ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - තෙළිඟු පරිවර්තනය - අබ්දුල් රහීම් බින් මුහම්මද්

external-link copy
121 : 2

اَلَّذِیْنَ اٰتَیْنٰهُمُ الْكِتٰبَ یَتْلُوْنَهٗ حَقَّ تِلَاوَتِهٖ ؕ— اُولٰٓىِٕكَ یُؤْمِنُوْنَ بِهٖ ؕ— وَمَنْ یَّكْفُرْ بِهٖ فَاُولٰٓىِٕكَ هُمُ الْخٰسِرُوْنَ ۟۠

మేము దివ్య గ్రంథాన్ని ప్రసాదించిన వారు (యూదులు మరియు క్రైస్తవులు), దానిని (తమ గ్రంథాన్ని) కర్తవ్యంతో పఠించ వలసిన విధంగా పఠిస్తే, అలాంటి వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసిస్తారు. మరియు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరించే వారే నష్టపడువారు.[1] info

[1] ఇక్కడ పూర్వ గ్రంథప్రజలు, అంటే యూదులు మరియు క్రైస్తవులలోని కొందరు సత్పరుషుల విషయం తెలుపబడింది. ఉదాహరణకు: 'అబ్దుల్లాహ్ బిన్-సల్లామ్, సల్మాన్ ఫార్సీ (ర'ది.'అన్హుమ్)ల వంటివారు. వారు తమ గ్రంథాలలో పేర్కొనబడిన రాబోయే ప్రవక్త ము'హమ్మద్ ('స'అస) మే అన్న సత్యాన్ని గ్రహించి, విశ్వసించి సత్యధర్మమైన ఇస్లామ్ ను స్వీకరించారు. ఏ ధర్మాన్నైతే దైవప్రవక్తలు ఆదమ్, నూ'హ్, ఇబ్రాహీమ్, మూసా మరియు 'ఈసా మొదలైనవారు ('అలైహిమ్. స.) ఆచరించి, బోధించారో!

التفاسير: