Kur'an-ı Kerim meal tercümesi - Telugu Dilinde Tercüme - Abdurrahim B. Muhammed

external-link copy
105 : 5

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا عَلَیْكُمْ اَنْفُسَكُمْ ۚ— لَا یَضُرُّكُمْ مَّنْ ضَلَّ اِذَا اهْتَدَیْتُمْ ؕ— اِلَی اللّٰهِ مَرْجِعُكُمْ جَمِیْعًا فَیُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟

ఓ విశ్వాసులారా! మీ స్వయానికి మీరు బాధ్యత వహించండి. మీరు సన్మార్గంలో ఉంటే, మార్గభ్రష్టులైన వారు మీకు ఎలాంటి హాని చేయలేరు.[1] మీరంతా అల్లాహ్ వైపునకే మరలి పోవలసి వుంది. అప్పుడు ఆయన మీరేమేమి చేస్తూ ఉండే వారో మీకు తెలియజేస్తాడు. info

[1] ప్రజలు ఈ ఆయత్ ను సరిగ్గా అర్థం చేసుకోలేనందువలన అబూ బక్ర్ సిద్ధీఖ్ (ర'ది.'అ) వారితో ఇలా అన్నారు: "ప్రజలారా! నేను దైవప్రవక్త ('స'అస) ను ఇలా అంటుండగా విన్నాను: 'ప్రజలు చెడు జరుగుతుండగా చూసి, దానిని మార్చటానికి ప్రయత్నం చేయకుంటే త్వరలోనే అల్లాహ్ (సు.తా.) వారిని తన శిక్షకు గురి చేయవచ్చు!' " (ముస్నద్ అ'హ్మద్ పుస్తకము - 1, పేజీ - 5. తిర్మిజీ', 'హదీస్' నం. 2178; అబూ దావూద్, 'హదీస్' నం. 4338). ఈ ఆయత్ అర్థం ఏమిటంటే : మీరు సన్మార్గం మీద ఉండి, చెడు నుండి దూరంగా ఉంటూ, ప్రజలకు సన్మార్గం చూపుతూ దుర్మార్గం నుండి ఆపుతూ ఉంటే, వారు మీ మాటను లక్ష్యపెట్టనిచో మీ పని మీరు చేశారు. దానికి ప్రతిఫలం పొందుతారు. కాని మీ ప్రాణానికి హాని కలిగే భయం ఉంటే! మీరు: 'అమ్ర్ బిల్ మ'అరూఫ్ వ నహా 'అనిల్ మున్కర్.' ను ఉపేక్షించవచ్చు!

التفاسير: