Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an mu rurimi rw'igitelugu-Maulana Abder-Rahim Ibun Muhammad.

numero y'urupapuro:close

external-link copy
118 : 9

وَّعَلَی الثَّلٰثَةِ الَّذِیْنَ خُلِّفُوْا ؕ— حَتّٰۤی اِذَا ضَاقَتْ عَلَیْهِمُ الْاَرْضُ بِمَا رَحُبَتْ وَضَاقَتْ عَلَیْهِمْ اَنْفُسُهُمْ وَظَنُّوْۤا اَنْ لَّا مَلْجَاَ مِنَ اللّٰهِ اِلَّاۤ اِلَیْهِ ؕ— ثُمَّ تَابَ عَلَیْهِمْ لِیَتُوْبُوْا ؕ— اِنَّ اللّٰهَ هُوَ التَّوَّابُ الرَّحِیْمُ ۟۠

మరియు వెనుక ఉండి పోయిన ఆ ముగ్గురిని కూడా (ఆయన క్షమించాడు).[1] చివరకు విశాలంగా ఉన్న భూమి కూడా వారికి ఇరుకై పోయింది. మరియు వారి ప్రాణాలు కూడా వారికి భారమయ్యాయి. అల్లాహ్ నుండి (తమను కాపాడుకోవటానికి) ఆయన శరణం తప్ప మరొకటి లేదని వారు తెలుసుకున్నారు. అప్పుడు ఆయన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు - వారు పశ్చాత్తాప పడాలని. నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత. info

[1] తబూక్ దండయాత్రలో పాల్గొనని ఆ ముగ్గురు, క'అబ్ ఇబ్నె మాలిక్, మరారా ఇబ్నె రబీ మరియు హిలాల్ ఇబ్నె 'ఉమయ్యా (ర'ది.'అన్హుమ్) అనే అన్ సారులు. వీరు, పై ఆయత్ అవతరింప జేయబడేవరకు దైవప్రవక్త ('స'అస) మరియు అతని అనుచరులతో బహిష్కరించబడి ఉండిరి. వీరి పశ్చాత్తాపం యాభై రోజుల తరువాత అంగీకరించబడింది. వీరు విధేయులైన ముస్లింలు. ఇంతకు ముందు ప్రతి యుద్ధంలో పాల్గొన్నారు. తబూక్ దండయాత్రలో కేవలం సోమరితనం వల్లనే పాల్గొన లేక పోయారు. వారు కపటవిశ్వాసుల వలే బూటక సాకులు చెప్పలేదు. (చూడండి 'స'హీ'హ్ బు'ఖారీ, కితాబ్ అల్ మ'గాజీ, బాబ్ 'గజ్ వత్ అత్ తబూక్. ముస్లిం కితాబ్ అత్-తౌబహ్, బాబ్ 'హదీస్ తౌబతు క'అబ్ బిన్ మాలిక్).

التفاسير:

external-link copy
119 : 9

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَكُوْنُوْا مَعَ الصّٰدِقِیْنَ ۟

ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు సత్యవంతులతో ఉండండి.[1] info

[1] చూడండి, 'స. బు'ఖారీ, పు-8, 'హ. 116, 117, 118.

التفاسير:

external-link copy
120 : 9

مَا كَانَ لِاَهْلِ الْمَدِیْنَةِ وَمَنْ حَوْلَهُمْ مِّنَ الْاَعْرَابِ اَنْ یَّتَخَلَّفُوْا عَنْ رَّسُوْلِ اللّٰهِ وَلَا یَرْغَبُوْا بِاَنْفُسِهِمْ عَنْ نَّفْسِهٖ ؕ— ذٰلِكَ بِاَنَّهُمْ لَا یُصِیْبُهُمْ ظَمَاٌ وَّلَا نَصَبٌ وَّلَا مَخْمَصَةٌ فِیْ سَبِیْلِ اللّٰهِ وَلَا یَطَـُٔوْنَ مَوْطِئًا یَّغِیْظُ الْكُفَّارَ وَلَا یَنَالُوْنَ مِنْ عَدُوٍّ نَّیْلًا اِلَّا كُتِبَ لَهُمْ بِهٖ عَمَلٌ صَالِحٌ ؕ— اِنَّ اللّٰهَ لَا یُضِیْعُ اَجْرَ الْمُحْسِنِیْنَ ۟ۙ

మదీనా పురవాసులకు మరియు చుట్టుప్రక్కలలో ఉండే ఎడారి వాసులకు (బద్దూలకు) అల్లాహ్ ప్రవక్తను వదలి వెనుక ఉండి పోవటం మరియు తమ ప్రాణాలకు అతని (దైవప్రవక్త) ప్రాణాలపై ఆధిక్యత నివ్వటం తగిన పని కాదు. ఎందుకంటే అల్లాహ్ మార్గంలో వారు ఆకలి దప్పులు, (శారీరక) కష్టాలు సహిస్తే, శత్రువుల భూమిలోకి దూరి సత్యతిరస్కారుల కోపాన్ని రేకెత్తిస్తే మరియు శత్రువుల నుండి ఏదైనా సాధిస్తే,[1] దానికి బదులుగా వారికి ఒక సత్కార్యం వ్రాయబడకుండా ఉండదు. నిశ్చయంగా అల్లాహ్ సజ్జనుల ఫలితాన్ని వ్యర్థ పరచడు. info

[1] నైలన్: attainment, సిద్ధి లేక సాధించడం. ఇక్కడ ఈ వాక్యపు అర్థం, శత్రువుల నుండి ఏదైనా తీసుకోవటం, లేక వారికి హాని కలిగించటం అంటే వారిని సంహరించటం లేదా ఖైదీలుగా చేసుకోవటం లేదా ఓడించి విజయధనం పొందటం, లేక అమరగతి పొందటం.

التفاسير:

external-link copy
121 : 9

وَلَا یُنْفِقُوْنَ نَفَقَةً صَغِیْرَةً وَّلَا كَبِیْرَةً وَّلَا یَقْطَعُوْنَ وَادِیًا اِلَّا كُتِبَ لَهُمْ لِیَجْزِیَهُمُ اللّٰهُ اَحْسَنَ مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟

మరియు (అల్లాహ్ మార్గంలో) వారు ఖర్చు చేసే ధనం కొంచెమైనా లేదా అధికమైనా లేక వారు (శ్రమపడి) కొండలోయలను దాటే విషయమూ, అంతా వారి కొరకు వ్రాయబడకుండా ఉండదు - వారు చేస్తూ ఉండిన ఈ సత్కార్యాల కొరకు - అల్లాహ్ వారికి ప్రతిఫలాన్ని ప్రసాదించటానికి. info
التفاسير:

external-link copy
122 : 9

وَمَا كَانَ الْمُؤْمِنُوْنَ لِیَنْفِرُوْا كَآفَّةً ؕ— فَلَوْلَا نَفَرَ مِنْ كُلِّ فِرْقَةٍ مِّنْهُمْ طَآىِٕفَةٌ لِّیَتَفَقَّهُوْا فِی الدِّیْنِ وَلِیُنْذِرُوْا قَوْمَهُمْ اِذَا رَجَعُوْۤا اِلَیْهِمْ لَعَلَّهُمْ یَحْذَرُوْنَ ۟۠

మరియు విశ్వాసులందరూ (పోరాటానికి) బయలు దేరటం సరికాదు. కావున వారిలో ప్రతి తెగ నుండి కొందరు ధర్మజ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి పోయి, వారు వారి వద్దకు తిరిగి వచ్చినప్పుడు తమ జాతి (ప్రాంత) ప్రజలను హెచ్చరిస్తే! బహుశా వారు కూడా తమను తాము (దుర్మార్గం నుండి) కాపాడు కోగలరు.[1] info

[1] తబూక్ దండయాత్ర కొరకు, ఆర్థిక మరియు భౌతిక స్తోమత గల వారంతా బయలుదేరాలని ప్రకటన చేయబడి ఉండెను. ఎందుకంటే అప్పుడు వారికి ఒక గొప్ప సామ్రాజ్యపు సేనతో యుద్ధం చేయవలసి ఉండెను. లేనిచో వారు మదీనాపై దాడి చేయటానికి యత్నాలు చేయచుండిరి. కాని అన్ని యుద్ధాలలో, అందరూ పాల్గొనే అవసరముండదు. అలాంటప్పుడు కొందరు యుద్ధానికి పోకుండా ధర్మజ్ఞానం పెంపొందించుకోవటానికి పోయి, తిరిగి వచ్చి తమ ప్రాంతంలోని ప్రజలకు ధర్మజ్ఞానం బోధించాలి. దీని వల్ల ప్రజలలో దైవభీతి పెరుగుతుంది.

التفاسير: