[1] అరబ్బీ భాషలో ఒకే రమైన ఆడ-మగలను కలిపి జత ('జౌజ్), అంటారు. ఆ రెండింటిలోని, ప్రతి ఒక్క దానిని కూడా 'జౌజ్, అని అంటారు. అంటే జతలో నుండి ఒకటి. ఎందుకంటే, ఒకటి మరొకదాని జతకారి. ఇక్కడ ఆ జతలో ప్రతి ఒక్కటి అనే అర్థంలో ఉపయోగించబడింది. [2] ముష్రికులు కొన్ని పశువులను తమంతట తామే నిషిద్ధం ('హరాం) చేసుకొని ఉండిరి. కావున ఇక్కడ వారితో ఈ ప్రశ్న అడుగబడుతోంది. ఎందుకంటే, అల్లాహ్ (సు.తా.) వీటిలో దేనిని కూడా 'హరామ్ చేయలేదు.
[1] ఈ నాలుగు జతలు కలిసి మొత్తం ఎనిమిది పశువులు అవుతాయి.
[1] చూడండి, 2:173 మరియు 5:3
[1] గోళ్ళు ఉన్న జంతువులు అంటే, వాటి వ్రేళ్ళు విడివడిగా లేని జంతువులు ఉదా. ఒంటెలు, బాతులు, నిప్పుకోడి (ఉష్ట్రపక్షి), ఆవులు మరియు మేకలు మొదలైనవి, యూదుల కొరకు 'హరామ్ చేయబడ్డాయి. కేవలం వ్రేళ్ళు విడిగా ఉన్న పశుపక్షులు మాత్రమే వారికి 'హలాల్ చేయబడ్డాయి.