Қуръони Карим маъноларининг таржимаси - Телугуча таржима - Абдураҳим ибн Муҳаммад

external-link copy
43 : 4

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَقْرَبُوا الصَّلٰوةَ وَاَنْتُمْ سُكٰرٰی حَتّٰی تَعْلَمُوْا مَا تَقُوْلُوْنَ وَلَا جُنُبًا اِلَّا عَابِرِیْ سَبِیْلٍ حَتّٰی تَغْتَسِلُوْا ؕ— وَاِنْ كُنْتُمْ مَّرْضٰۤی اَوْ عَلٰی سَفَرٍ اَوْ جَآءَ اَحَدٌ مِّنْكُمْ مِّنَ الْغَآىِٕطِ اَوْ لٰمَسْتُمُ النِّسَآءَ فَلَمْ تَجِدُوْا مَآءً فَتَیَمَّمُوْا صَعِیْدًا طَیِّبًا فَامْسَحُوْا بِوُجُوْهِكُمْ وَاَیْدِیْكُمْ ؕ— اِنَّ اللّٰهَ كَانَ عَفُوًّا غَفُوْرًا ۟

ఓ విశ్వాసులారా! మీరు మత్తులో ఉంటే[1], మీరు పలికేది గ్రహించనంత వరకు మరియు మీకు ఇంద్రియ స్ఖలనం (జునుబున్) అయి ఉంటే - స్నానం చేయనంత వరకు - నమాజ్ సమీపానికి వెళ్లకండి; కాని నడుస్తూ (మస్జిద్) నుండి దాట వలసి వస్తే తప్ప[2]. కాని ఒకవేళ మీరు రోగపీడితులై ఉంటే, లేదా ప్రయాణంలో ఉంటే, లేక మలమూత్రవిసర్జన చేసి ఉంటే, లేక స్త్రీలతో సంభోగం చేసి ఉంటే - మీకు నీళ్ళు దొరక్కపోతే - పరిశుద్ధమైన మట్టిని చేతులతో స్పర్శించి, ఆ చేతులతో మీ ముఖాలను మరియు మీ చేతులను, తుడుచుకోండి (తయమ్మమ్ చేయండి)[3]. నిశ్చయంగా అల్లాహ్ తప్పులను మన్నించేవాడు, క్షమించేవాడు. info

[1] ఇది మద్యపానానికి సంబంధించిన రెండవ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ 2:219లో వచ్చింది. ఈ ఆజ్ఞ వచ్చినప్పుడు, ఇంకా మద్యపానాన్ని హరాం చేసిన ఆయతు (5:90) అవతరించబడలేదు. [2] అంటే మస్జిద్ నుండి దాటిపోతే ఎలాంటి పాపం లేదు. (ఇబ్నె-కసీ'ర్). ప్రయాణీకులను గురించిన ఆజ్ఞ ముందు వస్తోంది. [3] తయమ్మమ్ విధానం: ఒకసారి మీ అరచేతులతో పరిశుద్ధ భూమి (మట్టి)ని తాకండి. వాటితో ముఖాన్ని తుడుచుకోండి, తరువాత మీ రెండు చేతుల వెనుక భాగాలను మణికట్ల వరకు తుడుచుకోండి. (ముస్నద్ అ'హ్మద్ పుస్తకం - 4, పేజీ - 263. ఇంకా చూడండి, 5:6).

التفاسير: