Kur'an-ı Kerim meal tercümesi - Telugu Dilinde Tercüme - Abdurrahim B. Muhammed

external-link copy
170 : 3

فَرِحِیْنَ بِمَاۤ اٰتٰىهُمُ اللّٰهُ مِنْ فَضْلِهٖ ۙ— وَیَسْتَبْشِرُوْنَ بِالَّذِیْنَ لَمْ یَلْحَقُوْا بِهِمْ مِّنْ خَلْفِهِمْ ۙ— اَلَّا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟ۘ

అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రసాదించిన దానితో (ప్రాణత్యాగంతో) వారు సంతోషంతో ఉప్పొంగిపోతారు[1]. మరియు వారిని కలువక, వెనుక (బ్రతికి) ఉన్నవారి కొరకు (ఇవ్వబడిన శుభవార్తతో) వారు సంతోషపడుతూ ఉంటారు. ఎందుకంటే వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా! info

[1] మరణిచిన ఏ ప్రాణి కూడా అల్లాహ్ (సు.తా.) దగ్గర మంచి చోటు దొరికిన తరువాత భూలోకానికి తిరిగి రావటానికి ఇష్టపడడు. కానీ షహీద్ (అల్లాహుతా'ఆలా మార్గంలో చంపబడినవాడు) భూలోకానికి తిరిగి రావటానికి ఇష్టపడతాడు. ఎందుకంటే అతడు షహాదత్ యొక్క గొప్ప ప్రతిఫలాన్ని చూసి ఉంటాడు. (ముస్నద్ అ'హ్మద్ - 3/126, 'స. ముస్లిం). కాని అది అసంభవం.

التفاسير: