قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - تېلۇگوچە تەرجىمىسى- ئابدۇرەھىم ئىبنى مۇھەممەد

بەت نومۇرى:close

external-link copy
44 : 28

وَمَا كُنْتَ بِجَانِبِ الْغَرْبِیِّ اِذْ قَضَیْنَاۤ اِلٰی مُوْسَی الْاَمْرَ وَمَا كُنْتَ مِنَ الشّٰهِدِیْنَ ۟ۙ

మరియు (ఓ ముహమ్మద్!) మేము మూసాపై మా ఆదేశం (తౌరాత్) పూర్తిగా అవతరింప జేసినపుడు, నీవు (తూర్ పర్వతపు) కుడి వైపునా లేవు. మరియు నీవు అక్కడ ప్రత్యక్ష సాక్షులలో కూడా లేవు! info
التفاسير:

external-link copy
45 : 28

وَلٰكِنَّاۤ اَنْشَاْنَا قُرُوْنًا فَتَطَاوَلَ عَلَیْهِمُ الْعُمُرُ ۚ— وَمَا كُنْتَ ثَاوِیًا فِیْۤ اَهْلِ مَدْیَنَ تَتْلُوْا عَلَیْهِمْ اٰیٰتِنَا ۙ— وَلٰكِنَّا كُنَّا مُرْسِلِیْنَ ۟

కాని నిశ్చయంగా, (ఆ తరువాత కూడా) మేము అనేక తరాలను ప్రభవింపజేశాము. వారి మీదుగా ఒక సుదీర్ఘకాలం గడిచి పోయింది. మా సూచనలను వినిపించటానికి నీవు మద్ యన్ వాసులతో కూడా లేవు, కాని మేము (ఎల్లప్పుడూ) మా సందేశహరులను పంపుతూ వచ్చాము. info
التفاسير:

external-link copy
46 : 28

وَمَا كُنْتَ بِجَانِبِ الطُّوْرِ اِذْ نَادَیْنَا وَلٰكِنْ رَّحْمَةً مِّنْ رَّبِّكَ لِتُنْذِرَ قَوْمًا مَّاۤ اَتٰىهُمْ مِّنْ نَّذِیْرٍ مِّنْ قَبْلِكَ لَعَلَّهُمْ یَتَذَكَّرُوْنَ ۟

మరియు మేము (మూసాను) పిలిచినపుడు, నీవు (ఓ ముహమ్మద్!) తూర్ పర్వతం దగ్గర లేవు. కాని నీవు నీ ప్రభువు యొక్క కారుణ్యంతో, నీకు పూర్వం హెచ్చరిక చేసేవాడు రానటువంటి జాతివారిని హెచ్చరించటానికి - బహుశా వారు హితబోధ నేర్చుకుంటారేమోనని - (పంపబడ్డావు). info
التفاسير:

external-link copy
47 : 28

وَلَوْلَاۤ اَنْ تُصِیْبَهُمْ مُّصِیْبَةٌ بِمَا قَدَّمَتْ اَیْدِیْهِمْ فَیَقُوْلُوْا رَبَّنَا لَوْلَاۤ اَرْسَلْتَ اِلَیْنَا رَسُوْلًا فَنَتَّبِعَ اٰیٰتِكَ وَنَكُوْنَ مِنَ الْمُؤْمِنِیْنَ ۟

మరియు వారు తమ చేతులారా, చేసుకొని పంపిన కర్మల ఫలితంగా వారిపై ఆపద వచ్చి పడినపుడు, వారు: "ఓ మా ప్రభూ! నీవు మా వద్దకు ఒక సందేశహరుణ్ణి ఎందుకు పంపలేదు, అలా చేస్తే మేము నీ సూచనలను అనుసరిస్తూ, విశ్వాసులైన వారిలో చేరి ఉండేవారం కదా!" (అని తీర్పు దినమున అనకూడదని). info
التفاسير:

external-link copy
48 : 28

فَلَمَّا جَآءَهُمُ الْحَقُّ مِنْ عِنْدِنَا قَالُوْا لَوْلَاۤ اُوْتِیَ مِثْلَ مَاۤ اُوْتِیَ مُوْسٰی ؕ— اَوَلَمْ یَكْفُرُوْا بِمَاۤ اُوْتِیَ مُوْسٰی مِنْ قَبْلُ ۚ— قَالُوْا سِحْرٰنِ تَظَاهَرَا ۫— وَقَالُوْۤا اِنَّا بِكُلٍّ كٰفِرُوْنَ ۟

ఆ తర్వాత మా తరఫు నుండి వారి వద్దకు సత్యం వచ్చినపుడు, వారిలా అన్నారు: "మూసాకు ఇవ్వ బడినటువంటిది, ఇతనికి ఎందుకు ఇవ్వబడలేదు!" ఏమీ? దీనికి పూర్వం మూసాకు ఇవ్వబడిన దానిని వారు తిరస్కరించలేదా? వారన్నారు: "రెండూ మాయాజాలాలే! అవి ఒకదాని కొకటి సహాయపడుతున్నాయి." ఇంకా ఇలా అన్నారు: "నిశ్చయంగా, మేము వీటన్నింటినీ తిరస్కరిస్తున్నాము." info
التفاسير:

external-link copy
49 : 28

قُلْ فَاْتُوْا بِكِتٰبٍ مِّنْ عِنْدِ اللّٰهِ هُوَ اَهْدٰی مِنْهُمَاۤ اَتَّبِعْهُ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟

(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "మీరు నిజాయితీపరులే అయితే, అల్లాహ్ దగ్గర నుండి ఈ రెండింటి కంటే ఉత్తమమైన మార్గం చూపే ఒక గ్రంథాన్ని తీసుకురండి. దానిని నేను అనుసరిస్తాను." info
التفاسير:

external-link copy
50 : 28

فَاِنْ لَّمْ یَسْتَجِیْبُوْا لَكَ فَاعْلَمْ اَنَّمَا یَتَّبِعُوْنَ اَهْوَآءَهُمْ ؕ— وَمَنْ اَضَلُّ مِمَّنِ اتَّبَعَ هَوٰىهُ بِغَیْرِ هُدًی مِّنَ اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَ ۟۠

వారు నీకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోతే, వారు కేవలం తమ కోరికలను అనుసరిస్తున్నారని తెలుసుకో! మరియు అల్లాహ్ మార్గదర్శకత్వాన్ని విడిచి కేవలం తన కోరికలను అనుసరించే వాని కంటే ఎక్కువ మార్గభ్రష్టుడు ఎవడు? నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు. info
التفاسير: