የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቴሉጉ ቋንቋ ትርጉም - በዐብዱረሒም ኢብኑ ሙሐመድ

అల్-ముర్సలాత్

external-link copy
1 : 77

وَالْمُرْسَلٰتِ عُرْفًا ۟ۙ

ఒకదాని తరువాత ఒకటి, వరుసగా పంపబడే వాయువుల సాక్షిగా[1]! info

[1] లేక దేవదూతల, లేక సందేశహరుల సాక్షిగా అని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం. 'ఉర్ ఫన్ - అంటే దివ్యజ్ఞానం (వ'హీ) లేక షరీయత్ ఆజ్ఞలని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం.

التفاسير:

external-link copy
2 : 77

فَالْعٰصِفٰتِ عَصْفًا ۟ۙ

మరియు తీవ్రమైన వేగతో వీచే వాయువుల సాక్షిగా[1]! info

[1] లేక దేవదూతల సాక్షిగా! ఎవరైతే తీవ్రంగా వీచే గాలులతో సహా పంపబడతారో!

التفاسير:

external-link copy
3 : 77

وَّالنّٰشِرٰتِ نَشْرًا ۟ۙ

మరియు మేఘాలను దూరదూరంగా వ్యాపింపజేసే వాయువుల సాక్షిగా[1]! info

[1] లేక దేవదూతల సాక్షిగా!' ఇబ్నె-కసీ'ర్, 'తబరీ మరియు ఇతర చాలా మంది వ్యాఖ్యాతలు కూడా (ర హ్మ). ఈ మూడు ఆయతులలో గాలుల ప్రస్తావన ఉందనే అభిప్రాయపడ్డారు.

التفاسير:

external-link copy
4 : 77

فَالْفٰرِقٰتِ فَرْقًا ۟ۙ

మరియు మంచి చెడులను విశదపరచే (దైవదూతల) సాక్షిగా[1]! info

[1] లేక ఖుర్ఆన్ ఆయతుల లేక ప్రవక్తల సాక్షిగా.

التفاسير:

external-link copy
5 : 77

فَالْمُلْقِیٰتِ ذِكْرًا ۟ۙ

సందేశాలను ప్రవక్తల వద్దకు తెచ్చే (దైవదూత) సాక్షిగా![1] info

[1] లేక అల్లాహ్ (సు.తా.) యొక్క వ'హీని ప్రజలకు అందజేసే ప్రవక్త ('అలైహిమ్ స.) ల సాక్షిగా! ఇమామ్ షౌకాని అభిప్రాయంలో - ముర్సలాత్, 'ఆ'సిఫాత్ మరియు నాషిరాత్ - గాలులను సంబోధిస్తున్నాయి మరియు ఫారిఖాత్, ముల్ ఖియాత్ - దేవదూతలను. ఈ వ్యాఖ్యానంతో కూడా చాలా మంది వ్యాఖ్యాతలు ఏకీభవిస్తున్నారు.

التفاسير:

external-link copy
6 : 77

عُذْرًا اَوْ نُذْرًا ۟ۙ

సాకుగా లేక హెచ్చరికగా![1] info

[1] దీని మరొక తాత్పర్యం: "(మానవులకు) తెలియజేసే ఉద్ధేశంతో గానీ, లేక హెచ్చరిక చేయటానికి గానీ."

التفاسير:

external-link copy
7 : 77

اِنَّمَا تُوْعَدُوْنَ لَوَاقِعٌ ۟ؕ

నిశ్చయంగా, మీకు వాగ్దానం చేయబడినది, జరగవలసి ఉంది. info
التفاسير:

external-link copy
8 : 77

فَاِذَا النُّجُوْمُ طُمِسَتْ ۟ۙ

అప్పుడు ఎప్పడైతే నక్షత్రాలు కాంతి హీనమై పోతాయో! info
التفاسير:

external-link copy
9 : 77

وَاِذَا السَّمَآءُ فُرِجَتْ ۟ۙ

మరియు ఆకాశం చీలిపోతుందో! info
التفاسير:

external-link copy
10 : 77

وَاِذَا الْجِبَالُ نُسِفَتْ ۟ۙ

మరియు పర్వతాలు పొడిగా మారి, చెల్లాచెదురుగా చేయబడతాయో! info
التفاسير:

external-link copy
11 : 77

وَاِذَا الرُّسُلُ اُقِّتَتْ ۟ؕ

మరియు ప్రవక్తలు తమ నిర్ణీత సమయంలో సమావేశపరచబడతారో![1] info

[1] చూడండి, 4:41-42, 5:109, 7:6 లేక 39:69.

التفاسير:

external-link copy
12 : 77

لِاَیِّ یَوْمٍ اُجِّلَتْ ۟ؕ

ఏ దినానికి గాను, (ఇవన్నీ) వాయిదా వేయబడ్డాయి? info
التفاسير:

external-link copy
13 : 77

لِیَوْمِ الْفَصْلِ ۟ۚ

ఆ తీర్పుదినం కొరకా![1] info

[1] యౌముల్ ఫ'స్ల్: పునరుత్థాన దినం. ఖుర్ఆన్ అవతరరణాక్రమంలో ఇక్కడ మొదటి సారి పేర్కొనబడింది., ఇంకా చూడండి, 37:21, 44:40, 78:17 మరియు 77:38.

التفاسير:

external-link copy
14 : 77

وَمَاۤ اَدْرٰىكَ مَا یَوْمُ الْفَصْلِ ۟ؕ

మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా అర్థం కాగలదు? info
التفاسير:

external-link copy
15 : 77

وَیْلٌ یَّوْمَىِٕذٍ لِّلْمُكَذِّبِیْنَ ۟

ఆ రోజు (పునరుత్థాన దినాన్ని) తిరస్కరించే వారికి వినాశమంది! info
التفاسير:

external-link copy
16 : 77

اَلَمْ نُهْلِكِ الْاَوَّلِیْنَ ۟ؕ

ఏమీ? మేము పూర్వీకులను నాశనం చేయలేదా? info
التفاسير:

external-link copy
17 : 77

ثُمَّ نُتْبِعُهُمُ الْاٰخِرِیْنَ ۟

తరువాత రాబోయే వారిని కూడా, మేము వారి వెనక పంపుతాము. info
التفاسير:

external-link copy
18 : 77

كَذٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِیْنَ ۟

ఈ విధంగా మేము నేరస్థుల పట్ల వ్యవహరిస్తాము. info
التفاسير:

external-link copy
19 : 77

وَیْلٌ یَّوْمَىِٕذٍ لِّلْمُكَذِّبِیْنَ ۟

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! info
التفاسير:

external-link copy
20 : 77

اَلَمْ نَخْلُقْكُّمْ مِّنْ مَّآءٍ مَّهِیْنٍ ۟ۙ

ఏమీ? మేము మిమ్మల్ని తుచ్ఛమైన నీటితో (వీర్యబిందువుతో) సృష్టించలేదా? info
التفاسير:

external-link copy
21 : 77

فَجَعَلْنٰهُ فِیْ قَرَارٍ مَّكِیْنٍ ۟ۙ

తరువాత మేము దానిని ఒక భద్రమైన స్థానంలో ఉంచాము. info
التفاسير:

external-link copy
22 : 77

اِلٰی قَدَرٍ مَّعْلُوْمٍ ۟ۙ

ఒక నిర్ణీత కాలం వరకు. info
التفاسير:

external-link copy
23 : 77

فَقَدَرْنَا ۖۗ— فَنِعْمَ الْقٰدِرُوْنَ ۟

ఈ విధంగా మేము నిర్ణయించాము, ఎందుకంటే మేమే ఉత్తమమైన నిర్ణయాలు తీసుకునే వారము[1]. info

[1] చూడండి, 23:12-14.

