የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
43 : 6

فَلَوْلَاۤ اِذْ جَآءَهُمْ بَاْسُنَا تَضَرَّعُوْا وَلٰكِنْ قَسَتْ قُلُوْبُهُمْ وَزَیَّنَ لَهُمُ الشَّیْطٰنُ مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟

ఒక వేళ మా ఆపద వారి వద్దకు వచ్చినప్పుడు వారి నుండి అల్లాహ్ ఆపదను తొలగించటం కొరకు వారు అల్లాహ్ కు విధేయత చూపితే,ఆయన యందు అణుకువతో మెలిగితే మేము వారిపై కనికరించే వాళ్ళము.కాని వారు అలా చేయలేదు.వాస్తవానికి వారి హృదయాలు కఠినంగా మారిపోయినవి.వారు గుణపాఠం నేర్చుకోలేదు.హితోపదేశంను గ్రహించలేదు.వారు పాల్పడే అవిశ్వాస కార్యాలను,అవిధేయత కార్యాలను షైతాను వారికొరకు అందంగా చేసి చూపించాడు.అయితే వారు తాము ఉన్నదానిపై కొనసాగిపోయారు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• تشبيه الكفار بالموتى؛ لأن الحياة الحقيقية هي حياة القلب بقَبوله الحق واتباعه طريق الهداية.
అవిశ్వాసపరులను మృతులతో పోల్చటం జరిగింది.ఎందుకంటే వాస్తవమైన జీవితం అంటే అది సత్యాన్ని అంగీకరించటం ద్వారా మరియు సన్మార్గమును అనుసరించటం ద్వారా హృదయములకు లభించే జీవితం. info

• من حكمة الله تعالى في الابتلاء: إنزال البلاء على المخالفين من أجل تليين قلوبهم وردِّهم إلى ربهم.
వ్యతిరేకుల హృదయములను మెత్తపరచటానికి,వారిని వారి ప్రభువు వైపునకు మరల్చటానికి వారిపై ఆపదను తీసుకుని వచ్చి పరీక్షించటంలో అల్లాహ్ యొక్క వ్యూహమున్నది. info

• وجود النعم والأموال بأيدي أهل الضلال لا يدل على محبة الله لهم، وإنما هو استدراج وابتلاء لهم ولغيرهم.
మార్గభ్రష్టుల చేతిలో అనుగ్రహాలు,సంపదలుండటం అల్లాహ్ యొక్క ఇష్టత వారికొరకు ఉన్నదని నిరూపణకాదు.అవి వారిని,ఇతరులను ప్రలోభపెట్టటానికి,పరీక్షించటానికి మాత్రమే. info