[1] పై మూడు ఆయతులలో దైవదూత ('అ.స.)ల వివిధ కార్యాలు వివరించబడ్డాయి. ప్రతిదీ అల్లాహ్ (సు.తా.) యొక్క సృష్టి మరియు ఆయనకు చెందినదే. కావున ఆయన తాను కోరిన దాని ప్రమాణం చేస్తాడు. కాని మానవులకు అల్లాహ్ (సు.తా.) తప్ప ఇతరుల ప్రమాణం చేయటం నిషిద్ధం ('హరాం) ఎందుకంటే ప్రమాణం తీసుకునే దానిని సాక్షిగా తీసుకోవలసి ఉంటుంది. మానవునికి అల్లాహ్ (సు.తా.) తప్ప మరొక ఉత్తమ సాక్షి లేడు. ఎందుకంటే కేవలం అల్లాహ్ (సు.తా.) యే సర్వసాక్షి.
[1] చూడండి, 55:17. అక్కడ రెండు తూర్పులు మరియు రెండు పడమరలు అని ఉంది. అంటే చలికాలం మరియు వేసవి కాలంలో సూర్యోదయం మరియు సూర్యాస్తమయం అయ్యే రెండు చివరలు. వాస్తవానికి సంవత్సరపు ప్రతి రోజున సూర్యుడు ఒక క్రొత్త చోటునుండి ఉదయిస్తాడు మరియు ఒక క్రొత్త చోటులో అస్తమిస్తాడు (ఫ'త్హ్ అల్-ఖదీర్).
[1] చూడండి, 15:17 నక్షత్రాల ఉనికికి మూడు కారణాలున్నాయి. 1) ఆకాశపు అలంకరణ. 2) షైతానులు ఆకాశాలలోకి పోయి దైవదూతల మాటలు వినటానికి ప్రయత్నిస్తే వాటిని తరుమటం. 3) రాత్రి చీకటిలో మానవులకు మార్దదర్శకము చేయటం. ఈ మూడు తప్ప ఇతర ఉపయోగాలు పేర్కొనబడలేదు.