Kur'an-ı Kerim meal tercümesi - Telugu Dilinde Tercüme - Abdurrahim B. Muhammed

Sayfa numarası:close

external-link copy
25 : 21

وَمَاۤ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رَّسُوْلٍ اِلَّا نُوْحِیْۤ اِلَیْهِ اَنَّهٗ لَاۤ اِلٰهَ اِلَّاۤ اَنَا فَاعْبُدُوْنِ ۟

మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా: "నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! కావున మీరు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించండి." అని దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చిపంపాము. info
التفاسير:

external-link copy
26 : 21

وَقَالُوا اتَّخَذَ الرَّحْمٰنُ وَلَدًا سُبْحٰنَهٗ ؕ— بَلْ عِبَادٌ مُّكْرَمُوْنَ ۟ۙ

వారంటున్నారు: "అనంత కరుణామయునికి సంతానముంది!" అని. ఆయన సర్వలోపాలకు అతీతుడు, (అల్లాహ్ సంతానంగా పరిగణించబడే) వారు కేవలం గౌరవనీయులైన (ఆయన) దాసులు మాత్రమే!"[1] info

[1] చూడండి, 19:92.

التفاسير:

external-link copy
27 : 21

لَا یَسْبِقُوْنَهٗ بِالْقَوْلِ وَهُمْ بِاَمْرِهٖ یَعْمَلُوْنَ ۟

వారు ఆయన (అనుమతించక) ముందు మాట్లాడలేరు. మరియు వారు (దైవదూతలు) ఆయన ఆజ్ఞలనే పాటిస్తూ ఉంటారు.[1] info

[1] ఈ ఆయత్ ముష్రికీన్ లు దేవదూతలను ('అ.స.) అల్లాహ్ (సు.తా.) బిడ్డలుగా పరిగణించే విషయాన్ని ఖండిస్తుంది. దేవదూతలు ('అ.స.) అల్లాహ్ (సు.తా.) సృష్టించిన దాసులు మరియు ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటారు.

التفاسير:

external-link copy
28 : 21

یَعْلَمُ مَا بَیْنَ اَیْدِیْهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا یَشْفَعُوْنَ ۙ— اِلَّا لِمَنِ ارْتَضٰی وَهُمْ مِّنْ خَشْیَتِهٖ مُشْفِقُوْنَ ۟

ఆయనకు, వారికి ప్రత్యక్షంగా (ముందు) ఉన్నదీ, అంతా తెలుసు. వారు, ఆయన సమ్మతించిన వారికి తప్ప ఇతరుల కొరకు సిఫారసు చేయలేరు.[1] వారు, ఆయన భీతి వలన భయకంపితులై ఉంటారు. info

[1] చూడండి, 2:255 దీనితో వ్యక్తమయ్యేది ఏమిటంటే ప్రవక్తలు మరియు 'సాలెహీన్ లే గాక దైవదూతలు కూడా, అల్లాహ్ (సు.తా.) అనుమతించిన వారికి మాత్రమే సిఫారసు చేయగలరు. ఇంకా చూడండి, 10:3, 19:87, 20:109, 53:26.

التفاسير:

external-link copy
29 : 21

وَمَنْ یَّقُلْ مِنْهُمْ اِنِّیْۤ اِلٰهٌ مِّنْ دُوْنِهٖ فَذٰلِكَ نَجْزِیْهِ جَهَنَّمَ ؕ— كَذٰلِكَ نَجْزِی الظّٰلِمِیْنَ ۟۠

వారిలో (దేవదూతలలో) ఎవరైనా: "నిశ్చయంగా, ఆయనే కాక, నేను కూడా ఒక ఆరాధ్య దైవాన్ని" అని అంటే, అలాంటి వానికి మేము నరకశిక్ష విధిస్తాము.[1] మేము దుర్మార్గులను ఇదే విధంగా శిక్షిస్తాము. info

[1] ఇది ఒక ఉదారహణమే. ఇలా సంభవించనవసరం లేదు. అంటే దేవదూతలు ఎన్నడూ అలా చేయరు. ఒకవేళ వారు అలా చేస్తే, వారు ('అలైహిమ్. స.) కూడా శిక్షించబడతారు. ఈ విధమైన ఉదాహరణలకు చూడండి, 43:81 మరియు 39:65.15.

التفاسير:

external-link copy
30 : 21

اَوَلَمْ یَرَ الَّذِیْنَ كَفَرُوْۤا اَنَّ السَّمٰوٰتِ وَالْاَرْضَ كَانَتَا رَتْقًا فَفَتَقْنٰهُمَا ؕ— وَجَعَلْنَا مِنَ الْمَآءِ كُلَّ شَیْءٍ حَیٍّ ؕ— اَفَلَا یُؤْمِنُوْنَ ۟

ఏమి? ఈ సత్యతిరస్కారులకు తెలియదా (చూడలేదా)? వాస్తవానికి భూమ్యాకాశాలు (ఒకే ఒక్క భౌతికాంశంగా) కలుసుకొని ఉండేవని, అయితే మేమే వాటిని పగుల గొట్టి వేరు చేశామని?[1] మరియు మేమే ప్రతి ప్రాణిని నీటి నుండి పుట్టించాము.[2] ఇకనైన వారు విశ్వసించరా? info

[1] ఇదే సైంటిస్టులు పలికే Big Bang Theory. ఈ ఆయత్ అవతరింపజేయబడినప్పుడు అరేబియా వాసులకు ఏ విధమైన సైన్సు జ్ఞానం లేదు. ఈ Big Band Theory ఇప్పుడిప్పుడే ఆవిష్కరించబడింది. ఈ ఖుర్ఆన్ ను దైవప్రవక్త ('స'అస) వ్రాయలేదు, ఎందుకంటే అతను నిరక్షరాస్యుడని మక్కా ప్రజలందరికీ తెలుసు. ఆ కాలపు విద్వాంసులకు కూడా ఇలాంటి సైన్సు విషయాల జ్ఞానం ఉండేది కాదు. దీనితో ఈ ఖుర్ఆన్ దివ్యాష్కృతి అని నిరూపించబడుతోంది. దాదాపు వేయి కంటే ఎక్కువ ఆయతులలో ఈ విధమైన సైన్సు విషయాలు పేర్కొనబడ్డాయి. వాటిలో కొన్ని ఇప్పుడిప్పుడే పరిశోధించబడి నిరూపించబడ్డాయి. వాటిలో ఒక ఒక్క ఆవిష్కారం కూడా ఖుర్ఆన్ లో పేర్కొనబడ్డ విషయం తప్పని నిరూపించలేదు. ఇంకా ఎన్నో నిరూపించబడనున్నాయి. ఈ కాలపు Modern Astrophysicists లందరి అభిప్రాయం ఏమిటంటే: ఈ విశ్వమంతా ఒకే ఒక మూల ద్రవ్యం హైడ్రోజన్ పరమాణువు నుండి సృష్టించబడింది. తరువాత ఆ హైడ్రోజన్ పరమాణువులు గరుత్వాకర్షణ శక్తి వల్ల కలుపబడి అనేక పదార్థాల సముదాయం ఏర్పడి, తరువాత అది పగల గొట్టబడటం వల్ల Galaxies, Nedulae and Solar Systems, అంటే నక్షత్ర సముదాయం ఏర్పడింది. ఇదంతా జరగటానికి ఎంతో శక్తి (Energy) కావాలి. కాబట్టి, ఇదంతా చేసే శక్తి గలవాడు, సర్వసృష్టికి ఆధార భూతుడైన అల్లాహ్ (సు.తా.) మాత్రమే. ఇంకా చూడండి 51:47. [2] ఈ విషయం కూడా ఇప్పటి సైంటిస్టులందరూ అంగీకరిస్తారు. అంటే ప్రతి జీవి నీటి నుండి పుట్టించబడిందని. జీవకణం (Cell) లోని అత్యధిక భాగం Protoplasm అందులో కూడా అత్యధిక భాగం (దాదాపు 72%) నీరే.

التفاسير:

external-link copy
31 : 21

وَجَعَلْنَا فِی الْاَرْضِ رَوَاسِیَ اَنْ تَمِیْدَ بِهِمْ وَجَعَلْنَا فِیْهَا فِجَاجًا سُبُلًا لَّعَلَّهُمْ یَهْتَدُوْنَ ۟

మరియు భూమి వారితో పాటు కదలకుండా ఉండాలని మేము దానిలో స్థిరమైన పర్వతాలను (మేకుల వలే) నాటాము.[1] మరియు వారు (ప్రజలు) మార్గదర్శకత్వం పొందాలని మేము దానిలో విశాలమైన మార్గాలను కూడా ఏర్పాటు చేశాము. info

[1] చూడండి, 16:15.

التفاسير:

external-link copy
32 : 21

وَجَعَلْنَا السَّمَآءَ سَقْفًا مَّحْفُوْظًا ۖۚ— وَّهُمْ عَنْ اٰیٰتِهَا مُعْرِضُوْنَ ۟

మరియు మేము ఆకాశాన్ని సురక్షితమైన కప్పుగా చేశాము.[1] అయినా వారు అందులోని సూచనల (ఆయాత్ ల) నుండి విముఖులవుతున్నారు. info

[1] చూడండి, 13:2.

التفاسير:

external-link copy
33 : 21

وَهُوَ الَّذِیْ خَلَقَ الَّیْلَ وَالنَّهَارَ وَالشَّمْسَ وَالْقَمَرَ ؕ— كُلٌّ فِیْ فَلَكٍ یَّسْبَحُوْنَ ۟

మరియు రేయింబవళ్ళను మరియు సూర్యచంద్రులను సృష్టించినవాడు ఆయనే. అవి తమ తమ కక్ష్యలలో తేలియాడుతూ (తిరుగుతూ) ఉన్నాయి. info
التفاسير:

external-link copy
34 : 21

وَمَا جَعَلْنَا لِبَشَرٍ مِّنْ قَبْلِكَ الْخُلْدَ ؕ— اَفَاۡىِٕنْ مِّتَّ فَهُمُ الْخٰلِدُوْنَ ۟

మరియు (ఓ ప్రవక్తా!) నీకు పూర్వం మేము ఏ మానవునికి కూడా శాశ్వత జీవితాన్ని ప్రసాదించలేదు.[1] ఏమీ? ఒకవేళ నీవు మరణిస్తే! వారు మాత్రం శాశ్వతంగా సజీవులుగా (చిరంజీవులుగా) ఉంటారా? [2] info

[1] చూడండి, 3:144. [2] చూడండి, 39:30.

التفاسير:

external-link copy
35 : 21

كُلُّ نَفْسٍ ذَآىِٕقَةُ الْمَوْتِ ؕ— وَنَبْلُوْكُمْ بِالشَّرِّ وَالْخَیْرِ فِتْنَةً ؕ— وَاِلَیْنَا تُرْجَعُوْنَ ۟

ప్రతి ప్రాణి మృత్యువును చవి చూస్తుంది. మరియు మేము మీ అందరినీ, మంచి మరియు చెడు స్థితులకు గురి చేసి, పరీక్షిస్తాము.[1] మరియు మీరందరూ మా వైపునకే మరలింపబడతారు. info

[1]మీలో ఎవరు కృతజ్ఞులో మరియు ఎవరు సహనం వహించని కృతఘ్నులో చూడటానికి. మంచి స్థితిలో అల్లాహ్ (సు.తా.) కు కృతజ్ఞులవటం మరియు దురావస్థలో సహనం వహించటమే విశ్వాసుల లక్షణాలు.

التفاسير: