పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం

పేజీ నెంబరు:close

external-link copy
154 : 3

ثُمَّ اَنْزَلَ عَلَیْكُمْ مِّنْ بَعْدِ الْغَمِّ اَمَنَةً نُّعَاسًا یَّغْشٰی طَآىِٕفَةً مِّنْكُمْ ۙ— وَطَآىِٕفَةٌ قَدْ اَهَمَّتْهُمْ اَنْفُسُهُمْ یَظُنُّوْنَ بِاللّٰهِ غَیْرَ الْحَقِّ ظَنَّ الْجَاهِلِیَّةِ ؕ— یَقُوْلُوْنَ هَلْ لَّنَا مِنَ الْاَمْرِ مِنْ شَیْءٍ ؕ— قُلْ اِنَّ الْاَمْرَ كُلَّهٗ لِلّٰهِ ؕ— یُخْفُوْنَ فِیْۤ اَنْفُسِهِمْ مَّا لَا یُبْدُوْنَ لَكَ ؕ— یَقُوْلُوْنَ لَوْ كَانَ لَنَا مِنَ الْاَمْرِ شَیْءٌ مَّا قُتِلْنَا هٰهُنَا ؕ— قُلْ لَّوْ كُنْتُمْ فِیْ بُیُوْتِكُمْ لَبَرَزَ الَّذِیْنَ كُتِبَ عَلَیْهِمُ الْقَتْلُ اِلٰی مَضَاجِعِهِمْ ۚ— وَلِیَبْتَلِیَ اللّٰهُ مَا فِیْ صُدُوْرِكُمْ وَلِیُمَحِّصَ مَا فِیْ قُلُوْبِكُمْ ؕ— وَاللّٰهُ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ ۟

అప్పుడు ఈ దుఃఖం తరువాత ఆయన (అల్లాహ్) మీపై శాంతి భద్రతలను అవతరింపజేశాడు; దాని వల్ల మీలో కొందరికి కునుకుపాటు ఆవరించింది. కాని మరికొందరు - కేవలం స్వంత ప్రాణాలకు ప్రాముఖ్యత నిచ్చేవారు, అల్లాహ్ ను గురించి పామరుల వంటి తప్పుడు ఊహలు చేసేవారు - ఇలా అన్నారు: "ఏమీ? ఈ వ్యవహారంలో మాకు ఏమైనా భాగముందా?" వారితో ఇలా అను: "నిశ్చయంగా, సమస్త వ్యవహారాలపై సర్వాధికారం అల్లాహ్ దే!" వారు తమ హృదయాలలో దాచుకున్న దానిని నీకు వ్యక్తం చేయటం లేదు. వారు ఇంకా ఇలా అంటారు: "మాకు అధికారమే ఉండి వుంటే, మేము ఇక్కడు చంపబడి ఉండేవారము కాదు." వారికి ఇలా జవాబివ్వు: "ఒకవేళ మీరు మీ ఇళ్ళలోనే ఉండి వున్నప్పటికీ, మరణం వ్రాయబడి ఉన్నవారు స్వయంగా తమ వధ్య స్థానాలకు తరలి వచ్చేవారు." మరియు అల్లాహ్ మీ గుండెలలో దాగి వున్న దానిని పరీక్షించటానికి మరియు మీ హృదయాలను పరిశుద్ధ పరచటానికి ఇలా చేశాడు. మరియు హృదయాలలో (దాగి) ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు. info
التفاسير:

external-link copy
155 : 3

اِنَّ الَّذِیْنَ تَوَلَّوْا مِنْكُمْ یَوْمَ الْتَقَی الْجَمْعٰنِ ۙ— اِنَّمَا اسْتَزَلَّهُمُ الشَّیْطٰنُ بِبَعْضِ مَا كَسَبُوْا ۚ— وَلَقَدْ عَفَا اللّٰهُ عَنْهُمْ ؕ— اِنَّ اللّٰهَ غَفُوْرٌ حَلِیْمٌ ۟۠

రెండు సైన్యాలు (ఉహుద్ యుద్ధానికి) తలబడిన దినమున, వాస్తవానికి మీలో వెన్ను చూపిన వారిని - వారు చేసుకున్న వాటికి (కర్మలకు) ఫలితంగా - షైతాను వారి పాదాలను జార్చాడు. అయినా, వాస్తవానికి అల్లాహ్ వారిని క్షమించాడు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, సహనశీలుడు. info
التفاسير:

external-link copy
156 : 3

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَكُوْنُوْا كَالَّذِیْنَ كَفَرُوْا وَقَالُوْا لِاِخْوَانِهِمْ اِذَا ضَرَبُوْا فِی الْاَرْضِ اَوْ كَانُوْا غُزًّی لَّوْ كَانُوْا عِنْدَنَا مَا مَاتُوْا وَمَا قُتِلُوْا ۚ— لِیَجْعَلَ اللّٰهُ ذٰلِكَ حَسْرَةً فِیْ قُلُوْبِهِمْ ؕ— وَاللّٰهُ یُحْیٖ وَیُمِیْتُ ؕ— وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرٌ ۟

ఓ విశ్వాసులారా! మీరు సత్యతిరస్కారుల మాదిరిగా ప్రవర్తించకండి; వారు తమ సోదరులు ఎప్పుడైనా ప్రయాణంలో ఉంటే, లేదా యుద్ధంలో ఉంటే, (అక్కడ వారు ఏదైనా ప్రమాదానికి గురి అయితే) వారిని గురించి ఇలా అనేవారు: "ఒకవేళ వారు మాతోపాటు ఉండివుంటే చనిపోయే వారు కాదు మరియు చంపబడేవారునూ కాదు!" వాటిని (ఈ విధమైన మాటలను) అల్లాహ్ వారి హృదయ ఆవేదనకు కారణాలుగా చేస్తాడు. మరియు అల్లాహ్ యే జీవనమిచ్చే వాడు. మరియు మరణమిచ్చే వాడు మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్ చూస్తున్నాడు.[1] info

[1] చూడండి, 4:78.

التفاسير:

external-link copy
157 : 3

وَلَىِٕنْ قُتِلْتُمْ فِیْ سَبِیْلِ اللّٰهِ اَوْ مُتُّمْ لَمَغْفِرَةٌ مِّنَ اللّٰهِ وَرَحْمَةٌ خَیْرٌ مِّمَّا یَجْمَعُوْنَ ۟

మరియు మీరు అల్లాహ్ మార్గంలో చంపబడినా లేదా మరణించినా మీకు లభించే అల్లాహ్ క్షమాభిక్ష మరియు కారుణ్యం, నిశ్చయంగా మీరు కూడబెట్టే వాటి అన్నిటి కంటే ఎంతో ఉత్తమమైనవి. info
التفاسير: