የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቴሉጉ ቋንቋ ትርጉም - በዐብዱረሒም ኢብኑ ሙሐመድ

external-link copy
213 : 2

كَانَ النَّاسُ اُمَّةً وَّاحِدَةً ۫— فَبَعَثَ اللّٰهُ النَّبِیّٖنَ مُبَشِّرِیْنَ وَمُنْذِرِیْنَ ۪— وَاَنْزَلَ مَعَهُمُ الْكِتٰبَ بِالْحَقِّ لِیَحْكُمَ بَیْنَ النَّاسِ فِیْمَا اخْتَلَفُوْا فِیْهِ ؕ— وَمَا اخْتَلَفَ فِیْهِ اِلَّا الَّذِیْنَ اُوْتُوْهُ مِنْ بَعْدِ مَا جَآءَتْهُمُ الْبَیِّنٰتُ بَغْیًا بَیْنَهُمْ ۚ— فَهَدَی اللّٰهُ الَّذِیْنَ اٰمَنُوْا لِمَا اخْتَلَفُوْا فِیْهِ مِنَ الْحَقِّ بِاِذْنِهٖ ؕ— وَاللّٰهُ یَهْدِیْ مَنْ یَّشَآءُ اِلٰی صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۟

పూర్వం, మానవులంతా ఒకే ఒక సమాజంగా ఉండేవారు[1]. అప్పుడు అల్లాహ్ వారికి శుభవార్తలు ఇవ్వటానికి మరియు హెచ్చరికలు చేయటానికి ప్రవక్తలను పంపాడు. మరియు మానవులలో ఏర్పడిన భేదాలను పరిష్కరించటానికి, ఆయన గ్రంథాన్ని సత్యంతో వారి ద్వారా అవతరింపజేశాడు మరియు అది (దివ్యగ్రంథం) ఇవ్వబడిన వారు, స్పష్టమైన హితోపదేశాలు పొందిన తరువాత కూడా, పరస్పర ద్వేషాల వల్ల భేదాభిప్రాయాలు పుట్టించుకున్నారు. కాని అల్లాహ్ తన ఆజ్ఞతో, విశ్వాసులకు వారు వివాదాలాడుతున్న విషయంలో సత్యమార్గాన్ని చూపాడు. మరియు అల్లాహ్ తాను కోరిన వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు. info

[1] అంటే తౌ'హీద్: ఏకదైవ సిద్ధాంతంపై ఉండటం. ఆదమ్ ('అ.స.) నుండి నూ'హ్ ('అ.స.) వరకు ప్రజలంతా ఏకదైవ సిద్ధాంతంపై, తమ ప్రవక్తలను అనుసరిస్తూ వచ్చారు. నూ'హ్ ('అ.స.) కాలంలో షై'తాన్ కలతలు రేకెత్తించటం వలన వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. సత్యతిరస్కారం మరియు షిర్క్ వ్యాపించాయి. ఆ తరువాత అల్లాహ్ (సు.తా.) ప్రవక్తలను దివ్యగ్రంథాలతో - వారి భేదాభిప్రాయాలను దూరం చేయటానికి - పంపాడు (ఇబ్నె - కసీ'ర్).

التفاسير: