాముఖ్యత. మరియు ధర్మపోరాటకుల ప్రతిఫలం యొక్క గొప్పతనం. మరియు నిశ్చయంగా అల్లాహ్ వారికి స్వర్గంలో ఉన్నత స్థానాల వాగ్దానం చేశాడు. వాటికి ఇతరులు చేరుకోరు.
• أصحاب الأعذار يسقط عنهم فرض الجهاد مع ما لهم من أجر إن حسنت نيتهم.
కారణం కలవారి నుండి జిహాద్ అనివార్యం అవటం తొలిగిపోతుంది దానికి తోడు వారి ఉద్ధేశములు మంచివైతే వారికి గల పుణ్యం వారికి ఉంటుంది.
• فضل الهجرة إلى بلاد الإسلام، ووجوبها على القادر إن كان يخشى على دينه في بلده.
ఇస్లాం ఉన్న ప్రాంతములకు హిజ్రత్ చేయటం యొక్క ప్రాముఖ్యత. మరియు తన ఊరిలో తన ధర్మం గురించి భయం ఉంటే సామర్ధ్యం (హిజ్రత్ చేయటంపై) కలవాడిపై అది అనివార్యం అవుతుంది.
• مشروعية قصر الصلاة في حال السفر.
ప్రయాణ స్థితిలో నమాజును ఖసర్ చేయటం ధర్మబద్ధం చేయబడింది.