[1] చూడండిమా బైన అయ్ దీకుమ్ వ మా 'ఖల్ ఫకుమ్: పైన ఇచ్చిన తాత్పర్యం నోబుల్ ఖుర్ఆన్ ను అనుసరించి ఉంది. ము'హమ్మద్ జూనాగఢి గారి తాత్పర్యం ఇలా ఉంది: 'మీ వెనుకా ముందు సంభవించే పాపాల నుండి కాపాడుకోండి.'
[1] అంటే అతస్మాత్తుగా ఊదబడే పునరుత్థానదినపు బాకా (కొమ్ము) ధ్వని, అరుపు, గర్జన లేక శబ్దం. దీనిని మొదటి బాకా లేక నఫ్'ఖతుల్ ఫజ'అ అంటారు. దీని తరువాత రెండవ బాకా ఊదబడుతుంది. దానిని నఫ్'ఖతు 'స్స'అఖ్, అంటారు. అప్పుడు అల్లాహ్ (సు.తా.) తప్ప సర్వజీవరాసులు మరణిస్తారు. ఇంకా చూడండి, 36:29, 53; 38:15.
[1] కొందరు వ్యాఖ్యాతలు దీనిని రెండవ బాకా అని, మరికొందరు దీనిని మూడవ బాకా అంటే నఫ్'ఖతుల్-బ'అసి 'వన్నుషూర్ అని అంటారు. ఇది ఊదబడగానే గోరీలలోని వారంతా లేచి వస్తారు. (ఇబ్నె-కసీ'ర్).