Kur'an-ı Kerim meal tercümesi - Telugu Dilinde Tercüme - Abdurrahim B. Muhammed

Sayfa numarası:close

external-link copy
94 : 9

یَعْتَذِرُوْنَ اِلَیْكُمْ اِذَا رَجَعْتُمْ اِلَیْهِمْ ؕ— قُلْ لَّا تَعْتَذِرُوْا لَنْ نُّؤْمِنَ لَكُمْ قَدْ نَبَّاَنَا اللّٰهُ مِنْ اَخْبَارِكُمْ ؕ— وَسَیَرَی اللّٰهُ عَمَلَكُمْ وَرَسُوْلُهٗ ثُمَّ تُرَدُّوْنَ اِلٰی عٰلِمِ الْغَیْبِ وَالشَّهَادَةِ فَیُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟

మీరు (తబూక్ దండయాత్ర నుండి) మరలి వారి వద్దకు వచ్చిన తరువాత కూడా వారు (కపటవిశ్వాసులు) మీతో తమ సాకులు చెబుతున్నారు. వారితో అను: "మీరు సాకులు చెప్పకండి, మేము మీ మాటలను నమ్మము. అల్లాహ్ మాకు మీ వృత్తాంతం తెలిపి వున్నాడు. మరియు అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మీ ప్రవర్తనను కనిపెట్టగలరు, తరువాత మీరు అగోచర మరియు గోచర విషయాలు ఎరుగునట్టి ఆయన (అల్లాహ్) వైపునకు మరలింపబడతారు. అప్పుడాయన మీరు చేస్తూ ఉన్న వాటిని గురించి మీకు తెలుపుతాడు." info
التفاسير:

external-link copy
95 : 9

سَیَحْلِفُوْنَ بِاللّٰهِ لَكُمْ اِذَا انْقَلَبْتُمْ اِلَیْهِمْ لِتُعْرِضُوْا عَنْهُمْ ؕ— فَاَعْرِضُوْا عَنْهُمْ ؕ— اِنَّهُمْ رِجْسٌ ؗ— وَّمَاْوٰىهُمْ جَهَنَّمُ ۚ— جَزَآءً بِمَا كَانُوْا یَكْسِبُوْنَ ۟

(ఓ విశ్వాసులారా!) మీరు వారి వద్దకు మరలి వచ్చిన తరువాత వారిని వదలి పెట్టాలని (మీరు వారిపై చర్య తీసుకో గూడదని), వారు మీ ముందు అల్లాహ్ పేరుతో ప్రమాణాలు చేస్తారు. కావున మీరు వారి నుండి విముఖులు కండి. నిశ్చయంగా, వారు అశుచులు (మాలిన్యం వంటివారు). వారి నివాసం నరకమే. అదే వారు అర్జించిన దాని ఫలితం. info
التفاسير:

external-link copy
96 : 9

یَحْلِفُوْنَ لَكُمْ لِتَرْضَوْا عَنْهُمْ ۚ— فَاِنْ تَرْضَوْا عَنْهُمْ فَاِنَّ اللّٰهَ لَا یَرْضٰی عَنِ الْقَوْمِ الْفٰسِقِیْنَ ۟

మీరు వారితో రాజీ పడాలని, వారు (కపట విశ్వాసులు) మీ ముందు ప్రమాణాలు చేస్తున్నారు. ఒకవేళ మీరు వారితో రాజీ పడినా, నిశ్చయంగా, అల్లాహ్ అవిధేయులు (ఫాసిఖీన్) అయిన ప్రజలతో రాజీ పడడు.[1] info

[1] దైవప్రవక్త ('స'అస) తబూక్ దండయాత్ర నుండి తిరిగి వచ్చిన తరువాత, వారంతా క్షేమంగా తిరిగి వచ్చింది చూసి కపట విశ్వాసులు, తాము నమ్మకస్తులమని నిరూపించగోరారు. ఆ సమయంలో పై మూడు ఆయతులు (94-96) అవతరింపజేయబడ్డాయి.

التفاسير:

external-link copy
97 : 9

اَلْاَعْرَابُ اَشَدُّ كُفْرًا وَّنِفَاقًا وَّاَجْدَرُ اَلَّا یَعْلَمُوْا حُدُوْدَ مَاۤ اَنْزَلَ اللّٰهُ عَلٰی رَسُوْلِهٖ ؕ— وَاللّٰهُ عَلِیْمٌ حَكِیْمٌ ۟

ఎడారివాసులు (బద్దూలు) సత్యతిరస్కార మరియు కపట విశ్వాస విషయాలలో అతి కఠినులు. వారు అల్లాహ్ తన ప్రవక్త పై అవతరింపజేసిన (ధర్మ) నియమాలు అర్థం చేసుకునే యోగ్యత లేనివారు.[1] మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు. info

[1] ఎందుకంటే వారు నగరాల నుండి దూరప్రాంతాలలో ఉండటం వలన అల్లాహ్ (సు.తా.) మరియు ఆయన (సు.తా.), ప్రవక్త ('స'అస) మాటలు వినలేరు.

التفاسير:

external-link copy
98 : 9

وَمِنَ الْاَعْرَابِ مَنْ یَّتَّخِذُ مَا یُنْفِقُ مَغْرَمًا وَّیَتَرَبَّصُ بِكُمُ الدَّوَآىِٕرَ ؕ— عَلَیْهِمْ دَآىِٕرَةُ السَّوْءِ ؕ— وَاللّٰهُ سَمِیْعٌ عَلِیْمٌ ۟

మరియు ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు తాము (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేసిన దానిని దండుగగా భావించే వారున్నారు. (ఓ విశ్వాసులారా!) మీరు ఆపదలలో చిక్కుకోవాలని వారు ఎదురు చూస్తున్నారు. (కాని) వారినే ఆపద చుట్టుకుంటుంది. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.[1] info

[1] వీరు మొదటి రకానికి చెందిన బుద్ధూలు.

التفاسير:

external-link copy
99 : 9

وَمِنَ الْاَعْرَابِ مَنْ یُّؤْمِنُ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ وَیَتَّخِذُ مَا یُنْفِقُ قُرُبٰتٍ عِنْدَ اللّٰهِ وَصَلَوٰتِ الرَّسُوْلِ ؕ— اَلَاۤ اِنَّهَا قُرْبَةٌ لَّهُمْ ؕ— سَیُدْخِلُهُمُ اللّٰهُ فِیْ رَحْمَتِهٖ ؕ— اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟۠

మరియు ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించే వారున్నారు.[1] వారు తాము (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేసేది, తమకు అల్లాహ్ సాన్నిధ్యాన్ని మరియు ప్రవక్త ప్రార్థనలను చేకూర్చటానికి సాధనంగా చేసుకుంటున్నారు. వాస్తవానికి అది వారికి తప్పక సాన్నిధ్యాన్ని చేకూర్చుతుంది. అల్లాహ్ వారిని తన కారుణ్యంలోకి చేర్చుకోగలడు. నిశ్చయంగా! అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. info

[1] వీరు రెండో రకానికి చెందిన మంచి విశ్వాసులు.

التفاسير: