የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
53 : 17

وَقُلْ لِّعِبَادِیْ یَقُوْلُوا الَّتِیْ هِیَ اَحْسَنُ ؕ— اِنَّ الشَّیْطٰنَ یَنْزَغُ بَیْنَهُمْ ؕ— اِنَّ الشَّیْطٰنَ كَانَ لِلْاِنْسَانِ عَدُوًّا مُّبِیْنًا ۟

మరియు ఓ ప్రవక్తా నా పై విశ్వాసమును కనబరచే నా దాసులతో వారు మాట్లాడేటప్పుడు మంచి మాటను పలకమని,ధ్వేషమును కలిగించే చెడ్డ మాట నుండి దూరంగా ఉండమని చెప్పండి. ఎందుకంటే షైతాను వాటి ద్వారా ప్రయోజనం చెంది వారి మధ్య వారి ఇహలోక,పరలోక జీవితమును సంక్షోభములో నెట్టే చర్యలకు పాల్పడటానికి కృషి చేస్తాడు. నిశ్చయంగా షైతాను మానవునికి స్పష్టమైన శతృవు. అటువంటప్పుడు అతడు అతనితో జాగ్రత్తపడటం అత్యవసరము. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• القول الحسن داع لكل خلق جميل وعمل صالح، فإنَّ من ملك لسانه ملك جميع أمره.
మంచి మాట ప్రతి మంచి సృష్టి కొరకు,సత్కర్మ కొరకు పిలుపునిస్తుంది. ఎందుకంటే ఎవరైతే తన నాలుకను అదుపులో పెట్టుకుంటాడో అతడు తన పూర్తి వ్యవహారమును అదుపులో పెట్టుకుంటాడు. info

• فاضل الله بين الأنبياء بعضهم على بعض عن علم منه وحكمة.
అల్లాహ్ తన జ్ఞానముతో,వివేకముతో దైవ ప్రవక్తల మధ్య కొందరిని కొందరిపై ప్రాధాన్యతను ఇచ్చాడు. info

• الله لا يريد بعباده إلا ما هو الخير، ولا يأمرهم إلا بما فيه مصلحتهم.
అల్లాహ్ తన దాసులపట్ల మేలును మాత్రమే ఆశిస్తాడు. మరియు వారికి ఎందులో ప్రయోజనం ఉన్నదో వాటి గురించి మాత్రమే ఆదేశిస్తాడు. info

• علامة محبة الله أن يجتهد العبد في كل عمل يقربه إلى الله، وينافس في قربه بإخلاص الأعمال كلها لله والنصح فيها.
దాసుడు అల్లాహ్ సామిప్యమును కలిగించే ప్రతీ కార్యములో శ్రమించటం,ఆయన సామిప్యములో అన్ని కర్మలను చిత్త శుద్ధితో అల్లాహ్ కొరకు చేయటం,వాటి విషయంలో హితబోధన చేయటంలో పోటీపడటం అల్లాహ్ పట్ల ఇష్టతకు సూచన. info