ఈ చెడు విశ్వాసాలను కలిగిన వారందరిని అల్లాహ్ తన కారుణ్యము నుండి గెంటివేస్తాడు. మరియు ఎవరినైతే అల్లాహ్ గెంటివేస్తాడో అతని కొరకు నీవు ఎవరిని సహాయం చేయటానికి సహాయకుడిగా పొందవు.
రాజ్యములో ఏ మాత్రం భాగం వారి కొరకు లేదు. ఒక వేళ వారి కొరకు అది ఉంటే వారు అందులో నుంచి ఏ మాత్రం ఎవరికీ ఇవ్వరు. ఒక వేళ అది ఖర్జూరపు టెంకపై ఉన్న చీలిక పరిమాణంలో ఉన్నా కూడా.
లేదా వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన అనుచరులపై వారికి అల్లాహ్ ఏదైతే దైవదౌత్యము,విశ్వాసము,భూమిపై సాధికారత ప్రసాదించాడో ఆ విషయంలో అసూయపడుతున్నారా. అయితే వారు వారిపై ఎందుకు అసూయపడుతున్నారు వాస్తవానికి ఇబ్రాహీమ్ సంతతికి మేము అవతరింపబడిన గ్రంధమును అనుగ్రహించిన విషయం ముందే తెలుసు. మేము వారి వైపు గ్రంథము తప్ప ఇంకేమి అవతరింపజేయలేదు. మరియు మేము వారికి ప్రజలపై విశాల సామ్రాజ్యాధికారమును ప్రసాదించాము.
గ్రంధవహుల్లోంచి అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాంపై మరియు ఆయన సంతానములో నుంచి తన ప్రవక్తలపై అవతరింపజేసిన వాటిని విశ్వసించినవారున్నారు మరియు వారిలో నుండి ఆయనపై విశ్వాసం కనబరచటం నుండి విముఖత చూపినవారూ ఉన్నారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేయబడినది ఏదైతే ఉన్నదో దాని నుండి వారి స్థానం ఇది. మరియు నరకాగ్నియే వారిలో నుండి తిరస్కరించిన వారి కొరకు సరిఅగు శిక్ష.
నిశ్ఛయంగా మా ఆయతులను తిరస్కరించిన వారిని మేము ప్రళయదినమున నరకాగ్నిలో ప్రవేశింపజేస్తాము అది వారిని చుట్టుముట్టుతుంది. వారి చర్మములు కాలిపోయినప్పుడల్లా మేము వారికి వేరే చర్మములను మార్చి వేస్తాము వారిపై శిక్ష పదేపదే కొనసాగటానికి. నిశ్ఛయంగా అల్లాహ్ ఏదీ ఓడించలేని సర్వాధిక్యుడు మరియు తాను పర్యాలోచన చేసి తీర్పునిచ్చే దాని విషయంలో వివేచనాపరుడు.
మరియు ఎవరైతే అల్లాహ్ ను విశ్వసిస్తారో మరియు ఆయన ప్రవక్తలను అనుసరిస్తారో మరియు విధేయకార్యాలు చేస్తారో వారిని మేము తొందరలోనే ప్రళయదినమున స్వర్గవనాల్లో ప్రవేశింపజేస్తాము వాటి భవనముల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తుంటాయి. వారు వాటిలో శాశ్వతంగా ఉంటారు. వారి కొరకు ఈ స్వర్గ వనాల్లో ప్రతీ వ్యర్ధము నుండి పరిశుద్ధులైన భార్యలుంటారు. మరియు మేము వారిని విస్తారమైవ దట్టమైన నీడలో ప్రవేశింపజేస్తాము. అందులో ఎటువంటి వేడి ఉండదు మరియు చల్లదనం ఉండదు.
నిశ్ఛయంగా మీకు ఏదైతే అమానత్ గా అప్పజెప్పబడిందో దాన్ని వారి హక్కుదారులకు చేరవేయమని అల్లాహ్ మీకు ఆదేశిస్తున్నాడు. మరియు మీరు ప్రజల మధ్య తీర్పు ఇచ్చినప్పుడు మీరు న్యాయంగా వ్వహరించాలని మరియు తీర్పునివ్వటంలో మీరు దుర్మార్గం వైపుకు మరలకూడదని మీకు ఆదేశించాడు. నిశ్చయంగా అల్లాహ్ మీకు ఏదైతే హితబోధన చేస్తున్నాడో మరియు మీ స్థితులన్నింటిలో దేని వైపునైతే ఆయన మీకు మార్గనిర్దేశకం చేస్తున్నాడో ఎంతో గొప్పది. నిశ్చయంగా అల్లాహ్ మీ పలుకులను బాగా వినేవాడును మరియు మీ కర్మలను బాగా చూసేవాడును.
ఓ అల్లాహ్ ను విశ్వసించి,ఆయన ప్రవక్తను అనుసరించేవారా మీరు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి విధేయత చూపండి. మరియు మీ వ్యవహారాల సంరక్షకులకు వారు అవిధేయత గురించి ఆదేశించనంత వరకు విధేయత చూపండి. ఒక వేళ మీరు ఏదైన విషయంలో విభేదించుకుంటే ఆ విషయంలో మీరు అల్లాహ్ గ్రంధం వైపునకు మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ వైపునకు మరలండి ఒక వేళ మీరు అల్లాహ్ను మరియు అంతిమ దినంను విశ్వసించినవారే అయితే. గ్రంధం వైపునకు మరియు సున్నత్ వైపునకు ఈ మరలటం విభేధమును పొడిగించి,అభిప్రాయాలు చెప్పటం కంటే మేలైనది మరియు మీ కొరకు ఉత్తమ పర్యవసానం కలది.
التفاسير:
من فوائد الآيات في هذه الصفحة:
• من أعظم أسباب كفر أهل الكتاب حسدهم المؤمنين على ما أنعم الله به عليهم من النبوة والتمكين في الأرض.
విశ్వాసపరులకు అల్లాహ్ అనుగ్రహించిన దైవదౌత్యము మరియు భూమిలో సాధికారత వలన గ్రంధవహులకు వారి పట్ల కల అసూయ గ్రంధవహుల అవిశ్వాసమునకు పెద్ద కారణం.
• الأمر بمكارم الأخلاق من المحافظة على الأمانات، والحكم بالعدل.
అమానతుల పరిరక్షణ మరియు న్యాయంగా వ్యవహరించటం గురించి ఆదేశించటం లాంటి ఉత్తమ సద్గుణాల గురించి ఆదేశం.
• وجوب طاعة ولاة الأمر ما لم يأمروا بمعصية، والرجوع عند التنازع إلى حكم الله ورسوله صلى الله عليه وسلم تحقيقًا لمعنى الإيمان.
అధికారం అప్పగించబడినవారికి వారు అవిధేయత గురించి ఆదేశించనంత వరకు విధేయత చూపటం అనివార్యమవటం మరియు విభేదాల సమయంలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశం వైపునకు మరలటం విశ్వాసము యొక్క అర్ధమును నిరూపిస్తుంది.