ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - තෙළිඟු පරිවර්තනය - අබ්දුල් රහීම් බින් මුහම්මද්

පිටු අංක:close

external-link copy
30 : 47

وَلَوْ نَشَآءُ لَاَرَیْنٰكَهُمْ فَلَعَرَفْتَهُمْ بِسِیْمٰهُمْ ؕ— وَلَتَعْرِفَنَّهُمْ فِیْ لَحْنِ الْقَوْلِ ؕ— وَاللّٰهُ یَعْلَمُ اَعْمَالَكُمْ ۟

మరియు మేము తలచుకుంటే, వారిని నీకు చూపేవారం; వారి లక్షణాలను బట్టి నీవు వారిని తెలుసుకోగలవు. మరియు వారు మాట్లాడే రీతిని బట్టి, వారిని నీవు తప్పక తెలుసుకోగలవు. మరియు అల్లాహ్ కు మీ కర్మలు బాగా తెలుసు. info
التفاسير:

external-link copy
31 : 47

وَلَنَبْلُوَنَّكُمْ حَتّٰی نَعْلَمَ الْمُجٰهِدِیْنَ مِنْكُمْ وَالصّٰبِرِیْنَ ۙ— وَنَبْلُوَاۡ اَخْبَارَكُمْ ۟

మరియు నిశ్చయంగా, మీలో ధర్మయుద్ధం చేసేవారెవరో మరియు సహనం వహించేవారెవరో! చూచే వరకు మేము మిమ్మల్ని తప్పక పరీక్షిస్తాము.[1] మరియు మేము మీ ప్రతిజ్ఞావచనాలను కూడా పరీక్షిస్తాము. info

[1] చూడండి, 3:140.

التفاسير:

external-link copy
32 : 47

اِنَّ الَّذِیْنَ كَفَرُوْا وَصَدُّوْا عَنْ سَبِیْلِ اللّٰهِ وَشَآقُّوا الرَّسُوْلَ مِنْ بَعْدِ مَا تَبَیَّنَ لَهُمُ الْهُدٰی ۙ— لَنْ یَّضُرُّوا اللّٰهَ شَیْـًٔا ؕ— وَسَیُحْبِطُ اَعْمَالَهُمْ ۟

నిశ్చయంగా, మార్గదర్శకత్వం స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా, సత్యాన్ని తిరస్కరించి, ప్రజలను అల్లాహ్ మార్గం నుండి నిరోధిస్తూ, ప్రవక్తతో విరోధం కలిగి వున్నవారు,[1] అల్లాహ్ కు ఏ మాత్రం నష్టం కలిగించలేరు. కాని ఆయన వారి కర్మలను నిష్ఫలం చేయగలడు. info

[1] చూడండి, 8:13 మరియు 2:190.

التفاسير:

external-link copy
33 : 47

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اَطِیْعُوا اللّٰهَ وَاَطِیْعُوا الرَّسُوْلَ وَلَا تُبْطِلُوْۤا اَعْمَالَكُمْ ۟

ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు అల్లాహ్ కు విధేయులై ఉండండి మరియు ప్రవక్తను అనుసరించండి మరియు మీ కర్మలను వ్యర్థం చేసుకోకండి.[1] info

[1] చూడండి, 53:32 ఎన్ని మంచి పనులు చేసినా అవి అల్లాహ్ (సు.తా.) మరియు ఆయన ప్రవక్త ('స'అస) విధేయతల పరిధి నుండి బయట ఉంటే అవి వ్యర్థమే అవుతాయి..

التفاسير:

external-link copy
34 : 47

اِنَّ الَّذِیْنَ كَفَرُوْا وَصَدُّوْا عَنْ سَبِیْلِ اللّٰهِ ثُمَّ مَاتُوْا وَهُمْ كُفَّارٌ فَلَنْ یَّغْفِرَ اللّٰهُ لَهُمْ ۟

నిశ్చయంగా, సత్యాన్ని తిరస్కరిస్తూ ప్రజలను అల్లాహ్ మార్గం నుండి నిరోధిస్తూ వుండి, సత్యతిరస్కారులుగానే మరణించిన వారిని అల్లాహ్ ఎంత మాత్రం క్షమించడు. info
التفاسير:

external-link copy
35 : 47

فَلَا تَهِنُوْا وَتَدْعُوْۤا اِلَی السَّلْمِ ۖۗ— وَاَنْتُمُ الْاَعْلَوْنَ ۖۗ— وَاللّٰهُ مَعَكُمْ وَلَنْ یَّتِرَكُمْ اَعْمَالَكُمْ ۟

కావున మీరు (ధర్మయుద్ధంలో) ధైర్యాన్ని వీడకండి మరియు సంధి కొరకు అడగకండి మరియు మీరే ప్రాబల్యం వహిస్తారు.[1] మరియు అల్లాహ్ మీకు తోడుగా ఉన్నాడు మరియు ఆయన మీ కర్మలను వృథా కానివ్వడు. info

[1] చూడండి, 3:139 కానీ మీరు మీ శత్రువుల కంటే బలహీనులుగా ఉన్నారనుకుంటే సంధి చేసుకోవచ్చు. దైవప్రవక్త ('స'అస) మక్కా ముష్రికులతో హుదైబియాలో పది సంవత్సరాల సంధి చేసుకున్నారు.

التفاسير:

external-link copy
36 : 47

اِنَّمَا الْحَیٰوةُ الدُّنْیَا لَعِبٌ وَّلَهْوٌ ؕ— وَاِنْ تُؤْمِنُوْا وَتَتَّقُوْا یُؤْتِكُمْ اُجُوْرَكُمْ وَلَا یَسْـَٔلْكُمْ اَمْوَالَكُمْ ۟

నిశ్చయంగా, ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట మరియు కాలక్షేపం మాత్రమే. ఒకవేళ మీరు విశ్వసించి దైవభీతి కలిగి ఉన్నట్లయితే, ఆయన మీకు మీ ప్రతిఫలం ఇస్తాడు. మరియు మీ నుండి ధనాన్ని కూడా అడగడు.[1] info

[1] అల్లాహ్ (సు.తా.) కు మీ ధనం అవసరం లేదు. మదీనా కాలపు మొదటి రోజులలోనే 'జకాత్ విధించబడింది. అది ఇస్లాం ధర్మాన్ని కాపాడుకోవటానికి దాని ప్రచారానికి మరియు ముస్లింల కుశలత కొరకు వారి సౌకర్యాల కొరకు. 'జకాత్ ఒక సంవత్సరం వరకు జమ ఉన్న ధనసంపత్తుల మీద, 2.5% మాత్రమే. సంవత్సరం గడిచిన పిదపనే 'జకాత్ ఇవ్వవలసి ఉంటుంది.

التفاسير:

external-link copy
37 : 47

اِنْ یَّسْـَٔلْكُمُوْهَا فَیُحْفِكُمْ تَبْخَلُوْا وَیُخْرِجْ اَضْغَانَكُمْ ۟

ఒకవేళ ఆయన దానిని (ధనాన్నే) అడిగితే మరియు దాని కొరకు గట్టి పట్టుపట్టితే, మీరు పిసినారితనం చూపితే, ఆయన మీ ద్వేషాన్ని బయట పెట్టేవాడు. info
التفاسير:

external-link copy
38 : 47

هٰۤاَنْتُمْ هٰۤؤُلَآءِ تُدْعَوْنَ لِتُنْفِقُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ ۚ— فَمِنْكُمْ مَّنْ یَّبْخَلُ ۚ— وَمَنْ یَّبْخَلْ فَاِنَّمَا یَبْخَلُ عَنْ نَّفْسِهٖ ؕ— وَاللّٰهُ الْغَنِیُّ وَاَنْتُمُ الْفُقَرَآءُ ۚ— وَاِنْ تَتَوَلَّوْا یَسْتَبْدِلْ قَوْمًا غَیْرَكُمْ ۙ— ثُمَّ لَا یَكُوْنُوْۤا اَمْثَالَكُمْ ۟۠

ఇదిగో చూడండి! వారు మీరే! అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయండని పిలువబడుతున్నవారు. కాని మీలో కొందరు పిసినారితనం వహిస్తున్నారు. మరియు ఎవడు పిసినారితనం వహిస్తున్నాడో, అతడు నిజానికి తన సొంత విషయంలోనే పిసినారితనం వహిస్తున్నాడు. మరియు అల్లాహ్ స్వయం సమృద్ధుడు మరియు మీరే కొరత గల (పేద) వారు.[1] మరియు మీరు విముఖులైతే ఆయన మీకు బదులుగా ఇతర జాతిని మీ స్థానంలో తేగలడు, అప్పుడు వారు మీలాంటి వారై ఉండరు. info

[1] అల్లాహ్ (సు.తా.) మిమ్మల్ని ఖర్చు చేయమని ప్రోత్సహించేది మీ ఆత్మశుద్ధి కొరకు, మీ చుట్టు ప్రక్కలలో ఉండే పేదవారి అత్యావసరాలను పూర్తి చేయటానికి మరియు మీరు మీ శత్రువులపై ఆధిక్యత పొందటానికి.

التفاسير: