Қуръони Карим маъноларининг таржимаси - Телугуча таржима - Абдураҳим ибн Муҳаммад

external-link copy
187 : 7

یَسْـَٔلُوْنَكَ عَنِ السَّاعَةِ اَیَّانَ مُرْسٰىهَا ؕ— قُلْ اِنَّمَا عِلْمُهَا عِنْدَ رَبِّیْ ۚ— لَا یُجَلِّیْهَا لِوَقْتِهَاۤ اِلَّا هُوَ ؔؕۘ— ثَقُلَتْ فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— لَا تَاْتِیْكُمْ اِلَّا بَغْتَةً ؕ— یَسْـَٔلُوْنَكَ كَاَنَّكَ حَفِیٌّ عَنْهَا ؕ— قُلْ اِنَّمَا عِلْمُهَا عِنْدَ اللّٰهِ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَعْلَمُوْنَ ۟

(ఓ ప్రవక్తా!) వారు నిన్ను ఆ అంతిమఘడియను గురించి: "అది ఎప్పుడు రానున్నది?" అని అడుగుతున్నారు. వారితో ఇలా అను: "నిస్సందేహంగా, దాని జ్ఞానం నా ప్రభువుకు మాత్రమే ఉంది.[1] కేవలం ఆయన స్వయంగా దానిని, దాని సమయంలో తెలియజేస్తాడు. అది భూమ్యాకాశాలకు ఎంతో దుర్భరమైనదిగా ఉంటుంది. అది మీపై అకస్మాత్తుగానే వచ్చి పడుతుంది." దానిని గురించి నీకు బాగా తెలిసి ఉన్నట్లు భావించి, వారు నిన్ను దానిని గురించి అడుగుతున్నారు. నీవు ఇలా సమాధానం ఇవ్వు: "నిస్సందేహంగా, దాని జ్ఞానం అల్లాహ్ కు మాత్రమే ఉంది. కాని చాలా మంది ఇది తెలుసుకోలేరు."[2] info

[1] అంతిమ ఘడియ ఎప్పుడు రానున్నదో అల్లాహ్ (సు.తా.) కు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఏ ప్రవక్తకు గానీ లేక దైవదూతకు గానీ అది వచ్చే సమయం గురించి తెలియదనే విషయం ఈ ఆయత్ ద్వారా స్పష్టమవుతోంది. [2] చూడండి, 31:34.

التفاسير: