قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
20 : 31

اَلَمْ تَرَوْا اَنَّ اللّٰهَ سَخَّرَ لَكُمْ مَّا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ وَاَسْبَغَ عَلَیْكُمْ نِعَمَهٗ ظَاهِرَةً وَّبَاطِنَةً ؕ— وَمِنَ النَّاسِ مَنْ یُّجَادِلُ فِی اللّٰهِ بِغَیْرِ عِلْمٍ وَّلَا هُدًی وَّلَا كِتٰبٍ مُّنِیْرٍ ۟

ఓ ప్రజలారా మీరు చూడలేదా,గమనించలేదా అల్లాహ్ ఆకాశములలో ఉన్న సూర్యుడిని,చంద్రుడిని,నక్షత్రాలను ప్రయోజనం పొందటమునకు మీ కొరకు అందుబాటులో ఉంచాడు. మరియు భూమిపై ఉన్న జంతువులను,వృక్షాలను,మొక్కలను కూడా మీకు అందుబాటులో ఉంచాడు. మరియు ఆయన ప్రత్యక్షంగా కనబడే రూప అందము, మంచి శరీరాకృతి లాంటి మరియు లోపల దాగి ఉన్న బుద్ధి,జ్ఞానము లాంటి తన అనుగ్రహాలను మీపై పరిపూర్ణం చేశాడు. ఈ అనుగ్రహాలు ఉండి కూడా ప్రజల్లోంచి కొంతమంది అల్లాహ్ వద్ద నుండి దివ్య జ్ఞానముతో ఎటువంటి పత్రిక జ్ఞానం లేకుండా లేదా కాంతివంతమైన బుద్ధి, అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడిన ఎటువంటి స్పష్టమైన గ్రంధం లేకుండా అల్లాహ్ ఏకత్వము విషయంలో వాదులాడుతున్నారు. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• نعم الله وسيلة لشكره والإيمان به، لا وسيلة للكفر به.
అల్లాహ అనుగ్రహాలు ఆయనకు కృతజ్ఞత తెలుపుకోవటానికి,ఆయనపై విశ్వాసమును కనబరచటానికి ఒక కారకము అంతే గాని ఆయనను తిరస్కరించటానికి కారకం కాదు. info

• خطر التقليد الأعمى، وخاصة في أمور الاعتقاد.
గుడ్డిగా అనుకరించటం యొక్క ప్రమాదము ప్రత్యేకించి విశ్వాస విషయాల్లో. info

• أهمية الاستسلام لله والانقياد له وإحسان العمل من أجل مرضاته.
అల్లాహ్ కి లొంగిపోవటం,ఆయనకి విధేయత చూపటం మరియు ఆయన ఇచ్ఛల వలన ఆచరణను మంచిగా చేయటం. info

• عدم تناهي كلمات الله.
అల్లాహ్ మాటలకు అంతం లేదు. info