[1] ఇక్కడ అల్లాహ్ (సు.తా.) సృష్టిలో మార్పులు అంటే; పశువుల చెవులను ప్రత్యేక దైవాల పేర, ప్రత్యేక రకంగా కోసి విడవడమే కాక మానవులు కూడా అందాన్ని హెచ్చించటానికి పచ్చబొట్టు వేయించుకోవటం, మరియు కనుబొమ్మల వెంట్రుకలను కత్తిరించుకోవటం, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవటం, మరియు ట్యుబెక్టమీ మరుయ వాసెక్టమీ చేయించుకొని అల్లాహుతా'ఆలా సృష్టిలో మార్పులు తెచ్చుటకు ప్రయత్నించడం కూడాను. దైవప్రవక్త (స'అస) సంప్రదాయం వల్ల తెలిసిందేమిటంటే పశువులకు ఖస్సీ చేయటం ధర్మసమ్మతమే. ఎందుకంటే దైవప్రవక్త ('స'అస) ఖస్సీ చేసిన పశువుల బలి (ఖుర్బానీ) చేశారు.