Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an mu rurimi rw'igitelugu-Maulana Abder-Rahim Ibun Muhammad.

external-link copy
30 : 2

وَاِذْ قَالَ رَبُّكَ لِلْمَلٰٓىِٕكَةِ اِنِّیْ جَاعِلٌ فِی الْاَرْضِ خَلِیْفَةً ؕ— قَالُوْۤا اَتَجْعَلُ فِیْهَا مَنْ یُّفْسِدُ فِیْهَا وَیَسْفِكُ الدِّمَآءَ ۚ— وَنَحْنُ نُسَبِّحُ بِحَمْدِكَ وَنُقَدِّسُ لَكَ ؕ— قَالَ اِنِّیْۤ اَعْلَمُ مَا لَا تَعْلَمُوْنَ ۟

మరియు (జ్ఞాపకం చేసుకో!) నీ ప్రభువు దేవదూతలతో: "వాస్తవంగా నేను భూమిలో ఒక ఉత్తరాధికారిని (ఖలీఫాను)[1] సృష్టించబోతున్నాను!" అని చెప్పినపుడు, వారు: "ఏమీ? నీవు భూమిలో కల్లోలం రేకెత్తించే వానిని మరియు నెత్తురు చిందించే వానిని నియమించబోతున్నావా? మేము నీ స్తోత్రం చేస్తూ, నీ పవిత్రతను కొనియాడుతూనే ఉన్నాము కదా!" అని విన్నవించు కున్నారు. దానికి ఆయన: "నిశ్చయంగా, మీకు తెలియనిది నాకు తెలుసు!" అని అన్నాడు. info

[1] 'ఖలీఫా: అంటే భూమిలో తరతరాలుగా వచ్చే జనపదం, ఉత్తరాధికారి. చూడండి, 6:165, 27:62, 35:39. మానవుడు భూమిలో అల్లాహ్ (సు.తా.) యొక్క ప్రతినిధి అనటం సరైనది కాదు.

التفاسير: