సత్యతిరస్కారులైన గ్రంథప్రజలకు గానీ మరియు బహుదైవారాధకులకు (ముష్రికులకు) గానీ, మీ ప్రభువు నుండి మీకు ఏదైనా మేలు అవతరించడం ఎంత మాత్రం ఇష్టం లేదు. కానీ అల్లాహ్ తాను కోరిన వారినే తన కరుణకు ప్రత్యేకించు కుంటాడు. మరియు అల్లాహ్ అనుగ్రహించటంలో సర్వోత్తముడు.[1]
[1] అల్-'అ"జీము: అంటే అల్-కబీరు. The Greatest of All, The Supreme, The Incomparably Great. సర్వోత్తముడు, మహాత్ముడు, పరమశ్రేష్ఢుడు, సర్వోత్కృష్టుడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.