التفاسير:

external-link copy
24 : 77

وَیْلٌ یَّوْمَىِٕذٍ لِّلْمُكَذِّبِیْنَ ۟

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! info
التفاسير:

external-link copy
25 : 77

اَلَمْ نَجْعَلِ الْاَرْضَ كِفَاتًا ۟ۙ

ఏమీ? మేము భూమిని ఒక సమీకరించే స్థానంగా చేయలేదా? info
التفاسير:

external-link copy
26 : 77

اَحْیَآءً وَّاَمْوَاتًا ۟ۙ

జీవులకూ మరియు మృతులకూను? info
التفاسير:

external-link copy
27 : 77

وَّجَعَلْنَا فِیْهَا رَوَاسِیَ شٰمِخٰتٍ وَّاَسْقَیْنٰكُمْ مَّآءً فُرَاتًا ۟ؕ

మరియు దానిలో ఎత్తైన పర్వతాలను స్థిరంగా నిలుపలేదా? మరియు మీకు త్రాగటానికి మంచి నీటిని ప్రసాదించలేదా? info
التفاسير:

external-link copy
28 : 77

وَیْلٌ یَّوْمَىِٕذٍ لِّلْمُكَذِّبِیْنَ ۟

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! info
التفاسير:

external-link copy
29 : 77

اِنْطَلِقُوْۤا اِلٰی مَا كُنْتُمْ بِهٖ تُكَذِّبُوْنَ ۟ۚ

(సత్యతిరస్కారులతో ఇలా అనబడుతుంది): "మీరు తిరస్కరిస్తూ వచ్చిన దాని వైపునకు పొండి!" info
التفاسير:

external-link copy
30 : 77

اِنْطَلِقُوْۤا اِلٰی ظِلٍّ ذِیْ ثَلٰثِ شُعَبٍ ۟ۙ

(దాని పొగ) మూడు శాఖలుగా చీలిపోయే నీడ వైపునకు పొండి; info
التفاسير:

external-link copy
31 : 77

لَّا ظَلِیْلٍ وَّلَا یُغْنِیْ مِنَ اللَّهَبِ ۟ؕ

కాని అది ఏ విధమైన (చల్ల) నీడనూ ఇవ్వదూ మరియు (నరక) జ్వాలల నుండి కూడా కాపాడదు! info
التفاسير:

external-link copy
32 : 77

اِنَّهَا تَرْمِیْ بِشَرَرٍ كَالْقَصْرِ ۟ۚ

వాస్తవానికి అది పెద్ద పెద్ద మొద్దు వంటి అగ్నికణాలను విసురుతుంది. info
التفاسير:

external-link copy
33 : 77

كَاَنَّهٗ جِمٰلَتٌ صُفْرٌ ۟ؕ

వాస్తవానికి ఆ అగ్నికణాలు పసుపు పచ్చని ఒంటెల వలే కనిపిస్తాయి. info
التفاسير:

external-link copy
34 : 77

وَیْلٌ یَّوْمَىِٕذٍ لِّلْمُكَذِّبِیْنَ ۟

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! info
التفاسير:

external-link copy
35 : 77

هٰذَا یَوْمُ لَا یَنْطِقُوْنَ ۟ۙ

ఆ దినాన వారు మాట్లాడలేరు. info
التفاسير:

external-link copy
36 : 77

وَلَا یُؤْذَنُ لَهُمْ فَیَعْتَذِرُوْنَ ۟

మరియు వారికి సాకులు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వబడదు. info
التفاسير:

external-link copy
37 : 77

وَیْلٌ یَّوْمَىِٕذٍ لِّلْمُكَذِّبِیْنَ ۟

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! info
التفاسير:

external-link copy
38 : 77

هٰذَا یَوْمُ الْفَصْلِ ۚ— جَمَعْنٰكُمْ وَالْاَوَّلِیْنَ ۟

అది తీర్పుదినమై ఉంటుంది! మేము మిమ్మల్ని మరియు మీ పూర్వీకులను సమావేశపరచి ఉంటాము! info
التفاسير:

external-link copy
39 : 77

فَاِنْ كَانَ لَكُمْ كَیْدٌ فَكِیْدُوْنِ ۟

కావున మీ వద్ద ఏదైనా పన్నాగముంటే దానిని పన్నండి.[1] info

[1] ఇటువంటి సందేశం గల ఆయత్ కోసం చూడండి, 55:33.

التفاسير:

external-link copy
40 : 77

وَیْلٌ یَّوْمَىِٕذٍ لِّلْمُكَذِّبِیْنَ ۟۠

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! info
التفاسير:

external-link copy
41 : 77

اِنَّ الْمُتَّقِیْنَ فِیْ ظِلٰلٍ وَّعُیُوْنٍ ۟ۙ

నిశ్చయంగా భయభక్తులు గలవారు (ఆ రోజు చల్లని) నీడలలో చెలమల దగ్గర ఉంటారు. info
التفاسير:

external-link copy
42 : 77

وَّفَوَاكِهَ مِمَّا یَشْتَهُوْنَ ۟ؕ

మరియు వారికి వారు కోరే ఫలాలు లభిస్తాయి. info
التفاسير:

external-link copy
43 : 77

كُلُوْا وَاشْرَبُوْا هَنِیْٓـًٔا بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟

(వారితో ఇలా అనబడుతుంది): "మీరు చేస్తూ ఉండిన కర్మలను ఫలితంగా హాయిగా తినండి, త్రాగండి!" info
التفاسير:

external-link copy
44 : 77

اِنَّا كَذٰلِكَ نَجْزِی الْمُحْسِنِیْنَ ۟

నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే ఇస్తాము. info
التفاسير:

external-link copy
45 : 77

وَیْلٌ یَّوْمَىِٕذٍ لِّلْمُكَذِّبِیْنَ ۟

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! info
التفاسير:

external-link copy
46 : 77

كُلُوْا وَتَمَتَّعُوْا قَلِیْلًا اِنَّكُمْ مُّجْرِمُوْنَ ۟

(ఓ సత్యతిరస్కారులారా!) మీరు కొంతకాలం తినండి, సుఖాలు అనుభవించండి. నిశ్చయంగా, మీరు నేరస్థులు! info
التفاسير:

external-link copy
47 : 77

وَیْلٌ یَّوْمَىِٕذٍ لِّلْمُكَذِّبِیْنَ ۟

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది! info
التفاسير:

external-link copy
48 : 77

وَاِذَا قِیْلَ لَهُمُ ارْكَعُوْا لَا یَرْكَعُوْنَ ۟

మరియు వారితో: "(అల్లాహ్ ముందు) వంగండి (రుకూఉ చేయండి)." అని అన్నప్పుడు, వారు వంగలేదు. info
التفاسير:

external-link copy
49 : 77

وَیْلٌ یَّوْمَىِٕذٍ لِّلْمُكَذِّبِیْنَ ۟

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది![1] info

[1] ఈ ఆయత్ ఈ సూరహ్ లో పదిసార్లు వచ్చింది. ఏ విధంగానైతే: "అయితే మీరిరువురు (మానవులు మరియు జిన్నాతులు) మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?" అనే ఆయతు సూరహ్ అర్-ర'హ్ మాన్ (55)లో 31 సార్లు వచ్చిందో! అంటే, పునరుత్థాన దినాన్ని తిరస్కరించే వారికి వినాశం తప్పదనే విషయాన్ని అల్లాహుతా'లా మాటిమాటికి విశదీకరిస్తున్నాడు.

التفاسير:

external-link copy
50 : 77

فَبِاَیِّ حَدِیْثٍ بَعْدَهٗ یُؤْمِنُوْنَ ۟۠

దీని (ఈ ఖుర్ఆన్) తరువాత ఇక వారు మరెలాంటి సందేశాన్నివిశ్వసిస్తారు? info
التفاسير: