[1] పై మూడు ఆయతులలో దైవదూత ('అ.స.)ల వివిధ కార్యాలు వివరించబడ్డాయి. ప్రతిదీ అల్లాహ్ (సు.తా.) యొక్క సృష్టి మరియు ఆయనకు చెందినదే. కావున ఆయన తాను కోరిన దాని ప్రమాణం చేస్తాడు. కాని మానవులకు అల్లాహ్ (సు.తా.) తప్ప ఇతరుల ప్రమాణం చేయటం నిషిద్ధం ('హరాం) ఎందుకంటే ప్రమాణం తీసుకునే దానిని సాక్షిగా తీసుకోవలసి ఉంటుంది. మానవునికి అల్లాహ్ (సు.తా.) తప్ప మరొక ఉత్తమ సాక్షి లేడు. ఎందుకంటే కేవలం అల్లాహ్ (సు.తా.) యే సర్వసాక్షి.