[1] జిబ్త్: అంటే అసలు అర్థం అసత్యమైనది, ఆధారం లేనిది, నిరుపయోగమైనది. ఇస్లాం పరిభాషలో మంత్ర తంత్రాలు, జ్యోతిషం, భూతవైద్యం, శకునాలు, ముహూర్తాలు మరియు ఊహాపోహలకు సంబంధించిన అన్ని విషయాలను జిబ్త్ తో పోల్చవచ్చు. [2] 'తా'గూత్: చూడండి, 2:256 వ్యాఖ్యానం 3. 'తా'గూత్ అంటే షై'తాన్ అని కూడ అర్థం. ఎందుకంటే కల్పిత దైవాలను ఆరాధించటం షై'తాన్ ను అనుసరించటమే. కావున షై'తాన్ కూడా 'తా'గూత్ లలో చేరుతాడు.