قرآن کریم کے معانی کا ترجمہ - تیلگو ترجمہ - عبدالرحیم بن محمد

صفحہ نمبر:close

external-link copy
32 : 9

یُرِیْدُوْنَ اَنْ یُّطْفِـُٔوْا نُوْرَ اللّٰهِ بِاَفْوَاهِهِمْ وَیَاْبَی اللّٰهُ اِلَّاۤ اَنْ یُّتِمَّ نُوْرَهٗ وَلَوْ كَرِهَ الْكٰفِرُوْنَ ۟

వారు అల్లాహ్ జ్యోతిని (ఇస్లాంను) తమ నోటితో (ఊది) ఆర్పగోరుతున్నారు, కాని అల్లాహ్ అలా కానివ్వడు; సత్యతిరస్కారులకు అది ఎంత అసహ్యకరమైనా, ఆయన తన జ్యోతిని పూర్తిచేసి (ప్రసరింపజేసి) తీరుతాడు. info
التفاسير:

external-link copy
33 : 9

هُوَ الَّذِیْۤ اَرْسَلَ رَسُوْلَهٗ بِالْهُدٰی وَدِیْنِ الْحَقِّ لِیُظْهِرَهٗ عَلَی الدِّیْنِ كُلِّهٖ ۙ— وَلَوْ كَرِهَ الْمُشْرِكُوْنَ ۟

బహుదైవారాధకులకు (ముష్రికీన్ లకు) అది ఎంత అసహ్యకరమైనా, తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని మరియు సత్యధర్మాన్నీ ఇచ్చి పంపి దానిని సకల ధర్మాల మీద ప్రబలింప జేసినవాడు (ఆధిక్యతనిచ్చిన వాడు) ఆయన (అల్లాహ్) యే![1] info

[1] చూడండి, 3:19 మరియు 61:8-9.

التفاسير:

external-link copy
34 : 9

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِنَّ كَثِیْرًا مِّنَ الْاَحْبَارِ وَالرُّهْبَانِ لَیَاْكُلُوْنَ اَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ وَیَصُدُّوْنَ عَنْ سَبِیْلِ اللّٰهِ ؕ— وَالَّذِیْنَ یَكْنِزُوْنَ الذَّهَبَ وَالْفِضَّةَ وَلَا یُنْفِقُوْنَهَا فِیْ سَبِیْلِ اللّٰهِ ۙ— فَبَشِّرْهُمْ بِعَذَابٍ اَلِیْمٍ ۟ۙ

ఓ విశ్వాసులారా! నిశ్చయంగా, చాలా మంది యూద మతాచారులు (అహ్ బార్) మరియు క్రైస్తవ సన్యాసులు (రుహ్ బాన్) ప్రజల సొత్తును అక్రమ పద్ధతుల ద్వారా తిని వేస్తున్నారు మరియు వారిని అల్లాహ్ మార్గం నుండి ఆటంక పరుస్తున్నారు. మరియు ఎవరైతే వెండి, బంగారాన్ని కూడ బెట్టి, దానిని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టరో వారికి బాధారకమైన శిక్ష గలదనే వార్తను వినిపించు. info
التفاسير:

external-link copy
35 : 9

یَّوْمَ یُحْمٰی عَلَیْهَا فِیْ نَارِ جَهَنَّمَ فَتُكْوٰی بِهَا جِبَاهُهُمْ وَجُنُوْبُهُمْ وَظُهُوْرُهُمْ ؕ— هٰذَا مَا كَنَزْتُمْ لِاَنْفُسِكُمْ فَذُوْقُوْا مَا كُنْتُمْ تَكْنِزُوْنَ ۟

ఆ దినమున దానిని (జకాత్ ఇవ్వని ధనాన్ని /ఆ వెండి బంగారాన్ని) నరకాగ్నిలో కాల్చి దానితో వారి నుదురుల మీద, ప్రక్కల మీద మరియు వీపుల మీద వాతలు వేయబడతాయి.[1] (అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): "ఇదంతా మీరు మీ కొరకు కూడ బెట్టుకున్నదే. కావున మీరు కూడ బెట్టుకున్న దానిని చవి చూడండి." info

[1] చూడండి, 3:180 ఇంకా చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 2, 'హదీస్' నెం. 486.

التفاسير:

external-link copy
36 : 9

اِنَّ عِدَّةَ الشُّهُوْرِ عِنْدَ اللّٰهِ اثْنَا عَشَرَ شَهْرًا فِیْ كِتٰبِ اللّٰهِ یَوْمَ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ مِنْهَاۤ اَرْبَعَةٌ حُرُمٌ ؕ— ذٰلِكَ الدِّیْنُ الْقَیِّمُ ۙ۬— فَلَا تَظْلِمُوْا فِیْهِنَّ اَنْفُسَكُمْ ۫— وَقَاتِلُوا الْمُشْرِكِیْنَ كَآفَّةً كَمَا یُقَاتِلُوْنَكُمْ كَآفَّةً ؕ— وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ مَعَ الْمُتَّقِیْنَ ۟

నిశ్చయంగా, నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర పన్నెండు నెలలు మాత్రమే. ఇది భూమ్యాకాశాలు సృష్టించిన దినం నుండి అల్లాహ్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. వాటిలో నాలుగు నిషిద్ధ (మాసాలు).[1] ఇదే సరైన ధర్మం. కావున వాటిలో (ఆ నాలుగ హిజ్రీ మాసాలలో) మీకు మీరు అన్యాయం చేసుకోకండి.[2] బహుదైవారాధకులతో (ముష్రికీన్ లతో) అందరూ కలిసి పోరాడండి. ఏ విధంగా అయితే వారందరూ కలిసి మీతో పోరాడుతున్నారో! మరియు నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గల వారితోనే ఉంటాడని తెలుసుకోండి.[3] info

[1] నిషిద్ధమాసాలు హిజ్రీ శకపు రజబ్, జు'ల్-ఖాయిదహ్, జు'ల్-'హిజ్జహ్ మరియు ము'హర్రమ్ (7, 11, 12 మరియు 1వ నెలలు). [2] హిజ్రీ నెలల లెక్క చంద్రుని నెలప్రకారం ఉంది.అంటే హిజ్రీ సంవత్సరం చాంద్రమాన సంవత్సరం. ఇది ప్రకృతి సిద్ధమైన నెలలు మరియు సంవత్సరాలు. వీటిని అనుసరించటానికి లెక్కలు పెట్టే అవసరం లేదు. దీని వల్ల రమ'దాన్ ఉపవాసాలు మరియు 'హజ్ వేరువేరు ఋతువులలో వస్తాయి. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ప్రజలు ప్రతి ఋతువులో ఉపవాసాలు, పండుగలు చేసుకుంటారు. చాంద్రనెల 29.5 రోజులది మరియు చాంద్ర సంవత్సరం 354 రోజులది. సూర్యమాన సంవత్సరంలో ఇది 11.25 రోజులు తక్కువ. దీని వల్ల ప్రతి 34 చాంద్రమాన సంవత్సరాలకు అంటే 12,036 దినాలకు ఒకసారి 'హజ్ అదే దినమున మళ్ళీ వస్తుంది. ముష్రిక్ అరబ్బులు, చాంద్రమాన సంవత్సరాన్ని సూర్యమాన సంవత్సరంతో సరిపెట్టటానికి అధికమాసాన్ని చేర్చేవారు. ఈ ఆయత్ తరువాత ఇస్లాం షరీయత్ లో సూర్యమాన సంవత్సరం మరియు అలా సరిపెట్టటం రద్దు చేయబడ్డాయి. [3] చూడండి, 2:193, 8:73.

التفاسير: