قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
37 : 3

فَتَقَبَّلَهَا رَبُّهَا بِقَبُوْلٍ حَسَنٍ وَّاَنْۢبَتَهَا نَبَاتًا حَسَنًا ۙ— وَّكَفَّلَهَا زَكَرِیَّا ؕ— كُلَّمَا دَخَلَ عَلَیْهَا زَكَرِیَّا الْمِحْرَابَ ۙ— وَجَدَ عِنْدَهَا رِزْقًا ۚ— قَالَ یٰمَرْیَمُ اَنّٰی لَكِ هٰذَا ؕ— قَالَتْ هُوَ مِنْ عِنْدِ اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ یَرْزُقُ مَنْ یَّشَآءُ بِغَیْرِ حِسَابٍ ۟

అల్లాహ్ దయతో ఆ సమర్పణను అంగీకరించి, ఆమెను బాగా పెంచాడు. ఆయన తన భక్తుల హృదయాలను ఆమె పట్ల శ్రద్ధ చూపేటట్లు చేసాడు మరియు ఆమెను ప్రవక్త జకరియా అలైహిస్సలాం సంరక్షణలో ఉంచాడు. ఎప్పుడైతే జకరియా ఆమె ఆరాధనా స్థలంలోనికి ప్రవేశించాడో, అక్కడ అతను తాజా ఆహారాన్ని చూశాడు. అప్పుడు అతను ఆమెను 'ఓ మర్యం (మేరీ), నీ వద్దకు ఈ ఆహారం ఎక్కడ నుండి వచ్చింది?' అని అడుగగా, ఆమె ఇలా జవాబిచ్చినది, 'ఈ ఆహారం అల్లాహ్ నుండి వచ్చింది. లెక్క లేకుండా అల్లాహ్ తనకు తోచిన వారికి సమృద్ధిగా ఇస్తాడు '. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• عظم مقام الله وشدة عقوبته تجعل العاقل على حذر من مخالفة أمره تعالى.
అల్లాహ్ యొక్క మహోన్నత స్థానం మరియు ఆయన శిక్షలలోని తీవ్రత, కఠినత్వం ఏ తెలివైన వ్యక్తినైనా సరే, ఆయన ధర్మాజ్ఞలను ఉల్లంఘించకుండా జాగ్రత్త పడేలా చేస్తుంది. info

• برهان المحبة الحقة لله ولرسوله باتباع الشرع أمرًا ونهيًا، وأما دعوى المحبة بلا اتباع فلا تنفع صاحبها.
అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్త పై చూపే నిజమైన ప్రేమకు నిదర్శనం ఏమిటంటే ఆయన షరీఅహ్ (పవిత్ర ధర్మశాసనం) లోని ధర్మాజ్ఞలను మరియు నిషేధాజ్ఞలను తు.చ. తప్పకుండా పాటించడం. విధేయత లేని ప్రేమ వాదన వాదించేవాడికి ప్రయోజనం కలిగించదు. info

• أن الله تعالى يختار من يشاء من عباده ويصطفيهم للنبوة والعبادة بحكمته ورحمته، وقد يخصهم بآيات خارقة للعادة.
తన వివేకం మరియు అనుగ్రహం ద్వారా అల్లాహ్ తన దాసులలో నుండి తనకు తోచిన వారిని ప్రవక్త పదవి కోసం మరియు తన ఆరాధన కోసం మరియు ప్రవక్త మహిమల కోసం ఎంచుకుంటాడు. info