[1] అల్లాహుతా'ఆలా ప్రజలను ప్రతి పాపానికి పట్టి శిక్షించడు. కాని పాపాత్ముల పాపాలు చాలా అయినప్పుడు అల్లాహ్ (సు.తా.) శిక్ష వచ్చి పడుతోంది. ఆ సమయంలో పుణ్యాత్ములు కూడా దాని నుండి తప్పించుకోలేరు. కాని వారు (పుణ్యాత్ములు) పరలోకంలో అల్లాహ్ (సు.తా.) సన్నిహితులలో ఉంటారు. ('స. బు'ఖారీ 2118, 'స. ముస్లిం, 2206 మరియు 2210). [2] దీని మరొక తాత్పర్యం ఈ విధంగా ఉంది: 'ఇక వారి కాలం వచ్చినప్పుడు, వారు దానిని ఒక్క ఘడియ ఆలస్యం చేయలేరు, లేక ఒక్క ఘడియ ముందుగానూ తేలేరు.'