[1] అల్-కాఫిరీన్ : అంటే సత్యతిరస్కారులు. ఈ పదం ఇక్కడ ఖుర్ఆన్ అవతరణా క్రమంలో మొదటి సారి వచ్చింది. 57:20లో మాత్రం ఈ పదానికి భూమిని దున్నేవాడు అనే అర్థం ఉంది. మిగతా అన్నీ చోట్లలో ఈ పదం సత్యతిరస్కారులనే అర్థంలోనే వాడబడింది.
[1] చూడండి, 6:94, 19:80, 95. కొందరు వ్యాఖ్యాతలు ఈ ఆయత్ వలీద్ బిన్ ము'గైరాను ఉద్దేశిస్తోంది అని అభిప్రాయపడ్డారు. అతడు సత్యతిరస్కారం మరియు దురహంకారంలో మితిమీరి పోయాడు. ఈ ఆయత్ ఇటువంటి ప్రతి సత్యతిరస్కారిని సూచిస్తుంది.