قرآن کریم کے معانی کا ترجمہ - تیلگو ترجمہ - عبدالرحیم بن محمد

external-link copy
143 : 2

وَكَذٰلِكَ جَعَلْنٰكُمْ اُمَّةً وَّسَطًا لِّتَكُوْنُوْا شُهَدَآءَ عَلَی النَّاسِ وَیَكُوْنَ الرَّسُوْلُ عَلَیْكُمْ شَهِیْدًا ؕ— وَمَا جَعَلْنَا الْقِبْلَةَ الَّتِیْ كُنْتَ عَلَیْهَاۤ اِلَّا لِنَعْلَمَ مَنْ یَّتَّبِعُ الرَّسُوْلَ مِمَّنْ یَّنْقَلِبُ عَلٰی عَقِبَیْهِ ؕ— وَاِنْ كَانَتْ لَكَبِیْرَةً اِلَّا عَلَی الَّذِیْنَ هَدَی اللّٰهُ ؕ— وَمَا كَانَ اللّٰهُ لِیُضِیْعَ اِیْمَانَكُمْ ؕ— اِنَّ اللّٰهَ بِالنَّاسِ لَرَءُوْفٌ رَّحِیْمٌ ۟

మరియు మీరు ప్రజలకు సాక్షులుగా ఉండటానికి మరియు సందేశహరుడు (ముహమ్మద్) మీకు సాక్షిగా ఉండటానికి[1] మేము, మిమ్మల్ని ఒక మధ్యస్థ (ఉత్తమ మరియు న్యాయశీలమైన) సమాజంగా చేశాము. మరియు ఎవరు సందేశహరుణ్ణి అనుసరిస్తారో మరియు ఎవరు తమ మడమల మీద వెనుదిరిగి పోతారో అనేది పరిశీలించడానికి నీవు పూర్వం అనుసరించే ఖిబ్లా (బైతుల్ మఖ్దిస్) ను ఖిబ్లాగా చేసి ఉన్నాము. మరియు ఇది వాస్తవానికి అల్లాహ్ మార్గదర్శకత్వం చూపిన వారికి తప్ప, ఇతరులకు భారమైనది. మరియు అల్లాహ్ మీ విశ్వాసాన్ని (బైతుల్ మఖ్దిస్ వైపునకు చేసిన నమాజులను) ఎన్నడూ వృథా చేయడు.[2]" నిశ్చయంగా, అల్లాహ్ ప్రజల పట్ల కనికరుడు, అపార కరుణాప్రదాత. info

[1] చూడండి, 22:78 మరియు 'స. బు'ఖారీ, పుస్తకం - 6, 'హదీస్' నం. 14. మథ్యస్థ సమాజం అంటే, ఇస్లాంకు ముందున్న మతస్థులలో కొందరు ఆత్మశుద్ధిని వదలి దేహాన్నే పోషించుకుంటూ పశుప్రాయులై ఉండేవారు. వారు యూదులు మొదలైన వారు. మరి కొందరు దేహాన్ని హింసించుకుంటూ అనేక బాధలు పడి, సంసారాన్ని వదలి అడవులలో నివసిస్తూ ఆత్మశుద్ధిని గురించి కృషి చేసేవారు. ఈ రెండు మార్గాలకు మధ్య ఇహ-పరాలను, దేహాన్ని-ఆత్మశుద్ధిని అనుసరించేవారు శ్రేష్టులు. ఇదే ఇస్లాం బోధన, ఉత్తమమైన మధ్యస్థ మార్గము. [2] ఇక్కడ దీని అర్థం : ఇంత వరకు ము'హమ్మద్ ('స'అస) మరియు అతని అనుచరులు (ర'ది.'అన్హుమ్) బైతుల్ మఖ్దిస్ వైపునకు ముఖం చేసి, చేసిన నమాజులు వ్యర్థం కావు. వాటి ప్రతిఫలం పూర్తిగా ఇవ్వబడుతుంది.

التفاسير: