የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
112 : 16

وَضَرَبَ اللّٰهُ مَثَلًا قَرْیَةً كَانَتْ اٰمِنَةً مُّطْمَىِٕنَّةً یَّاْتِیْهَا رِزْقُهَا رَغَدًا مِّنْ كُلِّ مَكَانٍ فَكَفَرَتْ بِاَنْعُمِ اللّٰهِ فَاَذَاقَهَا اللّٰهُ لِبَاسَ الْجُوْعِ وَالْخَوْفِ بِمَا كَانُوْا یَصْنَعُوْنَ ۟

మరియు అల్లాహ్ ఒక నగరపు ఉపమానమిచ్చాడు.అది మక్కా నగరం.అది ఎంతో ప్రశాంతతో కూడుకుని ఉండేది,అక్కడి వాసులు భయాందోళనలకు లోనయ్యేవారు కాదు. అది స్థిరంగా ఉన్నది దాని చుట్టుప్రక్కల ప్రాంతముల ప్రజలు మట్టుపెట్టబడేవారు. దానికి ఆహారోపాధి ప్రతి ప్రాంతము నుండి శుభప్రధంగా,సులభంగా వచ్చేది. అప్పుడు అక్కడి వాసులు అల్లాహ్ తమపై అనుగ్రహించిన అనుగ్రహాలను తిరస్కరించారు,ఆయనకు వారు కృతజ్ఞతలు తెలుపుకోలేదు. అయితే అల్లాహ్ వారికి ఆకలి ద్వారా,తీవ్రమైన భయాందోళనల ద్వారా వారి శరీరములపై భయము,బలహీనత బహిర్గతం అవటానికి ప్రతిఫలాన్ని ప్రసాధించాడు. చివరికి అవి (భయం, ఆకలి) వారు పాల్పడిన అవిశ్వాసము,తిరస్కారము కారణం వలన వారికి వస్త్రములుగా అయిపోయినవి. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الجزاء من جنس العمل؛ فإن أهل القرية لما بطروا النعمة بُدِّلوا بنقيضها، وهو مَحْقُها وسَلْبُها ووقعوا في شدة الجوع بعد الشبع، وفي الخوف والهلع بعد الأمن والاطمئنان، وفي قلة موارد العيش بعد الكفاية.
ఆచరణలాగే ప్రతిఫలం ఉంటుంది. నిశ్చయంగా నగరవాసులు ఎప్పుడైతే అనుగ్రహమును తిరస్కరించారో అప్పుడు దానికి బదులుగా దానికి విరుద్ధంగా దాన్ని పూర్తిగా తుడిచివేయటం,దాన్ని గుంజుకోవటం జరిగింది.మరియు వారు కడుపు నిండిన తరువాత తీవ్ర ఆకలికి,భద్రత,భరోసా తరువాత భయాందోళనలకు,సరిఅగు(సామాగ్రి) లభించిన తరువాత జీవనాధారము తగ్గుదలకు గురయ్యారు. info

• وجوب الإيمان بالله وبالرسل، وعبادة الله وحده، وشكره على نعمه وآلائه الكثيرة، وأن العذاب الإلهي لاحقٌ بكل من كفر بالله وعصاه، وجحد نعمة الله عليه.
అల్లాహ్ పట్ల,ప్రవక్తల పట్ల విశ్వాసం కనబరచటం,అల్లాహ్ ఒక్కడి ఆరాధన చేయటం, ఆయన ఆశీర్వాదాలపై,ఆయన అనేక అనుగ్రహాలపై ఆయనకు కృతజ్ఞతలు తెలపటం తప్పనిసరి.మరియు దైవ శిక్ష అల్లాహ్ ను తిరస్కరించి,ఆయన పై అవిధేయత చూపి, తనపై ఉన్న అల్లాహ్ అనుగ్రహమును తిరస్కరించిన ప్రతీ వ్యక్తికి చుట్టుకుంటుంది. info

• الله تعالى لم يحرم علينا إلا الخبائث تفضلًا منه، وصيانة عن كل مُسْتَقْذَر.
మహోన్నతుడైన అల్లాహ్ తన వద్ద నుండి అనుగ్రహంగా,ప్రతి మురికి నుండి రక్షణగా మనపై అశుద్ధతలను మాత్రమే నిషేధించాడు. info