పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం

పేజీ నెంబరు:close

external-link copy
62 : 3

اِنَّ هٰذَا لَهُوَ الْقَصَصُ الْحَقُّ ۚ— وَمَا مِنْ اِلٰهٍ اِلَّا اللّٰهُ ؕ— وَاِنَّ اللّٰهَ لَهُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟

నిశ్చయంగా, ఇదే (ఈసాను గురించిన) సత్యగాథ. మరియు అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు. info
التفاسير:

external-link copy
63 : 3

فَاِنْ تَوَلَّوْا فَاِنَّ اللّٰهَ عَلِیْمٌۢ بِالْمُفْسِدِیْنَ ۟۠

ఒకవేళ వారు వెనుదిరిగితే! నిశ్చయంగా, అల్లాహ్ కు కల్లలోలం రేకెత్తించే వారిని గురించి బాగా తెలుసు. info
التفاسير:

external-link copy
64 : 3

قُلْ یٰۤاَهْلَ الْكِتٰبِ تَعَالَوْا اِلٰی كَلِمَةٍ سَوَآءٍ بَیْنَنَا وَبَیْنَكُمْ اَلَّا نَعْبُدَ اِلَّا اللّٰهَ وَلَا نُشْرِكَ بِهٖ شَیْـًٔا وَّلَا یَتَّخِذَ بَعْضُنَا بَعْضًا اَرْبَابًا مِّنْ دُوْنِ اللّٰهِ ؕ— فَاِنْ تَوَلَّوْا فَقُوْلُوا اشْهَدُوْا بِاَنَّا مُسْلِمُوْنَ ۟

ఇలా అను: " ఓ గ్రంథ ప్రజలారా! మాకూ మరియు మీకూ మధ్య ఉమ్మడిగా ఉన్న ధర్మ విషయం (ఉత్తరువు) వైపునకు రండి, అది ఏమిటంటే: 'మనం అల్లాహ్ తప్ప మరెవ్వరినీ ఆరాధించరాదు, ఆయనకు భాగస్వాములను ఎవ్వరినీ నిలబెట్టరాదు మరియు అల్లాహ్ తప్ప, మనవారిలో నుండి ఎవ్వరినీ ప్రభువులుగా చేసుకోరాదు."[1] వారు (సమ్మతించక) తిరిగి పోతే: "మేము నిశ్చయంగా అల్లాహ్ కు విధేయులము (ముస్లింలము), దీనికి మీరు సాక్షులుగా ఉండండి." అని పలుకు.[2] info

[1] యూదులు 'ఉజైర్ ('అ.స.)ను అల్లాహ్ (సు.తా.) కుమారుడని మరియు క్రైస్తవులు 'ఈసా ('అ.స.)ను అల్లాహుతా'ఆలా కుమారుడని అంటారు. ఇలాంటి వాదాలతో ప్రవక్తలను అల్లాహ్ (సు.తా.)కు భాగస్వాములుగా చేస్తున్నారు. చూడండి, 9:30-31. [2] చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 6, 'హదీస్' నం. 75.

التفاسير:

external-link copy
65 : 3

یٰۤاَهْلَ الْكِتٰبِ لِمَ تُحَآجُّوْنَ فِیْۤ اِبْرٰهِیْمَ وَمَاۤ اُنْزِلَتِ التَّوْرٰىةُ وَالْاِنْجِیْلُ اِلَّا مِنْ بَعْدِهٖ ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟

ఓ గ్రంథ ప్రజలారా! ఇబ్రాహీమ్ (ధర్మాన్ని) గురించి మీరు ఎందుకు వాదులాడుతున్నారు? తౌరాతు మరియు ఇంజీల్ లు అతని తరువాతనే అవతరించాయి కదా! ఇది మీరు అర్థం చేసుకోలేరా? info
التفاسير:

external-link copy
66 : 3

هٰۤاَنْتُمْ هٰۤؤُلَآءِ حَاجَجْتُمْ فِیْمَا لَكُمْ بِهٖ عِلْمٌ فَلِمَ تُحَآجُّوْنَ فِیْمَا لَیْسَ لَكُمْ بِهٖ عِلْمٌ ؕ— وَاللّٰهُ یَعْلَمُ وَاَنْتُمْ لَا تَعْلَمُوْنَ ۟

అవును, మీరే వారు! తెలిసివున్న విషయాలను గురించి వాదులాడినవారు. అయితే మీకేమీ తెలియని విషయాలను గురించి ఎందుకు వాదులాడుతున్నారు? మరియు అల్లాహ్ కు అంతా తెలుసు, కానీ మీకు ఏమీ తెలియదు. info
التفاسير:

external-link copy
67 : 3

مَا كَانَ اِبْرٰهِیْمُ یَهُوْدِیًّا وَّلَا نَصْرَانِیًّا وَّلٰكِنْ كَانَ حَنِیْفًا مُّسْلِمًا ؕ— وَمَا كَانَ مِنَ الْمُشْرِكِیْنَ ۟

ఇబ్రాహీమ్ యూదుడూ కాడు మరియు క్రైస్తవుడూ కాడు! కాని అతను ఏకదైవ సిద్ధాంతంపై ఉన్నవాడు (హనీఫ్), అల్లాహ్ కు విధేయుడు (ముస్లిం) మరియు అతడు ఏ మాత్రం (అల్లాహ్ కు) సాటి కల్పించేవాడు (ముష్రిక్) కాడు.[1] info

[1] చూడండి, 2:135.

التفاسير:

external-link copy
68 : 3

اِنَّ اَوْلَی النَّاسِ بِاِبْرٰهِیْمَ لَلَّذِیْنَ اتَّبَعُوْهُ وَهٰذَا النَّبِیُّ وَالَّذِیْنَ اٰمَنُوْا ؕ— وَاللّٰهُ وَلِیُّ الْمُؤْمِنِیْنَ ۟

నిశ్చయంగా, ఇబ్రాహీమ్ తో దగ్గరి సంబంధం గల వారంటే, అతనిని అనుసరించే వారు మరియు ఈ ప్రవక్త (ముహమ్మద్) మరియు (ఇతనిని) విశ్వసించిన వారు. మరియు అల్లాహ్ యే విశ్వాసుల సంరక్షకుడు.[1] info

[1] చూడండి, 16:123.

التفاسير:

external-link copy
69 : 3

وَدَّتْ طَّآىِٕفَةٌ مِّنْ اَهْلِ الْكِتٰبِ لَوْ یُضِلُّوْنَكُمْ ؕ— وَمَا یُضِلُّوْنَ اِلَّاۤ اَنْفُسَهُمْ وَمَا یَشْعُرُوْنَ ۟

గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారు, మిమ్మల్ని మార్గభ్రష్టులు చేయాలని కోరుతున్నారు. కాని వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మార్గభ్రష్టులు చేయటం లేదు, కాని వారది గ్రహించటం లేదు. info
التفاسير:

external-link copy
70 : 3

یٰۤاَهْلَ الْكِتٰبِ لِمَ تَكْفُرُوْنَ بِاٰیٰتِ اللّٰهِ وَاَنْتُمْ تَشْهَدُوْنَ ۟

"ఓ గ్రంథ ప్రజలారా! మీరు అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) ఎందుకు తిరస్కరిస్తున్నారు? మరియు వాటికి మీరే సాక్షులుగా ఉన్నారు కదా!" info
التفاسير: