Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an mu rurimi rw'igitelugu-Maulana Abder-Rahim Ibun Muhammad.

numero y'urupapuro:close

external-link copy
15 : 34

لَقَدْ كَانَ لِسَبَاٍ فِیْ مَسْكَنِهِمْ اٰیَةٌ ۚ— جَنَّتٰنِ عَنْ یَّمِیْنٍ وَّشِمَالٍ ؕ۬— كُلُوْا مِنْ رِّزْقِ رَبِّكُمْ وَاشْكُرُوْا لَهٗ ؕ— بَلْدَةٌ طَیِّبَةٌ وَّرَبٌّ غَفُوْرٌ ۟

వాస్తవంగా, సబా వారి కొరకు, వారి నివాస స్థలంలో ఒక సూచన ఉంది.[1] దాని కుడి మరియు ఎడమ ప్రక్కలలో రెండు తోటలు ఉండేవి (వారితో): "మీ ప్రభువు ప్రసాదించిన ఆహారం తిని ఆయనకు కృతజ్ఞతలు తెలుపండి!" (అని అనబడింది). ఇది చాలా మంచి దేశం మరియు మీ ప్రభువు క్షమాశీలుడు. info

[1] సబా': ఒక జాతి పేరు. బైబిల్ లో వారు షీబా (Sheiba) అనే పేరుతో పిలువబడ్డారు. వారిపై ఒక స్త్రీ రాజ్యాధికారి. అది ఈ నాటి యమన్ లోని 'హ'దరమౌత్ ప్రాంతాలలో ఉండేది. ఆమె సులైమాన్ ('అ.స.) ను కలుసుకొనిన తరువాత ఇస్లాం స్వీకరించింది. అంతకు పూర్వం వారు సూర్యుణ్ణి పుజించేవారు. ఆ రాజ్యపు రాజధాని పేరు మ'ఆరిబ్. వారు డామ్ లు నిర్మించారు. దానివల్ల వారు మంచి పంటలు పండించి సుఖసంతోషాలలో వర్ధిల్లుతూ ఉండేవారు.

التفاسير:

external-link copy
16 : 34

فَاَعْرَضُوْا فَاَرْسَلْنَا عَلَیْهِمْ سَیْلَ الْعَرِمِ وَبَدَّلْنٰهُمْ بِجَنَّتَیْهِمْ جَنَّتَیْنِ ذَوَاتَیْ اُكُلٍ خَمْطٍ وَّاَثْلٍ وَّشَیْءٍ مِّنْ سِدْرٍ قَلِیْلٍ ۟

అయినా వారు విముఖులయ్యారు. కాబట్టి మేము వారి పైకి, కట్టను తెంచి వరదను పంపాము. మరియు వారి రెండు తోటలను చేదైనా ఫలాలిచ్చే చెట్లు, ఝావుక చెట్లు మరియు కొన్ని మాత్రమే రేగు చెట్లు ఉన్న తోటలుగా మార్చాము.[1] info

[1] అస్లీ'న్, ఝావుక చెట్లు (Tamarisk Trees) లేక వాటివంటి చెట్లు. దీని తాత్పర్యమేమిటంటే, వారి అవిశ్వాస వైఖరి మరియు సత్యతిరస్కారం వల్ల, మొదట మంచి ఫలాలనిచ్చే ఆ రెండు తోటలు ఎక్కువగా చేదైన ఫలాలిచ్చే పెద్ద పెద్ద ముండ్లు గల చెట్లుగా మారిపోయాయి. మరియు కొన్ని మాత్రమే మంచి ఫలాలిచ్చే రేగుచెట్లు (Lote-Trees)గా మిగిలి పోయాయి.

التفاسير:

external-link copy
17 : 34

ذٰلِكَ جَزَیْنٰهُمْ بِمَا كَفَرُوْا ؕ— وَهَلْ نُجٰزِیْۤ اِلَّا الْكَفُوْرَ ۟

ఇది వారి కృతఘ్నతకు (సత్యతిరస్కారానికి) బదులుగా వారికిచ్చిన ప్రతిఫలం. మరియు ఇలాంటి ప్రతిఫలం మేము కృతఘ్నులకు తప్ప, ఇతరులకు ఇవ్వము. info
التفاسير:

external-link copy
18 : 34

وَجَعَلْنَا بَیْنَهُمْ وَبَیْنَ الْقُرَی الَّتِیْ بٰرَكْنَا فِیْهَا قُرًی ظَاهِرَةً وَّقَدَّرْنَا فِیْهَا السَّیْرَ ؕ— سِیْرُوْا فِیْهَا لَیَالِیَ وَاَیَّامًا اٰمِنِیْنَ ۟

మరియు మేము వారి మధ్య మరియు మేము శుభాలు ప్రసాదించిన నగరాల మధ్య, స్పష్టంగా కనిపించే నగరాలను స్థాపించి: "వాటి మధ్య సురక్షితంగా రేయింబవళ్ళు ప్రయాణిస్తూ ఉండండి." (అని అన్నాము). info
التفاسير:

external-link copy
19 : 34

فَقَالُوْا رَبَّنَا بٰعِدْ بَیْنَ اَسْفَارِنَا وَظَلَمُوْۤا اَنْفُسَهُمْ فَجَعَلْنٰهُمْ اَحَادِیْثَ وَمَزَّقْنٰهُمْ كُلَّ مُمَزَّقٍ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُوْرٍ ۟

కాని వారు: "ఓ మా ప్రభూ! మా ప్రయాణ దూరాలను పొడిగించు." అని వేడుకొని, తమకు తామే అన్యాయం చేసుకున్నారు. కావున మేము వారిని కథలుగా మిగిల్చి, వారిని పూర్తిగా చెల్లా చెదురు చేశాము.[1] నిశ్చయంగా, ఇందులో సహనశీలుడు, కృతజ్ఞుడు అయిన ప్రతీ వ్యక్తికి సూచనలున్నాయి. info

[1] మ'ఆరిబ్ డామ్, తెగిన తరువాత అక్కడి ప్రజలు ఇటూ అటూ చెల్లాచెదరై పోయారు.

التفاسير:

external-link copy
20 : 34

وَلَقَدْ صَدَّقَ عَلَیْهِمْ اِبْلِیْسُ ظَنَّهٗ فَاتَّبَعُوْهُ اِلَّا فَرِیْقًا مِّنَ الْمُؤْمِنِیْنَ ۟

వాస్తవానికి ఇబ్లీస్ (షైతాన్) వారి విషయంలో తాను ఊహించింది సత్యమయిందని నిరూపించాడు. ఎందుకంటే! విశ్వాసులలోని ఒక వర్గం వారు తప్ప, అందరూ వాడిని అనుసరించారు. info
التفاسير:

external-link copy
21 : 34

وَمَا كَانَ لَهٗ عَلَیْهِمْ مِّنْ سُلْطٰنٍ اِلَّا لِنَعْلَمَ مَنْ یُّؤْمِنُ بِالْاٰخِرَةِ مِمَّنْ هُوَ مِنْهَا فِیْ شَكٍّ ؕ— وَرَبُّكَ عَلٰی كُلِّ شَیْءٍ حَفِیْظٌ ۟۠

మరియు వాడికి (షైతాన్ కు) వారిపై ఎలాంటి అధికారం లేదు.[1] కాని, పరలోకాన్ని విశ్వసించేవాడెవడో (మరియు) దానిని గురించి సంశయంలో పడ్డ వాడెవడో, తెలుసుకోవటానికి మాత్రమే (మేమిలా చేశాము) మరియు నీ ప్రభువు ప్రతి విషయాన్ని కనిపెట్టుకొని ఉంటాడు. info

[1] చూడండి, 14:22.

التفاسير:

external-link copy
22 : 34

قُلِ ادْعُوا الَّذِیْنَ زَعَمْتُمْ مِّنْ دُوْنِ اللّٰهِ ۚ— لَا یَمْلِكُوْنَ مِثْقَالَ ذَرَّةٍ فِی السَّمٰوٰتِ وَلَا فِی الْاَرْضِ وَمَا لَهُمْ فِیْهِمَا مِنْ شِرْكٍ وَّمَا لَهٗ مِنْهُمْ مِّنْ ظَهِیْرٍ ۟

వారితో ఇలా అను: "అల్లాహ్ ను వదలి మీరు ఎవరినైతే, (ఆరాధ్యదైవాలుగా) భావిస్తున్నారో, వారిని పిలిచి చూడండి!" ఆకాశాలలో గానీ మరియు భూమిలో గానీ రవ్వ (పరమాణువు) అంత వస్తువుపై కూడా వారికి అధికారం లేదు. మరియు వారికి ఆ రెండింటిలో ఎలాంటి భాగస్వామ్యమూ లేదు. మరియు ఆయనకు వారిలో నుండి ఎవ్వడూ సహాయకుడునూ కాడు.[1] info

[1] చూడండి, 17:56-57.

التفاسير: