Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an mu rurimi rw'igitelugu-Maulana Abder-Rahim Ibun Muhammad.

అల్-అహ్ఖాఫ్

external-link copy
1 : 46

حٰمٓ ۟ۚ

హా - మీమ్.[1] info

[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

التفاسير:

external-link copy
2 : 46

تَنْزِیْلُ الْكِتٰبِ مِنَ اللّٰهِ الْعَزِیْزِ الْحَكِیْمِ ۟

ఈ గ్రంథం (ఖుర్ఆన్) అవతరణ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడైన అల్లాహ్ తరఫు నుండి జరిగింది. info
التفاسير:

external-link copy
3 : 46

مَا خَلَقْنَا السَّمٰوٰتِ وَالْاَرْضَ وَمَا بَیْنَهُمَاۤ اِلَّا بِالْحَقِّ وَاَجَلٍ مُّسَمًّی ؕ— وَالَّذِیْنَ كَفَرُوْا عَمَّاۤ اُنْذِرُوْا مُعْرِضُوْنَ ۟

మేము ఆకాశాలను, భూమిని మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని, సత్యంతో ఒక నిర్ణీత కాలం కొరకు మాత్రమే సృష్టించాము.[1] మరియు సత్యాన్ని తిరస్కరించిన వారు తమకు చేయబడిన హెచ్చరిక నుండి విముఖులవు తున్నారు. info

[1] చూడండి, 14:48.

التفاسير:

external-link copy
4 : 46

قُلْ اَرَءَیْتُمْ مَّا تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ اَرُوْنِیْ مَاذَا خَلَقُوْا مِنَ الْاَرْضِ اَمْ لَهُمْ شِرْكٌ فِی السَّمٰوٰتِ ؕ— اِیْتُوْنِیْ بِكِتٰبٍ مِّنْ قَبْلِ هٰذَاۤ اَوْ اَثٰرَةٍ مِّنْ عِلْمٍ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟

వారితో ఇలా అను: "అల్లాహ్ ను వదలి మీరు ప్రార్థిస్తున్న వాటిని గురించి ఆలోచించారా? అయితే నాకు చూపండి.[1] వారు భూమిలో ఏమి సృష్టించారో? లేదా, వారికి ఆకాశాలలో ఏదైనా భాగముందా? మీరు సత్యవంతులే అయితే, దీనికి (ఈ ఖుర్ఆన్ కు) ముందు వచ్చిన ఏదైనా గ్రంథాన్ని లేదా ఏదైనా మిగిలి ఉన్న జ్ఞానాన్ని తెచ్చి చూపండి."[2] info

[1] రఅ"య్ తుమ్: అంటే చెప్పండి, చూపండి, లేక ఆలోచించారా.
[2] అసా'రతిమ్ మిన్ 'ఇల్మిన్: అంటే తెలివితేటలు, బఖియ్యతిమ్-మిన్-'ఇల్మిన్: అంటే పూర్వప్రవక్తల మీద అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం వహీ నుండి మిగిలి ఉన్న నిజ దివ్యజ్ఞానం.

التفاسير:

external-link copy
5 : 46

وَمَنْ اَضَلُّ مِمَّنْ یَّدْعُوْا مِنْ دُوْنِ اللّٰهِ مَنْ لَّا یَسْتَجِیْبُ لَهٗۤ اِلٰی یَوْمِ الْقِیٰمَةِ وَهُمْ عَنْ دُعَآىِٕهِمْ غٰفِلُوْنَ ۟

మరియు అల్లాహ్ ను వదలి పునరుత్థాన దినం వరకు తమ ప్రార్థనలను విని సమాధాన మివ్వలేనటువంటి వారిని ప్రార్థించే వారి కంటే, ఎక్కువ మార్గభ్రష్టులెవరు? మరియు వారు (తమను ప్రార్థించే) వారి ప్రార్థనలను ఎరుగకుండా ఉన్నారు. info
التفاسير: