Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an mu rurimi rw'igitelugu-Maulana Abder-Rahim Ibun Muhammad.

మర్యమ్

external-link copy
1 : 19

كٓهٰیٰعٓصٓ ۟

కాఫ్ - హా - యా - ఐన్ - సాద్[1]. info

[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

التفاسير:

external-link copy
2 : 19

ذِكْرُ رَحْمَتِ رَبِّكَ عَبْدَهٗ زَكَرِیَّا ۟ۖۚ

ఇది నీ ప్రభువు తన దాసుడు జకరియ్యాపై చూపిన కారుణ్య ప్రస్తావన. info
التفاسير:

external-link copy
3 : 19

اِذْ نَادٰی رَبَّهٗ نِدَآءً خَفِیًّا ۟

అతను తన ప్రభువును రహస్యంగా (ఏకాంతంలో) మొరపెట్టుకుంటూ; info
التفاسير:

external-link copy
4 : 19

قَالَ رَبِّ اِنِّیْ وَهَنَ الْعَظْمُ مِنِّیْ وَاشْتَعَلَ الرَّاْسُ شَیْبًا وَّلَمْ اَكُنْ بِدُعَآىِٕكَ رَبِّ شَقِیًّا ۟

ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నా ఎముకలు బలహీనమై పోయాయి మరియు నా తల (వెంట్రుకలు) ముసలితనం వల్ల తెల్లబడి మెరిసిపోతున్నాయి మరియు ఓ నా ప్రభూ! నిన్ను వేడుకొని నేను ఎన్నడూ నిష్పలుడను కాలేదు! info
التفاسير:

external-link copy
5 : 19

وَاِنِّیْ خِفْتُ الْمَوَالِیَ مِنْ وَّرَآءِیْ وَكَانَتِ امْرَاَتِیْ عَاقِرًا فَهَبْ لِیْ مِنْ لَّدُنْكَ وَلِیًّا ۟ۙ

మరియు వాస్తవానికి నా తరువాత నా బంధువులు (ఏమి చేస్తారో అని) నేను భయ పడుతున్నాను. నా భార్యనేమో గొడ్రాలు. కావున (నీ అనుగ్రహంతో) నాకు ఒక వారసుణ్ణి ప్రసాదించు. info
التفاسير:

external-link copy
6 : 19

یَّرِثُنِیْ وَیَرِثُ مِنْ اٰلِ یَعْقُوْبَ ۗ— وَاجْعَلْهُ رَبِّ رَضِیًّا ۟

అతడు నాకు మరియు యఅఖూబ్ సంతతి వారికి వారసుడవుతాడు మరియు ఓ నా ప్రభూ! అతనిని నీకు ప్రీతిపాత్రునిగా చేసుకో!" info
التفاسير:

external-link copy
7 : 19

یٰزَكَرِیَّاۤ اِنَّا نُبَشِّرُكَ بِغُلٰمِ ١سْمُهٗ یَحْیٰی ۙ— لَمْ نَجْعَلْ لَّهٗ مِنْ قَبْلُ سَمِیًّا ۟

(అతనికి ఇలా జవాబివ్వబడింది): "ఓ జకరియ్యా! నిశ్చయంగా, మేము నీకు 'యహ్యా' అనే పేరు గల ఒక కుమారుని శుభవార్తను ఇస్తున్నాము![1] ఇంతకు పూర్వం మేము ఈ పేరు ఎవ్వరికీ ఇవ్వలేదు." info

[1] చూడండి, 3:39.

التفاسير:

external-link copy
8 : 19

قَالَ رَبِّ اَنّٰی یَكُوْنُ لِیْ غُلٰمٌ وَّكَانَتِ امْرَاَتِیْ عَاقِرًا وَّقَدْ بَلَغْتُ مِنَ الْكِبَرِ عِتِیًّا ۟

(జకరియ్యా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నాకు కుమారుడు ఎలా కలుగుతాడు? నా భార్యనేమో గొడ్రాలు,[1] మరియు నేనేమో వృద్ధాప్యంతో క్షీణించి (దుర్భలుడనై) పోయాను?" info

[1] 'జకరియ్యా ('అ.స.) భార్య, మర్యమ్ ('అ.స.) తల్లి యొక్క సోదరిమణి అని కొందరంటారు. చూడండి, 3:37 వ్యాఖ్యానం 3. మరికొందరు ఆమె మర్యమ్ ('అ.స.) తండ్రి 'ఇమ్రాన్ కూతురని అంటారు. అంటే య'హ్యా ('అ,స.) మరియు 'ఈసా ('అ.స.) అక్కాచెల్లేళ్ళ కుమారులు, అంటె కజిన్ లు. ('స'హీ'హ్ అ'హాదీస్ ల ఆధారంగా, ఫ'త్హ్ అల్-ఖదీర్.)

التفاسير:

external-link copy
9 : 19

قَالَ كَذٰلِكَ ۚ— قَالَ رَبُّكَ هُوَ عَلَیَّ هَیِّنٌ وَّقَدْ خَلَقْتُكَ مِنْ قَبْلُ وَلَمْ تَكُ شَیْـًٔا ۟

ఇలా జవాబిచ్చాడు: "అలాగే అవుతుంది. నీ ప్రభువు ఇలా అంటున్నాడు: 'ఇది నాకు సులభం మరియు వాస్తవానికి ఇంతకు ముందు నీవు ఏమీ లేనప్పుడు, నేను నిన్ను సృష్టించాను కదా!'" info
التفاسير:

external-link copy
10 : 19

قَالَ رَبِّ اجْعَلْ لِّیْۤ اٰیَةً ؕ— قَالَ اٰیَتُكَ اَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلٰثَ لَیَالٍ سَوِیًّا ۟

(జకరియ్యా) అన్నాడు: " ఓ నా ప్రభూ! నాకొక గుర్తును నియమించు." ఇలా జవాబు ఇవ్వబడింది: "నీ గుర్తు ఏమిటంటే! నీవు స్వస్థతతో ఉండి కూడా వరుసగా మూడు రాత్రులు (దినములు) ప్రజలతో మాట్లాడలేవు."[1] info

[1] చూడండి, 3:41

التفاسير:

external-link copy
11 : 19

فَخَرَجَ عَلٰی قَوْمِهٖ مِنَ الْمِحْرَابِ فَاَوْحٰۤی اِلَیْهِمْ اَنْ سَبِّحُوْا بُكْرَةً وَّعَشِیًّا ۟

ఆ పిదప అతను (జకరియ్యా) తన ప్రార్థనాలయం నుండి బయటికి వచ్చి తన జాతి వారికి, సైగలతో ఉదయమూ మరియు సాయంత్రమూ, ఆయన (ప్రభువు) పవిత్రతను కొనియాడండని సూచించాడు. info
التفاسير: