የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቴሉጉ ቋንቋ ትርጉም - በዐብዱረሒም ኢብኑ ሙሐመድ

external-link copy
217 : 2

یَسْـَٔلُوْنَكَ عَنِ الشَّهْرِ الْحَرَامِ قِتَالٍ فِیْهِ ؕ— قُلْ قِتَالٌ فِیْهِ كَبِیْرٌ ؕ— وَصَدٌّ عَنْ سَبِیْلِ اللّٰهِ وَكُفْرٌ بِهٖ وَالْمَسْجِدِ الْحَرَامِ ۗ— وَاِخْرَاجُ اَهْلِهٖ مِنْهُ اَكْبَرُ عِنْدَ اللّٰهِ ۚ— وَالْفِتْنَةُ اَكْبَرُ مِنَ الْقَتْلِ ؕ— وَلَا یَزَالُوْنَ یُقَاتِلُوْنَكُمْ حَتّٰی یَرُدُّوْكُمْ عَنْ دِیْنِكُمْ اِنِ اسْتَطَاعُوْا ؕ— وَمَنْ یَّرْتَدِدْ مِنْكُمْ عَنْ دِیْنِهٖ فَیَمُتْ وَهُوَ كَافِرٌ فَاُولٰٓىِٕكَ حَبِطَتْ اَعْمَالُهُمْ فِی الدُّنْیَا وَالْاٰخِرَةِ ۚ— وَاُولٰٓىِٕكَ اَصْحٰبُ النَّارِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟

వారు నిషిద్ధ మాసాలలో యుద్ధం చేయటాన్ని గురించి నిన్ను అడుగుతున్నారు[1]. వారితో ఇలా అను: "వాటిలో యుద్ధం చేయటం మహా అపరాధం. కాని (ప్రజలను) అల్లాహ్ మార్గాన్ని అవలంబించటం నుండి అవరోధాలు కలిగించటం మరియు ఆయన (అల్లాహ్)ను తిరస్కరించటం మరియు (ప్రజలను) మస్జిద్ అల్ హరామ్ ను దర్శించకుండా ఆటంకపరచడం మరియు అక్కడి వారిని దాని నుండి వెడలగొట్టడం అల్లాహ్ దృష్టిలో అంతకంటే మహా అపరాధం. పీడన (ఫిత్నా), రక్తపాతం కంటే ఘోరమైనది[2]. వారికి సాధ్యమే అయితే మిమ్మల్ని మీ ధర్మం నుండి మళ్ళించ గలిగే వరకూ వారు మీతో యుద్ధం చేయడం మానరు. మరియు మీలో ఎవరైనా మతభ్రష్టులై సత్యతిరస్కారులుగా మరణిస్తే, అలాంటి వారి మంచిపనులన్నీ ఇహపర లోకాలలో రెండింటిలోనూ వృథా అవుతాయి. మరియు అలాంటి వారు నరకాగ్ని వాసులవుతారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు." info

[1] నిషిద్ధ మాసాలు హిజ్రీ శకపు 1, 7, 11 మరియు 12వ నెలలు, వివరాలకు చూడండి, 2:194 మరియు దాని వ్యాఖ్యానం 1. పైన పేర్కొన్న నిషిద్ధ మాసాలలో యుద్ధం చేయటం ఇస్లాంకు ముందు కూడా అరేబియాలో నిషిద్ధంగా ఉండేది. ఈ ఆయత్ అవతరణను గురించి ఇలా ఉంది : ఒక 'స'హాబీల దళం రజబ్ నెలలో ఒక సత్య తిరస్కారిని చంపి మరికొందరిని ఖైదీలుగా తీసుకుంటారు. అప్పుడు ఆ 'స'హాబీలకు రజబ్ నెల ప్రారంభమైనది తెలియదు. అప్పుడు సత్యతిరస్కారులు : "ఈ ముస్లింలు నిషిద్ధ మాసాలను కూడా లెక్క చేయడం లేదు." ని నిందిస్తారు. ఆ సందర్భంలో ఈ ఆయత్ అవతరింపజేయబడింది. [2] చూడండి, 2:191 వ్యాఖ్యానం 2.

التفاسير: