Қуръони Карим маъноларининг таржимаси - Қуръон Карим мухтасар тафсирининг телгуча таржимаси

external-link copy
13 : 33

وَاِذْ قَالَتْ طَّآىِٕفَةٌ مِّنْهُمْ یٰۤاَهْلَ یَثْرِبَ لَا مُقَامَ لَكُمْ فَارْجِعُوْا ۚ— وَیَسْتَاْذِنُ فَرِیْقٌ مِّنْهُمُ النَّبِیَّ یَقُوْلُوْنَ اِنَّ بُیُوْتَنَا عَوْرَةٌ ۛؕ— وَمَا هِیَ بِعَوْرَةٍ ۛۚ— اِنْ یُّرِیْدُوْنَ اِلَّا فِرَارًا ۟

ఓ ప్రవక్తా కపట విశ్వాసుల్లోంచి ఒక వర్గము వారు మదీనా వాసులతో ఇలా పలికినప్పటి వైనమును ఒక సారి గుర్తు చేసుకోండి : ఓ యస్రిబ్ వాసులారా (యస్రిబ్ ఇస్లాం కు పూర్వము మదీనా పేరు) కందకము దగ్గరలో సల్అ పాదము వద్ద మీ కొరకు ఎటువంటి వసతి లేదు. కావున మీరు మీ నివాసముల వైపునకు మరలిపోండి. వారిలో నుండి ఒక వర్గము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో తాము ఉన్న ఇండ్లు శతృవుల కొరకు బహిర్గతమైపోయాయని వాదిస్తూ తమ ఇండ్ల వైపు మరలి వెళ్ళటానికి అనుమతి కోరారు. వాస్తవానికి వారు వాదించినట్లు అవి బహిర్గతం కాలేదు. వారు మాత్రం ఈ అబద్దపు వంకతో శతృవుల నుండి పారిపోదలిచారు. info
التفاسير:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• منزلة أولي العزم من الرسل.
దృఢ సంకల్పము గల ప్రవక్తల స్థానం. info

• تأييد الله لعباده المؤمنين عند نزول الشدائد.
ఆపదలు కలిగేటప్పుడు అల్లాహ్ యొక్క విశ్వాసపర దాసులకు అల్లాహ్ యొక్క మద్దతు. info

• خذلان المنافقين للمؤمنين في المحن.
ఆపదలో కపట విశ్వాసులు విశ్వాసపరులకు సహాయం చేయటమును వదిలివేయటం. info