[1] చిన్నవారైనా పెద్దవారైనా సంతానం అంతా వారసత్వానికి హక్కుదారులు. గర్భంలో ఉన్న సంతానం కూడా వారసత్వానికి హక్కుదారులు. అవిశ్వాసులైన సంతానం వారసత్వానికి హక్కుదారులు కారు. ఆడ మగ సంతానం ఉన్న పక్షంలో తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి 1/6. మిగతా 2/3 సంతానం కొరకు. భార్య లేక భర్త టే వారి హక్కు వారికిచ్చిన తరువాత మిగతాది సంతానం కొరకు. [2] ఒకవేళ ఒకే ఒక్క కుమారుడు ఉంటే, మొత్తం ఆస్తికి వారసుడు అవుతాడు. ఇతర వారసులు, అంటే తల్లి, తండ్రి, భార్య లేక భర్త ఉంటే, వారి హక్కు వారికిచ్చిన తరువాత మిగతా ఆస్తికి అతడు హక్కుదారుడు. మృతునికి ఒకే కుమార్తె ఉంటే, ఆమెకు 1/2 ఆస్తి, తల్లికి 1/6, తండ్రికి 2/6.