Қуръони Карим маъноларининг таржимаси - Телугуча таржима - Абдураҳим ибн Муҳаммад

హూద్

external-link copy
1 : 11

الٓرٰ ۫— كِتٰبٌ اُحْكِمَتْ اٰیٰتُهٗ ثُمَّ فُصِّلَتْ مِنْ لَّدُنْ حَكِیْمٍ خَبِیْرٍ ۟ۙ

అలిఫ్ - లామ్ - రా[1]. (ఇది) ఒక దివ్యగ్రంథం. దీని సూక్తులు (ఆయాత్) నిర్దుష్టమైనవి మరియు మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు అయిన (అల్లాహ్) తరఫు నుండి వివరించబడ్డాయి; info

[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

التفاسير:

external-link copy
2 : 11

اَلَّا تَعْبُدُوْۤا اِلَّا اللّٰهَ ؕ— اِنَّنِیْ لَكُمْ مِّنْهُ نَذِیْرٌ وَّبَشِیْرٌ ۟ۙ

మీరు అల్లాహ్ ను తప్ప ఇతరులను ఆరాధించ కూడదని (ఓ ముహమ్మద్) ఇలా అను: "నిశ్చయంగా నేను, ఆయన (అల్లాహ్) తరఫు నుండి మీకు హెచ్చరిక చేసేవాడిని మరియు శుభవార్తలు ఇచ్చేవాడిని మాత్రమే! info
التفاسير:

external-link copy
3 : 11

وَّاَنِ اسْتَغْفِرُوْا رَبَّكُمْ ثُمَّ تُوْبُوْۤا اِلَیْهِ یُمَتِّعْكُمْ مَّتَاعًا حَسَنًا اِلٰۤی اَجَلٍ مُّسَمًّی وَّیُؤْتِ كُلَّ ذِیْ فَضْلٍ فَضْلَهٗ ؕ— وَاِنْ تَوَلَّوْا فَاِنِّیْۤ اَخَافُ عَلَیْكُمْ عَذَابَ یَوْمٍ كَبِیْرٍ ۟

మరియు మీరు మీ ప్రభువును క్షమాభిక్ష వేడుకుంటే, తరువాత ఆయన వైపుకు పశ్చాత్తాపంతో మరలితే, ఆయన మీకు నిర్ణయించిన గడువు వరకు మంచి సుఖసంతోషాలను ప్రసాదిస్తాడు. మరియు అనుగ్రహాలకు అర్హుడైన ప్రతి ఒక్కనికీ ఆయన తన అనుగ్రహాలను ప్రసాదిస్తాడు కానీ, మీరు వెనుదిరిగితే! నిశ్చయంగా, ఆ గొప్ప దినమున మీపై రాబోయే శిక్షకు నేను భయపడుతున్నాను! info
التفاسير:

external-link copy
4 : 11

اِلَی اللّٰهِ مَرْجِعُكُمْ ۚ— وَهُوَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟

అల్లాహ్ వైపునకే మీ మరలింపు ఉంది. మరియు ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు." info
التفاسير:

external-link copy
5 : 11

اَلَاۤ اِنَّهُمْ یَثْنُوْنَ صُدُوْرَهُمْ لِیَسْتَخْفُوْا مِنْهُ ؕ— اَلَا حِیْنَ یَسْتَغْشُوْنَ ثِیَابَهُمْ ۙ— یَعْلَمُ مَا یُسِرُّوْنَ وَمَا یُعْلِنُوْنَ ۚ— اِنَّهٗ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ ۟

వినండి! వాస్తవానికి వారు ఆయన నుండి దాక్కోవటానికి తమ వక్షాలను త్రిప్పుకుంటున్నారు. జాగ్రత్త! వారు తమ వస్త్రాలలో తమను తాము కప్పుకున్నప్పటికీ, ఆయన (అల్లాహ్) కు వారు దాచే విషయాలు మరియు వెలిబుచ్చే విషయాలూ అన్నీ బాగా తెలుసు. నిశ్చయంగా, ఆయనకు హృదయాలలో ఉన్నవి (రహస్యాలు) కూడా బాగా తెలుసు.[1] info

[1] చూడండి, 8:55.

التفاسير: