[1] ను'సుబున్: అంటే ముష్రికులు తమ దేవతలకు, దైవదూతలకు, జిన్నాతులకు, లేక తమ పూర్వీకులైన పుణ్యపురుషులకు, మొదలైన వారి కొరకు బలి ఇవ్వటానికి నియమించిన ప్రత్యేక ఆస్థానాలు. వాటిపై అల్లాహ్ (సు.తా.) పేరుతో కూడా బలి చేసినా అది 'హరాం. అక్కడ బలి చేయబడిన పశు మాంసాన్ని తినటం కూడా 'హరాం (నిషిద్ధం). [2] ఈ భాగం 10వ హిజ్రీలో 9వ జి'ల్-హజ్ రోజు, 'హజ్ సమయంలో, 'అరఫాత్ మైదానంలో అవతరింపజేయబడింది. దైవప్రవక్త ('స'అస) అంతి కాలానికి దాదాపు 82 రోజులకు ముందు. దీని తరువాత న్యాయానికి సంబంధించిన ఏ ఆయత్ కూడా అవతరింపజేయబడలేదు. [3] చూడండి,2:173.
[1] వేట నేర్పి, వేటాడటానికి ఉపయోగపడే జంతువులు పక్షులు మొదలైనవి ఉదా: కుక్క, చిరుతపులి, డేగ మొదలైనవి. [2] ఇక్కడ రెండు షరతులున్నాయి: 1) వేట జంతువును విడుచునప్పుడు బిస్మిల్లా హిర్ర'హ్మా నిర్ర'హీమ్, అనాలి. 2) ఆ వేట జంతువు పట్టిన దానిని తన యజమాని కొరకు వదలాలి, దానిని అది తినగూడదు. అట్టి జంతువు పట్టిన దానిని చంపినా తన యజమాని వచ్చేవరకు దానిని తినగూడదు. అట్టి జంతువు చనిపోయినా, అది 'హలాల్. వేటలో యజమాని విడిచిన వేట జంతువు తప్ప. మరొక జంతువు పాల్గొనరాదు. ఇదే ఆజ్ఞ బాణానికి కూడా వర్తిస్తుంది. ('స'హీ'హ్ బు'ఖారీ, ముస్లిం).
[1] గ్రంథప్రజల ఆహారం అంటే, ఏదైతే అల్లాహ్ పేరుతో జి'బ్'హ్ చేయబడి రక్తం ప్రవహింపజేయబడిందో అదే. కాని మొదట మత్తు చేయబడి తరువాత గొంతు కోయబడినది కాదు. ఏ ఆహారపదార్థాలైతే ఇస్లాం ధర్మశాసనం ప్రకారం హరాం చేయబడ్డాయో వాటిని విడిచి. [2] పూర్వగ్రంథ ప్రజల స్త్రీల విషయం: వారు ఆధునిక భావాల వారై, ఇప్పుడు పశ్చిమ దేశాలలో, నడుస్తున్న సాంఘిక విచారాలను సమర్థించేవారైతే గ్రంథ ప్రజలతో వివాహం ధర్మసమ్మతమైనా వారి నడకలు 'హరాం అయితే, అట్టి స్త్రీలతో వివాహం చేసుకోవటం ఏ విధంగా ధర్మసమ్మతం కాగలదో ఆలోచించవలసిన విషయం. ప్రస్తుత కాలంలో చాలా మంది గ్రంథ ప్రజలు వారి ధర్మం క్రైస్తవ ధర్మం గానీ, యూద ధర్మం గానీ, వారు దాని నుండి చాలా దూరంలో ఉంన్నారు. కావున మీరు ఏ స్త్రీతోనైనా వివాహమాడదలచుకున్నపుడు ఆమె సుశీలవతి అయి ఉండి, విచ్ఛలవిడిగా తిరిగే స్త్రీ కాకుండా ఉండటం ఎంతో ముఖ్యం. ఇంకా మీరు మీ స్త్రీలకు గ్రంథ ప్రజలతో పెండ్లి చేయించకండి. ఎందుకంటే మీరు ముస్లింలు దైవప్రవక్తలను అందరినీ నమ్ముతారు. ఆదరిస్తారరు. కాని వారు, ఉదాహరణకు యూదులు, 'ఈసా ('అ.స.)ను మరియు ము'హమ్మద్ ('స'అస)ను దైవప్రవక్తని నమ్మరు. కాబట్టి ఒక ముస్లిం స్త్రీ యూదుణ్ణి లేక క్రైస్తవుణ్ణి పెండ్లి చేసుకుంటే, ఆమె వారింట్లో ము'హమ్మద్ ('స'అస) పట్ల దూషణలు ఎలా వినగలదు?