[1] మీ'జాన్: అంటే త్రాసు - ఇక్కడ న్యాయం అని అర్థం.
[2] ఇనుము వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇది భూమిలో విస్తారంగా దొరుకుతుంది.
[1] కఠోరమైన సన్యాసాన్ని వారే (క్రైస్తవులే) తమపై తాము విధించుకున్నారు. వారు ప్రాపంచిక జీవితానికి విలువ ఇవ్వలేదు. దీనిని ఖుర్ఆన్ ఖండిస్తుంది. చూడండి, 2:143. రఅ'ఫతన్ - అంటే జాలి, కనికరం, దయ. రుహ్ బానియ్యహ్ - అంటే త్యాగం, విడిచిపెట్టడం. అంటే ప్రాపంచిక విషయాలను త్యజించటం. అంటే సన్యాసత్వం స్వీకరించటం. ఇది వారే స్వయంగా కల్పించుకున్నారు. అల్లాహ్ (సు.తా.) దీనిని విధించలేదు. వారు అల్లాహ్ (సు.తా.) ను సంతోషపరచాలని దీనిని అవలంబించారు. కాని అల్లాహ్ (సు.తా.) తాను చూపిన మార్గం పై నడిచే వారితోనే సంతోషపడతాడు. దానిలో క్రొత్త విషయాలను పుట్టించి వాటిని అవలంబించే వారితో కాదు.