قرآن کریم کے معانی کا ترجمہ - تیلگو ترجمہ - عبدالرحیم بن محمد

صفحہ نمبر:close

external-link copy
39 : 19

وَاَنْذِرْهُمْ یَوْمَ الْحَسْرَةِ اِذْ قُضِیَ الْاَمْرُ ۘ— وَهُمْ فِیْ غَفْلَةٍ وَّهُمْ لَا یُؤْمِنُوْنَ ۟

మరియు వారిని (రాబోయే) ఆ పశ్చాత్తాప పడవలసిన దినాన్ని[1] గురించి హెచ్చరించు. అప్పుడు పరిణామం నిర్ణయించ బడి ఉంటుంది.[2] (ఇప్పుడైతే) వారు ఏమరుపాటులో పడి ఉన్నారు, కావున వారు విశ్వసించడం లేదు. info

[1] యౌమల్-'హస్ రతి: పశ్చాత్తాప పడే దినం అంటే పునరుత్థాన దినము. [2] పునరుత్థాన దినమున స్వర్గానికి అర్హులైన వారిని స్వర్గానికి మరియు నరకానికి అర్హులైన వారిని నరకానికి పంపిన తరువాత మరణం ఒక గొర్రె ఆకారంలో తేబడుతుంది. దానిని స్వర్గనరకాల మధ్య నిలబెట్టబడి, స్వర్గ-నరక వాసులతో: 'దీనిని ఎరుగుదురా?' అని ప్రశ్నించగా వారు: 'అవును, ఇది మరణం.' అని అంటారు. వారి సమక్షంలో అది వధింపబడుతుంది. అప్పుడు స్వర్గవాసులతో ఇలా అనబడుతుంది: 'స్వర్గవాసులారా! మీ కొరకు స్వర్గజీవితం కలకాలం ఉంటుంది.' మరియు నరకవాసులతో అనబడుతుంది: 'మీకు ఈ నరకశిక్ష ఎల్లప్పుడూ ఉంటుంది.' మరియు మీ కెవ్వరికీ ఇక చావురాదు. ('స'హీ'హ్ బు'ఖారీ).

التفاسير:

external-link copy
40 : 19

اِنَّا نَحْنُ نَرِثُ الْاَرْضَ وَمَنْ عَلَیْهَا وَاِلَیْنَا یُرْجَعُوْنَ ۟۠

నిశ్చయంగా! భూమికి మరియు దానిపై వున్న వారికి వారసులం మేమే! వారందరూ మా వైపునకే మరలింపబడతారు. info
التفاسير:

external-link copy
41 : 19

وَاذْكُرْ فِی الْكِتٰبِ اِبْرٰهِیْمَ ؕ۬— اِنَّهٗ كَانَ صِدِّیْقًا نَّبِیًّا ۟

మరియు ఈ గ్రంథం (ఖుర్ఆన్ లో) వున్న ఇబ్రాహీమ్ గాథను ప్రస్తావించు. నిశ్చయంగా, అతను సత్యవంతుడైన దైవప్రవక్త. info
التفاسير:

external-link copy
42 : 19

اِذْ قَالَ لِاَبِیْهِ یٰۤاَبَتِ لِمَ تَعْبُدُ مَا لَا یَسْمَعُ وَلَا یُبْصِرُ وَلَا یُغْنِیْ عَنْكَ شَیْـًٔا ۟

అతను తన తండ్రితో ఇలా అన్నప్పుడు: "ఓ నాన్నా! వినలేని మరియు చూడలేని మరియు నీకు ఏ విధంగానూ సహాయపడలేని వాటిని, నీవెందుకు ఆరాధిస్తున్నావు? info
التفاسير:

external-link copy
43 : 19

یٰۤاَبَتِ اِنِّیْ قَدْ جَآءَنِیْ مِنَ الْعِلْمِ مَا لَمْ یَاْتِكَ فَاتَّبِعْنِیْۤ اَهْدِكَ صِرَاطًا سَوِیًّا ۟

ఓ నాన్నా! వాస్తవానికి, నా వద్దకు వచ్చిన జ్ఞానం నీ వద్దకు రాలేదు, కావున నీవు నన్ను అనుసరిస్తే, నేను నీకు సరైన మార్గం చూపుతాను. info
التفاسير:

external-link copy
44 : 19

یٰۤاَبَتِ لَا تَعْبُدِ الشَّیْطٰنَ ؕ— اِنَّ الشَّیْطٰنَ كَانَ لِلرَّحْمٰنِ عَصِیًّا ۟

ఓ నాన్నా! నీవు షైతాన్ ను ఆరాధించకు, నిశ్చయంగా షైతాన్ అనంత కరుణామయుణ్ణి ఉల్లంఘించాడు. info
التفاسير:

external-link copy
45 : 19

یٰۤاَبَتِ اِنِّیْۤ اَخَافُ اَنْ یَّمَسَّكَ عَذَابٌ مِّنَ الرَّحْمٰنِ فَتَكُوْنَ لِلشَّیْطٰنِ وَلِیًّا ۟

ఓ నాన్నా! నిశ్చయంగా, నీవు అనంత కరుణామయుని శిక్షకు గురి అయ్యి, షైతాను యొక్క స్నేహితుడవు / సహచరుడవు (వలి) అయి పోతావేమోనని నేను భయపడుతున్నాను!" info
التفاسير:

external-link copy
46 : 19

قَالَ اَرَاغِبٌ اَنْتَ عَنْ اٰلِهَتِیْ یٰۤاِبْرٰهِیْمُ ۚ— لَىِٕنْ لَّمْ تَنْتَهِ لَاَرْجُمَنَّكَ وَاهْجُرْنِیْ مَلِیًّا ۟

(అతని తండ్రి) అన్నాడు: "ఓ ఇబ్రాహీమ్! ఏమీ? నీవు నా దేవుళ్ళకు విముఖత చూపుతున్నావా? ఒకవేళ నీవిది మానుకోక పోతే నేను నిన్ను రాళ్ళు రువ్వి చంపిస్తాను. కావున నీవు నా నుండి చాలా దూరమై పో!" info
التفاسير:

external-link copy
47 : 19

قَالَ سَلٰمٌ عَلَیْكَ ۚ— سَاَسْتَغْفِرُ لَكَ رَبِّیْ ؕ— اِنَّهٗ كَانَ بِیْ حَفِیًّا ۟

(ఇబ్రాహీమ్) అన్నాడు: "నీకు సలాం![1] నీ కొరకు నా ప్రభువు క్షమాపణను వేడుకుంటాను.[2] నిశ్చయంగా, ఆయన నా యెడల ఎంతో దయాళువు. info

[1] ఈ సలాం ఇక నా సంభాషణ ముగిస్తాను, అనే భావంలో ఉంది. ఎందుకంటే దీని ముందు 'అల్' లేదు. ఇంకా ఇటువంటి సందర్భానికి చూడండి, 25:63. [2] ఈ దు'ఆ - ముష్రిక్ ల కొరకు క్షమాపణ పేడుకోరాదని తెలియక - అల్లాహ్ (సు.తా.) ను, తన తండ్రిని క్షమించమని వేడుకున్నది. కాని ముష్రిక్ కొరకు క్షమాపణ వేడుకోరాదని, తెలిసిన తరువాత, అతని తండ్రి అల్లాహ్ (సు.తా.) కు విరోధుడని స్పష్టమైనప్పుడు, అతను ('అ.స.) తన తండ్రి నుండి దూరమయ్యాడు. అంటే అతని క్షమాపణ కొరకు ప్రార్థించడం మానుకున్నాడు. చూడండి, 9:114.

التفاسير:

external-link copy
48 : 19

وَاَعْتَزِلُكُمْ وَمَا تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ وَاَدْعُوْا رَبِّیْ ۖؗ— عَسٰۤی اَلَّاۤ اَكُوْنَ بِدُعَآءِ رَبِّیْ شَقِیًّا ۟

మరియు నేను మిమ్మల్ని - మరియు అల్లాహ్ కు బదులుగా మీరు ప్రార్థిస్తున్న వాటిని - అందరినీ వదలి పోతున్నాను. మరియు నేను నా ప్రభువును ప్రార్థిస్తాను. నేను నా ప్రభువును ప్రార్థించి విఫలుడను కానని, నమ్ముతున్నాను!" info
التفاسير:

external-link copy
49 : 19

فَلَمَّا اعْتَزَلَهُمْ وَمَا یَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ ۙ— وَهَبْنَا لَهٗۤ اِسْحٰقَ وَیَعْقُوْبَ ؕ— وَكُلًّا جَعَلْنَا نَبِیًّا ۟

అతను (ఇబ్రాహీమ్) వారిని - మరియు అల్లాహ్ ను వదలి వారు ఆరాధించే వాటిని - వదలి పోయిన తరువాత మేము అతనికి ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ లను ప్రసాదించాము. మరియు ప్రతి ఒక్కరినీ ప్రవక్తలుగా చేశాము. info
التفاسير:

external-link copy
50 : 19

وَوَهَبْنَا لَهُمْ مِّنْ رَّحْمَتِنَا وَجَعَلْنَا لَهُمْ لِسَانَ صِدْقٍ عَلِیًّا ۟۠

మరియు వారికి మా కారుణ్యాన్ని ప్రసాదించాము. వారికి నిజమైన, ఉన్నతమైన కీర్తి ప్రతిష్ఠను కలుగజేశాము. info
التفاسير:

external-link copy
51 : 19

وَاذْكُرْ فِی الْكِتٰبِ مُوْسٰۤی ؗ— اِنَّهٗ كَانَ مُخْلَصًا وَّكَانَ رَسُوْلًا نَّبِیًّا ۟

మరియు ఈ గ్రంథం (ఖుర్ఆన్) లో వచ్చిన మూసా గాథను ప్రస్తావించు. నిశ్చయంగా, అతను (అల్లాహ్) ఎన్నుకున్న ఒక సందేశహరుడు మరియు ఒక ప్రవక్త.[1] info

[1] చూడండి, 22:52 రసూలున్: సందేశహరుడు - అంటే అల్లాహ్ (సు.తా.) తన సందేశం అవతరింపజేయటానికి ఎన్నుకున్న ప్రవక్త. సందేశహరునిపై దివ్యగ్రంథం అవతరింపజేయబడుతుంది, ఉదా.మూసా('అ.స.) నబియ్యున్: ప్రవక్త - దివ్యగ్రంథమివ్వబడక అతని కంటే ముందు వచ్చి ఉన్న దివ్యగ్రంథపు సందేశాన్నే ప్రజలకు బోధించేవాడు. ఉదా. హారూన్ ('అ.స.) చూడండి, 19:53. సందేశహరులందరూ ప్రవక్తలే కాని ప్రవక్తలందరూ సందేశరులు కారు.

التفاسير: