የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቴሉጉ ቋንቋ ትርጉም - በዐብዱረሒም ኢብኑ ሙሐመድ

external-link copy
71 : 2

قَالَ اِنَّهٗ یَقُوْلُ اِنَّهَا بَقَرَةٌ لَّا ذَلُوْلٌ تُثِیْرُ الْاَرْضَ وَلَا تَسْقِی الْحَرْثَ ۚ— مُسَلَّمَةٌ لَّا شِیَةَ فِیْهَا ؕ— قَالُوا الْـٰٔنَ جِئْتَ بِالْحَقِّ ؕ— فَذَبَحُوْهَا وَمَا كَادُوْا یَفْعَلُوْنَ ۟۠

అతను (మూసా) అన్నాడు: "ఆయన (అల్లాహ్) అంటున్నాడు: 'ఆ గోవు భూమిని దున్నటానికి గానీ, పొలాలకు నీళ్ళు తోడటానికి గానీ ఉపయోగించబడకుండా, ఆరోగ్యంగా ఎలాంటి లోపాలు లేకుండా ఉండాలి.' అని!" అప్పుడు వారన్నారు: "ఇప్పుడు నీవు సత్యం తెచ్చావు." తరువాత వారు దానిని బలి (జిబ్హ్) చేశారు, లేకపోతే వారు అలా చేసేవారని అనిపించలేదు.[1] info

[1] వారికి మొదట ఒక ఆవును బలి చేయమని మాత్రమే ఆజ్ఞ ఇవ్వబడింది. కాబట్టి వారు ఏదో ఒక ఆవును బలిచేసి ఉంటే, అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞ నెరవేరేది. కానీ వారలా చేయక వివిధ రకాల ప్రశ్నలడగసాగారు. కావున అల్లాహుతా'ఆలా వారి సమస్యలను పెంచాడు. దానితో వారికి ఆవును కనుగొనటంలో కష్టం కలిగింది. కావున ధర్మవిషయాలలో కఠిన విధానాన్ని అనుసరించటం నిషేధించబడింది.

التفاسير: