Қуръони Карим маъноларининг таржимаси - Телугуча таржима - Абдураҳим ибн Муҳаммад

external-link copy
25 : 4

وَمَنْ لَّمْ یَسْتَطِعْ مِنْكُمْ طَوْلًا اَنْ یَّنْكِحَ الْمُحْصَنٰتِ الْمُؤْمِنٰتِ فَمِنْ مَّا مَلَكَتْ اَیْمَانُكُمْ مِّنْ فَتَیٰتِكُمُ الْمُؤْمِنٰتِ ؕ— وَاللّٰهُ اَعْلَمُ بِاِیْمَانِكُمْ ؕ— بَعْضُكُمْ مِّنْ بَعْضٍ ۚ— فَانْكِحُوْهُنَّ بِاِذْنِ اَهْلِهِنَّ وَاٰتُوْهُنَّ اُجُوْرَهُنَّ بِالْمَعْرُوْفِ مُحْصَنٰتٍ غَیْرَ مُسٰفِحٰتٍ وَّلَا مُتَّخِذٰتِ اَخْدَانٍ ۚ— فَاِذَاۤ اُحْصِنَّ فَاِنْ اَتَیْنَ بِفَاحِشَةٍ فَعَلَیْهِنَّ نِصْفُ مَا عَلَی الْمُحْصَنٰتِ مِنَ الْعَذَابِ ؕ— ذٰلِكَ لِمَنْ خَشِیَ الْعَنَتَ مِنْكُمْ ؕ— وَاَنْ تَصْبِرُوْا خَیْرٌ لَّكُمْ ؕ— وَاللّٰهُ غَفُوْرٌ رَّحِیْمٌ ۟۠

మరియు మీలో ఎవరికైనా స్వతంత్రులైన ముస్లిం స్త్రీలను, వివాహం చేసుకునే స్తోమత లేకుంటే, అప్పుడు మీ స్వాధీనంలో ఉన్న ముస్లిం లైనటువంటి బానిస స్త్రీలను వివాహమాడవచ్చు. మరియు అల్లాహ్ కు మీ విశ్వాసం గురించి తెలుసు. మీరంతా ఒకే ఒక వర్గానికి చెందిన వారు[1]. (ఒకరి కొకరు సంబంధించిన వారు), అందువల్ల వారి సంరక్షకుల అనుమతితో వారితో వివాహం చేసుకొని, ధర్మప్రకారంగా వారి స్త్రీ శుల్కం (మహ్ర్) ఇవ్వండి. ఇది వారిని వివాహ బంధంలో సురక్షితంగా ఉంచటానికి,స్వేచ్ఛా కామక్రీడలకు దిగకుండా ఉంచటానికి మరియు దొంగచాటు సంబంధాలు ఏర్పరచుకోకుండా ఉంచటానికి (ఆదేశించబడింది). వారు (ఆ బానిస స్త్రీలు) వివాహ బంధంలో రక్షణ పొందిన తరువాత కూడా వ్యభిచారానికి పాల్పడితే, స్వతంత్రులైన స్త్రీలకు విధించే శిక్షలోని సగం శిక్ష వారికి విధించండి[2]. ఇది మీలో పాపభీతి గలవారికి వర్తిస్తుంది. ఒకవేళ మీరు నిగ్రహం పాటిస్తే అది మీకే మంచిది. మరియు అల్లాహ్ క్షమాశీలుడు. అపార కరుణాప్రదాత. info

[1] చూడండి, 3:195. [2] అంటే, 50 కొరడా దెబ్బలు.

التفاسير: