قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

بەت نومۇرى:close

external-link copy
179 : 7

وَلَقَدْ ذَرَاْنَا لِجَهَنَّمَ كَثِیْرًا مِّنَ الْجِنِّ وَالْاِنْسِ ۖؗ— لَهُمْ قُلُوْبٌ لَّا یَفْقَهُوْنَ بِهَا ؗ— وَلَهُمْ اَعْیُنٌ لَّا یُبْصِرُوْنَ بِهَا ؗ— وَلَهُمْ اٰذَانٌ لَّا یَسْمَعُوْنَ بِهَا ؕ— اُولٰٓىِٕكَ كَالْاَنْعَامِ بَلْ هُمْ اَضَلُّ ؕ— اُولٰٓىِٕكَ هُمُ الْغٰفِلُوْنَ ۟

మా (ముందస్తు) జ్ఞానము వలన ఎంతో మంది జిన్నాతులను,ఎంతో మంది మానవులను వారు నరక వాసుల చర్యకు పాల్పడుతారని నరకం కొరకు సృష్టించినాము. వారికి హృదయాలు ఉన్నవి వాటి ద్వారా వారు తమకు ఏది లాభం చేకూరుస్తుందో,ఏది నష్టం కలిగిస్తుందో గ్రహించలేరు. వారికి కళ్ళు ఉన్నవి వాటి ద్వారా వారు తమలో,సృష్టిలో ఉన్న అల్లాహ్ యొక్క సూచనల ద్వారా గుణపాఠం నేర్చుకోవటానికి చూడలేరు. వారికి చెవులు ఉన్నవి వాటి ద్వారా అల్లాహ్ యొక్క ఆయతుల్లో ఉన్న దానిని యోచన చేయటానికి వినలేరు. ఈ గుణాలను కలిగిన వీరందరు బుద్దిని కోల్పోవటంలో పశువుల్లాంటి వారు. కాదు వారు మార్గ విహీనతలో పశువుల కంటే చాలా దూరం వెళ్ళిపోయారు. వారందరు అల్లాహ్ పై,పరలోకం పై విశ్వాసము నుండి పరధ్యానంలో పడిపోయారు. info
التفاسير:

external-link copy
180 : 7

وَلِلّٰهِ الْاَسْمَآءُ الْحُسْنٰی فَادْعُوْهُ بِهَا ۪— وَذَرُوا الَّذِیْنَ یُلْحِدُوْنَ فِیْۤ اَسْمَآىِٕهٖ ؕ— سَیُجْزَوْنَ مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟

అల్లాహ్ కొరకు ఆయన గొప్పతనమును,ఆయన పరిపూర్ణతను సూచించే మంచి మంచి పేర్లు కలవు. వాటి ద్వారా మీరు కోరుకుంటున్న వాటిని అడుగుతూ అల్లాహ్ తో వేడుకోండి. వాటి ద్వారా ఆయన్ను పొగడండి. మరియు ఈ నామములను అల్లాహేతరుల కొరకు చేసి,లేదా వాటిని ఆయన నుండి నిరాకరించి లేదా వాటి అర్ధాన్ని మార్చి లేదా వాటి ద్వారా ఆయనను వదిలి వేరే వారికి పోల్చి వాటి విషయంలో విముఖత చూపే వారిని మీరు వదిలి వేయండి. వాటి ద్వారా సత్యము నుండి విముఖత చూపే వీరందరికి మేము తొందరలోనే వారు చేసిన కార్యాలకు ప్రతిఫలంగా బాధాకరమైన శిక్షను ప్రసాదిస్తాము. info
التفاسير:

external-link copy
181 : 7

وَمِمَّنْ خَلَقْنَاۤ اُمَّةٌ یَّهْدُوْنَ بِالْحَقِّ وَبِهٖ یَعْدِلُوْنَ ۟۠

మేము సృష్టించిన వారిలో స్వయంగా సత్యానికి అనుగుణంగా సన్మార్గమును పొందే,వారే కాకుండా ఇతరులు కూడా సన్మార్గం పొందటానికి దాని వైపున పిలిచే,దాని ద్వారా న్యాయ పూరితంగా,దుర్మార్గమునకు పాల్పడకుండా నిర్ణయం తీసుకునే ఒక సముదాయం (వర్గం) ఉన్నది. info
التفاسير:

external-link copy
182 : 7

وَالَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا سَنَسْتَدْرِجُهُمْ مِّنْ حَیْثُ لَا یَعْلَمُوْنَ ۟ۚ

మరియు ఎవరైతే మన ఆయతులను తిరస్కరిస్తారో,వాటిని విశ్వసించరో అంతే కాకుండా వాటిని నిరాకరిస్తారో వారి కొరకు మేము తొందరలోనే ఆహారోపాధి ద్వారాలను వారికి గౌరవప్రదంగా కాకుండా వారిని వారు ఉన్న మార్గ భ్రష్టతలో ఇంకా పెరిగిపోయే వరకు క్రమక్రమంగా బిగుసుపోయే వరకు తెరుస్తాము. మరల వారు పరధ్యానంలో ఉన్నప్పుడు మా శిక్ష వారిపై వచ్చి పడుతుంది. info
التفاسير:

external-link copy
183 : 7

وَاُمْلِیْ لَهُمْ ؕ— اِنَّ كَیْدِیْ مَتِیْنٌ ۟

వారు శిక్షించబడరని సందేహపడే వరకు,వారిపై శిక్ష పెంచబడే వరకు తమ తిరస్కారము,తమ అవిశ్వాసము పై కొనసాగటం కొరకు నేను వారి నుండి శిక్షను ఆలస్యం చేస్తాను. నిశ్చయంగా నా వ్యూహం బలమైనది. అయితే నేను వారిపై దాతృత్వం చూపిస్తాను. వారు నిరాశులు కావాలని (విఫలం కావాలని) నేను కోరుకుంటున్నాను. info
التفاسير:

external-link copy
184 : 7

اَوَلَمْ یَتَفَكَّرُوْا ٚ— مَا بِصَاحِبِهِمْ مِّنْ جِنَّةٍ ؕ— اِنْ هُوَ اِلَّا نَذِیْرٌ مُّبِیْنٌ ۟

మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పిచ్చివారు కాదని,అల్లాహ్ శిక్ష గురించి స్పష్టంగా హెచ్చరించటం కొరకు అల్లాహ్ ఆయనను హెచ్చరికునిగా పంపించిన సందేశహరుడు మాత్రమే అని వారికి స్పష్టం అవటం కొరకు తమ బుద్దులను పనిలో పెట్టడం ద్వారా ఈ సత్య తిరస్కారులందరు అల్లాహ్ సూచనల్లో,ఆయన ప్రవక్తల్లో ఎందుకు యోచన చేయటం లేదు ?. info
التفاسير:

external-link copy
185 : 7

اَوَلَمْ یَنْظُرُوْا فِیْ مَلَكُوْتِ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا خَلَقَ اللّٰهُ مِنْ شَیْءٍ ۙ— وَّاَنْ عَسٰۤی اَنْ یَّكُوْنَ قَدِ اقْتَرَبَ اَجَلُهُمْ ۚ— فَبِاَیِّ حَدِیْثٍ بَعْدَهٗ یُؤْمِنُوْنَ ۟

మరియు వారందరు భూమిలో,ఆకాశములో ఉన్న అల్లాహ్ యొక్క రాజ్యాధికారము వైపునకు గుణపాఠం నేర్చుకునే దృష్టితో ఎందుకు చూడటం లేదు ?. మరియు వాటిలో అల్లాహ్ సృష్టించిన జంతువులను,వృక్షాలను ఇతరత్రా వాటి వైపునకు ఎందుకు చూడటం లేదు ?. సమయం దాటక ముందే పశ్చాత్తాప్పడటానికి తమ సమయాల ముగింపు దగ్గర పడి ఉండవచ్చని ఎందుకు వాటి వైపు చూడటం లేదు ?. అయితే వారు ఖుర్ఆన్ ను,అందులో ఉన్న వాగ్ధానమును,హెచ్చరికను విశ్వసించనప్పుడు దానిని కాకుండా వేరే ఏ గ్రంధాన్ని విశ్వసిస్తారు ?. info
التفاسير:

external-link copy
186 : 7

مَنْ یُّضْلِلِ اللّٰهُ فَلَا هَادِیَ لَهٗ ؕ— وَیَذَرُهُمْ فِیْ طُغْیَانِهِمْ یَعْمَهُوْنَ ۟

అల్లాహ్ ఎవరినైతే సత్యం వైపునకు మార్గం పొందటం నుండి విఫలం చేస్తాడో,అల్లాహ్ అతనిని సన్మార్గం నుంచి తప్పించి వేస్తాడో అతనని దాని వైపునకు దారి చూపించే వాడు ఎవడూ ఉండడు. అల్లాహ్ వారిని వారి మార్గభ్రష్టతలోనే,వారి తిరస్కారంలోనే అయోమయంలో పడి ఉండేటట్లు,దేని వైపున మార్గం పొందకుండా ఉండేటట్లు వదిలి వేస్తాడు. info
التفاسير:

external-link copy
187 : 7

یَسْـَٔلُوْنَكَ عَنِ السَّاعَةِ اَیَّانَ مُرْسٰىهَا ؕ— قُلْ اِنَّمَا عِلْمُهَا عِنْدَ رَبِّیْ ۚ— لَا یُجَلِّیْهَا لِوَقْتِهَاۤ اِلَّا هُوَ ؔؕۘ— ثَقُلَتْ فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— لَا تَاْتِیْكُمْ اِلَّا بَغْتَةً ؕ— یَسْـَٔلُوْنَكَ كَاَنَّكَ حَفِیٌّ عَنْهَا ؕ— قُلْ اِنَّمَا عِلْمُهَا عِنْدَ اللّٰهِ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَعْلَمُوْنَ ۟

మొరోటోళ్ళు అయిన సత్యతిరస్కారులు ప్రళయం గురించి అది ఎప్పుడు వస్తుంది,దాని గురించి జ్ఞానము ఎప్పుడు స్థిరపడును ? అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఓ ముహమ్మద్ మీరు ఇలా సమాధానమివ్వండి : దాని జ్ఞానము నాకు లేదు,ఇతరులకు లేదు. దాని జ్ఞానము కేవలం ఒక్కడైన అల్లాహ్ కు ఉన్నది. దాని కోసం నిర్ధారించిన వేళ అల్లాహ్ తప్ప ఇంకెవరికి బహిర్గతం అవలేదు. దాని బహిర్గతమయ్యే విషయం ఆకాశ వాసులు,భూ వాసుల పై గోప్యము. అది మీ వద్దకు అకస్మాత్తుగా మాత్రం వస్తుంది. ప్రళయ జ్ఞానం గురించి మీరు అత్యాశ చూపిస్తున్నట్లు వారు మిమ్మల్ని ప్రళయం గురించి ప్రశ్నిస్తున్నారు. మీ ప్రభువు గురించి మీకు పరిపూర్ణ జ్ఞానం ఉండటం వలన దాని గురించి మీరు అడగటం లేదన్న విషయం వారికి తెలియదు. ఓ ముహమ్మద్ ప్రళయం గురించి జ్ఞానము కేవలం ఒక్కడైన అల్లాహ్ వద్దే ఉన్నదని,కాని చాలా మందికి దాని గురించి తెలియదని వారికి తెలియపరచండి. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• خلق الله للبشر آلات الإدراك والعلم - القلوب والأعين والآذان - لتحصيل المنافع ودفع المضار.
అల్లాహ్ మానవుని కొరకు గ్రహించే,తెలుసుకునే సాధనాలైన హృదయాలు,కళ్ళు,చెవులను ప్రయోజనాలను పొందటానికి,నష్టాలను తొలగించటానికి సృష్టించినాడు. info

• الدعاء بأسماء الله الحسنى سبب في إجابة الدعاء، فيُدْعَى في كل مطلوب بما يناسب ذلك المطلوب، مثل: اللهمَّ تب عَلَيَّ يا تواب.
అల్లాహ్ యొక్క మంచి మంచి నామముల ద్వారా దుఆ చేయటం దుఆ స్వీకరించబడటానికి కారణమవును. అయితే కోరుకునే ప్రతి విషయంలో దానికి సరి అగు వాటి ద్వారా దుఆ చేయాలి. ఉదాహరణకి : ఓ మన్నించే వాడా నన్ను మన్నించు {اللهمَّ تب عَلَيَّ يا تواب}. info

• التفكر في عظمة السماوات والأرض، والتوصل بهذا التفكر إلى أن الله تعالى هو المستحق للألوهية دون غيره؛ لأنه المنفرد بالصنع.
భూమ్యాకాశాల గొప్పతనం విషయంలో యోచన చేయటం ఆ యోచన ద్వారా అల్లాహ్ ఒక్కడే దైవత్వమునకు అర్హుడు అన్న విషయానికి చేరుకోవటం,ఎందుకంటే తయారు చేయటంలో (సృష్టించటంలో) ఆయన ఒక్కడే. info