Қуръони Карим маъноларининг таржимаси - Телугуча таржима - Абдураҳим ибн Муҳаммад

Бет рақами:close

external-link copy
37 : 9

اِنَّمَا النَّسِیْٓءُ زِیَادَةٌ فِی الْكُفْرِ یُضَلُّ بِهِ الَّذِیْنَ كَفَرُوْا یُحِلُّوْنَهٗ عَامًا وَّیُحَرِّمُوْنَهٗ عَامًا لِّیُوَاطِـُٔوْا عِدَّةَ مَا حَرَّمَ اللّٰهُ فَیُحِلُّوْا مَا حَرَّمَ اللّٰهُ ؕ— زُیِّنَ لَهُمْ سُوْٓءُ اَعْمَالِهِمْ ؕ— وَاللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الْكٰفِرِیْنَ ۟۠

నిశ్చయంగా, నెలలను వెనుక ముందు చేయటం (నసీఉ) సత్యతిరస్కారంలో అదనపు చేష్టయే! దాని వల్ల సత్యతిరస్కారులు మార్గభ్రష్టత్వానికి గురి చేయబడుతున్నారు. వారు దానిని ఒక సంవత్సరం ధర్మసమ్మతం చేసుకుంటారు, మరొక సంవత్సరం నిషేధించుకుంటారు. ఈ విధంగా వారు అల్లాహ్ నిషేధించిన (నెలల) సంఖ్యను తమకు అనుగుణంగా మార్చుకొని అల్లాహ్ నిషేధించిన దానిని ధర్మసమ్మతం చేసుకుంటున్నారు. వారి దుష్కార్యాలు వారికి మనోహరమైనవిగా కనిపిస్తున్నాయి. మరియు అల్లాహ్ సత్యతిరస్కారులకు సన్మార్గం చూపడు. info
التفاسير:

external-link copy
38 : 9

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا مَا لَكُمْ اِذَا قِیْلَ لَكُمُ انْفِرُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ اثَّاقَلْتُمْ اِلَی الْاَرْضِ ؕ— اَرَضِیْتُمْ بِالْحَیٰوةِ الدُّنْیَا مِنَ الْاٰخِرَةِ ۚ— فَمَا مَتَاعُ الْحَیٰوةِ الدُّنْیَا فِی الْاٰخِرَةِ اِلَّا قَلِیْلٌ ۟

ఓ విశ్వాసులారా! మీకేమయింది? మీతో: "అల్లాహ్ మార్గంలో బయలు దేరండి." అని చెప్పినపుడు మీరు భూమికి అతుక్కొని పోతున్నారేమిటి? ఏమీ? మీరు పరలోకాన్ని వదలి, ఇహలోక జీవితంతోనే తృప్తి పడదలచుకున్నారా? కాని ఇహలోక జీవిత సుఖం పరలోక (జీవిత సుఖాల ముందు) ఎంతో అల్పమైనది![1] info

[1] చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 4, 'హదీస్' నెం. 53.

التفاسير:

external-link copy
39 : 9

اِلَّا تَنْفِرُوْا یُعَذِّبْكُمْ عَذَابًا اَلِیْمًا ۙ۬— وَّیَسْتَبْدِلْ قَوْمًا غَیْرَكُمْ وَلَا تَضُرُّوْهُ شَیْـًٔا ؕ— وَاللّٰهُ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟

మీరు బయలు దేరకపోతే, ఆయన మీకు బాధాకరమైన శిక్షను విధిస్తాడు. మరియు మీకు బదులుగా మరొక జాతిని మీ స్థానంలో తెస్తాడు. మరియు మీరు ఆయనకు ఎలాంటి నష్టం కలిగించలేరు.[1] మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు. info

[1] ఇక్కడ 9వ హిజ్రీ షవ్వాల్ నెలలో జరిగిన తబూక్ దండ్రయాత్ర ప్రస్తావన ఉంది. బైజాంటైన్ (Byzantine) చక్రవర్తి, క్రైస్తవుడైన, హెరాక్లియస్, ముస్లింలకు విరుద్ధంగా యుద్ధసన్నాహాలు మొదలు పెడ్తాడు. కావున ము'హమ్మద్ ('స'అస) కూడా యుద్ధసన్నాహాలు మొదలు పెడ్తారు. అది కపట విశ్వాసులకు ఎంతో బాధాకరంగా ఉంటుంది. అప్పుడు ఈ ఆయత్ అవతరింపజేయబడింది. దైవప్రవక్త ('స'అస) ముస్లింలతో, క్రైస్తవులను ఎదుర్కోవటానికి తబూక్ వెళ్ళి, అక్కడ 20 రోజులుండి, క్రైస్తవులు యుద్ధానికి రానందుకు తిరిగి వచ్చేస్తారు.

التفاسير:

external-link copy
40 : 9

اِلَّا تَنْصُرُوْهُ فَقَدْ نَصَرَهُ اللّٰهُ اِذْ اَخْرَجَهُ الَّذِیْنَ كَفَرُوْا ثَانِیَ اثْنَیْنِ اِذْ هُمَا فِی الْغَارِ اِذْ یَقُوْلُ لِصَاحِبِهٖ لَا تَحْزَنْ اِنَّ اللّٰهَ مَعَنَا ۚ— فَاَنْزَلَ اللّٰهُ سَكِیْنَتَهٗ عَلَیْهِ وَاَیَّدَهٗ بِجُنُوْدٍ لَّمْ تَرَوْهَا وَجَعَلَ كَلِمَةَ الَّذِیْنَ كَفَرُوا السُّفْلٰی ؕ— وَكَلِمَةُ اللّٰهِ هِیَ الْعُلْیَا ؕ— وَاللّٰهُ عَزِیْزٌ حَكِیْمٌ ۟

ఒకవేళ మీరు అతనికి (ప్రవక్తకు) సహాయం చేయకపోతే ఏం ఫర్వాలేదు! (అల్లాహ్ అతనికి తప్పక సహాయం చేస్తాడు). ఏ విధంగానైతే, సత్యతిరస్కారులు అతనిని పారద్రోలి నపుడు, అల్లాహ్ అతనికి సహాయం చేశాడో! అప్పుడు అతను ఇద్దరిలో రెండవ వాడిగా (సౌర్) గుహలో ఉన్నప్పుడు అతను తన తోటి వానితో (అబూ బక్ర్ తో): "నీవు దుఃఖ పడకు, నిశ్చయంగా అల్లాహ్ మనతో ఉన్నాడు!" అని అన్నాడు.[1] అప్పుడు అల్లాహ్! అతనిపై తన తరఫు నుండి మనశ్శాంతిని అవతరింపజేశాడు. అతనిని మీకు కనిపించని (దైవదూతల) దళాలతో సహాయం చేసి సత్యతిరస్కారుల మాటను కించపరచాడు. మరియు అల్లాహ్ మాట సదా సర్వోన్నతమైనదే. మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహో వివేచనాపరుడు. info

[1] క్రీ.శకం 622, (ప్రవక్త పదవి ప్రసాదించబడిన దాదాపు 13వ సంవత్సరం)లో, ము'హమ్మద్ ('స'అస) ను చంపటానికి, మక్కా ముష్రికులు అతని ఇంటి మీదికి, రాత్రివేళ ప్రతి తెగ నుండి ఒక యువకుణ్ణి తయారుచేసి పంపుతారు. అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞతో, దైవప్రవక్త ('స'అస) వారి మీద దుమ్ము విసరగా, వారికి కునుకు వస్తుంది. ఆ తరువాత అతను ('స'అస), అబూ బక్ర్ (ర'ది.'అ.)తో సహా బయలుదేరి, సౌ'ర్ కొండ గుహలో మూడు రోజులు దాగుతారు. ముష్రికులు వారిని వెతుక్కుంటూ గుహపై వరకు చేరుతారు. కాని ముష్రికులు వారిద్దరిని కనుగొనలేక పోతారు. అది వారిద్దరు గమనిస్తారు. ఆ సందర్భంలో దైవప్రవక్త ('స'అస) అబూ బక్ర్ (ర'ది.'అ)తో ఈ మాటలు అంటారు. ('స'హీ'హ్ బు'ఖారీ).

التفاسير: