የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
65 : 19

رَبُّ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَیْنَهُمَا فَاعْبُدْهُ وَاصْطَبِرْ لِعِبَادَتِهٖ ؕ— هَلْ تَعْلَمُ لَهٗ سَمِیًّا ۟۠

ఆకాశములను సృష్టించినవాడు,భూమిని సృష్టించినవాడు,వాటి యజమాని,వాటి వ్యవహారాల పర్యాలోచన చేసేవాడు,వాటి మధ్య ఉన్న దానిని సృష్టించినవాడు, దాని యజమాని,దాని పర్యాలోచన చేసేవాడు ఆయనే. అయితే నీవు ఆయన ఒక్కడినే ఆరాధించు. ఆయనే ఆరాధనకు అర్హుడు. మరియు నీవు ఆయన్ని ఆరాధించటంలో నిలకడను చూపు. ఆయనకు పోలిన వాడు కాని సమానులు కాని అతనికి ఆరాధనలో భాగస్వామి అయ్యేవాడు లేడు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• على المؤمنين الاشتغال بما أمروا به والاستمرار عليه في حدود المستطاع.
విశ్వాసపరులు తమకు ఆదేశించబడిన వాటిలో నిమగ్నమై ఉండటం తప్పనిసరి. సాధ్యమైనంతవరకు దానిపైనే కొనసాగాలి. info

• وُرُود جميع الخلائق على النار - أي: المرور على الصراط، لا الدخول في النار - أمر واقع لا محالة.
జీవులన్ని నరకంపై రావటం అంటే మార్గమును దాటటం. అంతేగాని నరకంలో ప్రవేశించటం కాదు ఖచ్చితంగా జరిగే పని. info

• أن معايير الدين ومفاهيمه الصحيحة تختلف عن تصورات الجهلة والعوام.
ధర్మ ప్రమాణాలు,దాని సరైన భావనలు అజ్ఞానుల,సామాన్యుల అవగాహనలకు భిన్నంగా ఉంటాయి. info

• من كان غارقًا في الضلالة متأصلًا في الكفر يتركه الله في طغيان جهله وكفره، حتى يطول اغتراره، فيكون ذلك أشد لعقابه.
ఎవరైతే అపమార్గంలో మునిగి తేలుతూ,అపనమ్మకంలో పాతుకుపోయాడో అతన్ని అల్లాహ్ అతని అజ్ఞానములో,అతని అవిశ్వాసములో మితిమీరే విధంగా వదిలివేస్తాడు. చివరికి అతని శోధన దీర్ఘ కాలం సాగుతుంది అప్పుడు అది అతని శిక్షను తీవ్రం చేసే విధంగా ఉంటుంది. info

• يثبّت الله المؤمنين على الهدى، ويزيدهم توفيقًا ونصرة، وينزل من الآيات ما يكون سببًا لزيادة اليقين مجازاةً لهم.
అల్లాహ్ విశ్వాసపరులను మార్గదర్శకత్వంపై నిరూపిస్తాడు. మరియు వారిని సయోధ్య,విజయంతో అధికం చేస్తాడు. మరియు వారికి ప్రతిఫలంగా నమ్మకమును అధికం చేయటం కొరకు కారణమయ్యే ఆయతులను అవతరింపజేస్తాడు. info